జాగ్వార్ వారి ఎఫ్-పేస్ ని మొదటిసారిగా బహిర్గతం చేసారు, ఇది యానిమేషన్ వీడియోలో అవతారమెత్తింది!
జాగ్వర్ దాని మొట్టమొదటి క్రాస్ఓవర్, ఎఫ్-పేస్ తో ఊరిస్తుంది. కానీ ఆలస్యంగా వారు చివరకు దాని ప్రక్క ప్రొఫైల్ ని ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో బహిర్గతం ప్రదర్శించారు. ఇది ఒకే విధమైన డిజైన్ కలిగి ఉండి ఎక్కువగా సి-ఎక్స్17 కాన్సెప్ట్ ని పోలి ఉంటుంది.
దీనిలో సాంకేతికాలు అల్యూమినియం-ఇంటెన్సివ్ నిర్మాణం చేయబడి ఒకేసారి తేలికగా మరియు దృఢమైనదిగా అవ్వగలిగే జాగ్వార్ యొక్క ఐక్యు [ఎ ఎల్] వేదిక మీద ఆధారపడి ఉంటాయి. ఇది ముందర భాగానికి ఒక డబుల్ విష్బోన్ సస్పెన్షన్ ను మరియు వెనుక భాగానికి ఇంటిగ్రల్ లింక్ సస్పెన్షన్ ని కలిగి ఉంది. దీని అంతర్భాగాలు చాలా విశాలంగా 5 ప్రయాణికులు కూర్చోడానికి మాత్రమే కాకుండా వారి సామాను పెట్టుకునేందుకు కూడా స్థలాన్ని కలిగి ఉంది.
నాలుగు సిలిండర్ల్స్ గ్యాసొలీన్ మరియూ డీజిల్ యూనిట్స్ లో భాగం అయిన కొత్త వరుస ఇంజెనియం మోటర్స్ తో దీనికి శక్తి అందుతుంది. ఒకపక్క, "ఎస్" ట్రిం యొక్క ఎఫ్-పేస్ కి ప్రస్థుతం 3.0-లీటర్ సూపర్ చార్జ్డ్ వీ6 కలిగి ఉంది మరియూ సూపర్చార్జ్డ్ 5.0-లీటర్ వీ8 తరువాత దశలో అందించబడుతుంది. పైగా, పూర్తిగా ఎలెక్ట్రిక్ ఇంజిను వచ్చే అవకాశం ఉంది కాని అది ఇప్పట్లో కాబోదు.
సొలిహిల్ ఆధారిత ఎఫ్-పేస్ వచ్చే ఏడాది అమ్మకానికి వెళ్ళనుంది మరియూ అదే ఏడాది భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఆడీ క్యూ5, బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడేజ్ ఎం-క్లాస్ మరియూ దాని బంధువు అయిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ తో తలపడనుంది.