జాజ్: హోండా యొక్క కొత్త బెస్ట్ సెల్లర్!
హోండా జాజ్ 2014-2020 కోసం manish ద్వారా ఆగష్టు 05, 2015 12:24 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జూలై నెలలో హోండా అమ్ముడైన ఉత్తమమైన మోడల్ గా హోండా జాజ్ వాహనం హోండా సిటీ ని మించిపోయింది. హోండా జాజ్ అత్యుత్తమమైన లక్షణాలతో అనేక మంది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. హోండా జాజ్ ఖచ్ఛితంగా 6.676 యూనిట్లు అథ్యధికంగా అమ్ముడుపోగా, హోండా సిటీ 5,180 యూనిట్లు అమ్ముడుపోయాయి. హోండా యొక్క అన్ని కార్లు జూలై 2014 తో పోలిస్తే అమ్మకాల శాతం 18 శాతం వృద్ధిని చూసింది. జులై 2014 లో హోండా 15,709 కార్లు అమ్మకాలు చేసింది. అదే 2015 జులైలో 18,606 కార్లు అమ్మకాలు జరిగాయి.
మొదటి తరం హోండా జాజ్ అప్పటిలో దాని ధరతో అలానే దానిలో ఉండే లక్షణాలతో కొనుగోలుదారులని ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఉన్న హోండా జాజ్ మునుపటి దానికి పూర్తి విరుద్ధంగా కొత్త డీజిల్ ఇంజిన్ మరియు అద్భుతమైన ధరతో వినియోగదారుల హృదయాలు దోచుకుంటుంది.
హోండా జాజ్ కారు హోండా సిటీ లో ఉన్న అదే 1.5-లీటర్ ఐ డిటెక్ డీజిల్ యూనిట్ తో అమర్చబడి ఉంది. అలానే 1.2 లీటర్ ఐ-వి టెక్ ఇంజిన్ ని దాని పెట్రోల్ వేరియంట్స్ కొరకు అందిస్తుంది. ఇదే 1.2 లీటర్ ఐ-వి టెక్ ఇంజిన్ అమేజ్ మరియు బ్రియో లో కూడా ఉంది. హోండా జాజ్ దాని ప్రీమియం హాచ్బాక్ అయిన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాటితో పోటీ పడుతున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా జులై నెలలో 14,556 కార్లు అమ్మకాలు చేసింది. ఈ భారత వాహన తయారీసంస్థ ని కూడా హోండా అధిగమించింది.