భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద జాగ్వార్
టాటా సంస్థ సొంతమైన జాగ్వార్, భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద దాని తాజా కార్లు ప్రదర్శించనుంది. XE వాహనం BMW 3-సిరీస్, ఆడి A4 మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది మరియు సెంటర్ స్టేజ్ లో ఉంటుంది. ఆ తర్వాత XJ ఫేస్లిఫ్ట్, నెక్స్ట్ జెన్ ఎక్ష్ ఎఫ్ మరియు కొత్త F-పేస్ వంటి దాని ఇతర వాహనాలు కూడా ఉంటాయి. ఎరీనాలో ఫెలీన్ ఫ్యామిలీ బే ని సందర్శించండి కానీ అంతకంటే ముందే ఇక్కడ చీపబడిన కార్ల యొక్క సంక్షిప్త వివరాలు చూడండి.
XE:
లగ్జరీ సెడాన్ విభాగంలోనికి వచ్చిన ఈ XE వాహనం 70 శాతం కంటే ఎక్కువ స్పేస్ ఫ్రేమ్ అల్యూమినియం ఉపయోగిస్తుంది. దీనివలన వాహనం చాలా తేలికైనదిగా ఉండి డ్రైవింగ్ డైనమిక్స్ లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. XE పైన కొనసాగించిన ఇటీవలి క్రాష్ టెస్ట్ లో ఈ వాహనం యూరో NCAP ద్వారా భద్రమైన కారు గా అవార్డు పొందింది. అంతేకాకుండా, దీని బాహ్య భాగాలు డకెడ్-డౌన్ నోస్, మెష్ గ్రిల్, ఉత్తేజకరమైన హెడ్ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్ డిజైన్ ని కలిగి ఉంటుంది. దీనిలో అంతర్భాగాలు ఎక్కువగా లెథర్ తో అందించబడుతుంది మరియు అత్యుత్తమ నాణ్యత ప్లాస్టిక్ అలాగే అల్యూమినియం ఉపయోగించి జరుగుతుంది. దీనిలో మూడు పవర్ సోర్స్ లు అందించబడతాయని భావిస్తున్నాము అవి పెట్రోల్ మరియు సమతులమైన పనితీరు మరియు మైలేజ్ తో డీజిల్, పెర్ఫార్మెన్స్ V6 పెట్రోల్.
F -పేస్
జాగ్వార్ యొక్క మొట్టమొదటి శూవ్ నోయిడా లో ఎక్స్పో అరేనా వద్ద ప్రదర్శించనున్నారు. ఇది చక్కనైన వైఖరి మరియు చాలా ఆకర్షణీయమైన లక్షణాలతో ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ వాహనం ఇప్పటివరకూ తయారీదారు యొక్క వెబ్సైట్ లో దాని కొన్ని ప్రోమో వీడియోలు మరియు చిత్రాలతో ప్రదర్శన ఇచ్చింది. ఇది 2016 మధ్య భాగంలో ఉత్పత్తి చేయబడవచ్చు మరియు విడుదల సంవత్సరం తరువాత జరుగుతుంది.
తదుపరి తరం XF
ఎక్ష్ ఎఫ్ దాని తాజా ఫేస్లిఫ్ట్ ని ప్రదర్శించనున్నది, ఈ వాహనం తిరిగి రూపొందించిన ముందర మరియు వెనుక భాగాన్ని కలిగి ఉంది. ఈ ఇంజిన్లు శుద్ధీకరణ స్థాయి పెరగడంతో ప్రస్తుత లైనప్ నుండి పొందవచ్చు, ఇది కారు యొక్క పనితీరు మరియు మైలేజ్ ని పెంచేందుకు తోత్పడుతుంది.
ఇతర జాగ్వార్ కార్లు
వీటితో పాటూ తయారీదారులు అందించే పనితీరు గల కార్లను కూడా చూడవచ్చు. జాగ్వార్ సంస్థ ఇటువంటి కార్లను చూపిస్తుందని నమ్ముతున్నాను. F-Type R AWD లేదా XE-R లేదా C-X17 వంటి కొన్ని కార్లు దీనికి ఉదాహరణ.