అమ్మకాలు అభివృద్ధి వేడుకలను మారుతి మరియు హ్యుందాయ్ అత్యంత త్వరగా జరుపుకోనుందా?
ఆగష్టు 17, 2015 01:58 pm manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతి సుజుకీ, హ్యుందాయ్ తమ డిమాండ్ డేటా మోసపూరితమైనది కావచ్చునని సూచించారు. ఇటీవల వాహన తయారీ సంస్థ రెండంకెల వృద్ధి రేటును పొందింది. దీనికిగాను కొనుగోలుదారులు షోరూం లకు తిరిగి వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు కానీ డీలర్స్ మరియు వాహన తయారీదారుల ప్రకారం, ఇది కొంతమేరకు సంతోషించవలసిన విషయంగా చెప్పవచ్చు.
ఈ విషయమై మారుతి సుజుకి సేల్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ ఈ విధంగా చెప్పారు. "మేము మార్కెట్ ను కైవసం చేసుకున్నామని చెప్పడం లేదు. మేము తక్కువ స్థాయి నుండి అభివృద్ధిని సాధిస్తూ వచ్చాము. జూలై అమ్మకాల గురించి మాట్లాడితే,అవి కొద్దిగా తప్పుగా అనిపిస్తున్నాయి. గత సంవత్సరం జూన్ లో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు నిలిపివేసేలా ఉన్న కారణంగా చాలా వరకూ వాహనాలు డీలర్షిప్ల వద్దకు నెట్టివేయబడినవి "అని అన్నారు.
ప్యాసింజర్ వాహనాల మీద మునుపటి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ అధికారులు జూన్ 2014 వరకు నాలుగు నుండి ఆరు శాతం చెల్లుబాటును తగ్గించారు. రాయితీని ఉపసంహరించలేని కారణంగా గత సంవత్సరం జూలై వరకు హోల్ సేల్ మరియు రిటైల్ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయని కల్సీ జోడించారు.
జూలై లో, హ్యుందాయ్ అమ్మకాలు 36,500 యూనిట్లతో 25 శాతం పెరిగాయి. కంపెనీ ఇప్పుడు మార్కెట్ లో 17 శాతం వాటాను కలిగి ఉంది.
దీని గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ ఈ విధంగా స్పందించారు. ఇప్పుడు రిటైల్ స్థాయిలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే మేము హోల్ సేల్ లో అభివృద్ధి కోసం చూస్తున్నాము. అమ్మకాల అభివృద్ధి ఎల్లప్పుడూ కూడా కొత్త ఉత్పత్తుల మీద గాని లేద కొన్ని ప్రసిద్ధి చెందిన మోడళ్ల మీద గానీ ఆధారపడి ఉంటుందని అన్నారు.
డిస్కౌంట్ స్థాయి పెరుగుదల కారణంగా ఈ సంవత్సరం అమ్మకాలు ఆశాజనకంగా మరియు విలక్షణంగా పెరిగాయి.
సంస్థ అందించిన నగదు డిస్కౌంట్ వంటి వాటితో పాటూ డీలర్స్ కూడా సేల్స్ అవుట్లెట్లు అంతటా ఉచిత ఇన్సూరెన్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటి అధనపు లాభాలు అందిస్తున్నారు. మారుతి సుజుకి ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేథ్ మాత్లాడుతూ " మార్చి త్రైమాసికంలో సగటు డిస్కౌంట్ రూ .15,116 కాగా జూన్ త్రైమాసికంలో గరిష్టంగా రూ. 16,018 వద్ద నిలిచింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే డిస్కౌంట్ సుమారు రూ .1,000 ఎక్కువగా ఉంది". అని అన్నారు.
ఇంధన ధరలు గణనీయమైన తగ్గుదలతో ఆటో రుణాలు మొత్తం వ్యయం అధికంగా ఉంటాయి. ఎందుకంటే, డీలర్స్ వారి దృష్టి మొత్తం డిస్కౌంట్ పైన చూపిస్తున్నారు. దానిని భర్తీ చేసేందుకుగానూ రుణాల వ్యయం ఎక్కువ అవుతుంది.
మహీంద్రా & మహీంద్రా యొక్క ప్రజాదరణలేని ఎంపికలు అయిన జైలో మరియు క్వాంటో అత్యధిక డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పవన్ గోయెంకా ఈ విధంగా మాట్లాడుతూ" మొత్తంలో ఎటువంటి మార్పు లేదు; డిస్కౌంట్ ఎప్పటిలానే కొనసాగుతూ ఉన్నాయి మరియు తదుపరి అధికమవుతాయి " అన్నారు.
హ్యుండాయి ఎలైట్ ఐ20, హోండా సిటీ, మారుతి సెలెరియో ఎ ఎంటి, టయోటా ఫార్చ్యూనర్ మరియు కొత్తగా ప్రారంభించబడిన మారుతి ఎస్ క్రాస్, హ్యుండాయి క్రెటా, హోండా జాజ్ మరియు మహీంద్రా ఎక్స్యువి500 వంటి వాటికి ఎటువంటి డిస్కౌంట్స్ లేవు.