• English
  • Login / Register

జేమ్స్ బాండ్ యొక్క స్పెక్టర్ లో జాగ్వార్ సి- ఎక్స్75 (వీడియో మరియు చిత్రం గ్యాలరీ)

జాగ్వార్ సి ఎక్స్75 కోసం nabeel ద్వారా నవంబర్ 23, 2015 07:02 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

జేమ్స్ బాండ్ సినిమాలు, ఎల్లప్పుడూ కొన్ని అద్భుతమైన కార్లను కలిగి ఉంటాయి. కానీ ఈ సమయంలో, వారు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకమైన కార్లను ప్రవేశపెట్టారు. మిస్టర్ 007 అను వ్యక్తి డిబి10 అను వాహనాన్ని నడుపుతున్నాడు మరియు అతని శత్రువు అయినటువంటి వ్యక్తి జాగ్వార్ సి- ఎక్స్75 వాహనాన్ని నడుపుతూ అతన్ని చేజ్ చేస్తున్నాడు. పాత్రలు పరంగా చెప్పలంటే, ఈ జాగ్వార్ వాహనం, డిబి10 వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది.  

Jaguar C-X75

2010 వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన, సి- ఎక్స్75 జాగ్వార్ వాహనం 'ఆవిష్కరణ లో ఒక కొత్త అధ్యాయాన్ని మరియు సాంకేతిక అభివృద్ది ని తీసుకొని వచ్చింది. కేవలం మొదటి రెండు సంవత్సరాలలోనే, ఈ వాహనం ఆల్ వీల్ డ్రైవ్, పవర్ తో కూడిన ప్లగ్ ఇన్ పేర్లల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (పి హెచ్ ఈ వి) మరియు జాగ్వార్ యొక్క మొదటి కాపోసైట్ మొనొకోక్యూ చాసిస్ తో రూపొందించబడింది. పనితీరు గురించి మాట్లాడటానికి వస్తే, సి- ఎక్స్75 వాహనం అత్యధికంగా, 850 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1000 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే 1.6 లీటర్ డ్యూయల్ బూస్ట్ (టర్బోచార్జెడ్ మరియు సూపర్ చార్జెడ్) నాలుగు సిలండర్ల ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 10,000 ఆర్ పి ఎం మధ్యలో 501 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 7- స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు 200 మిల్లీ సెకన్ల లోపే గేర్ షిఫ్ట్ లను అనుమతిస్తుంది.   

Jaguar C-X75

సి- ఎక్స్75 వాహనంలో బ్యాటరీ ప్యాక్ అత్యధికంగా 300 కిలోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ జాగ్వార్ వాహనం యొక్క త్వరణం గురించి మాట్లాడటానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి ఆరు సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఈ వాహనం, 321 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకొనే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం, 354 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

Jaguar C-X75

గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అయిన అడ్రియన్ హాల్మార్క్ జాగ్వార్ మాట్లాడుతూ, "ఈ జాగ్వార్ సి- ఎక్స్75 జాగ్వార్ యొక్క ఇంజనీరింగ్ మరియు డిజైన్ నైపుణ్యం పరాకాష్టలను సూచిస్తుంది "అన్నారు. ఇది, విస్మయం- స్పూర్తినిస్తూ ప్రదర్శన తో చెప్పుకోదగిన హైబ్రిడ్ పవర్ట్రెయిన్ అని చెప్పవచ్చు . అంతేకాకుండా, దీనిని ప్రపంచంలో అత్యంత అధునాతన సాంకేతిక వేగవంతమైన వాహనం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇంకా చదవండి : స్పెక్టర్ నుండి జాగ్వార్ సీ-ఎక్స్75 లండన్‌లో జరిగే లార్డ్ మేయర్ యొక్క షోలో ఆరంగ్రేటం చేయనుంది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Jaguar సి ఎక్స్75

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హైబ్రిడ్ కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience