• English
  • Login / Register

సుజుకీ ఐఎం-4 కి ఇగ్నిస్ ఒక కొత్త పేరా?

సెప్టెంబర్ 02, 2015 01:57 pm manish ద్వారా సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సబ్-కాంపాక్ట్ కార్లకి పెరుగుతున్న ప్రజాదరణ భారతీయ రోడ్ల ప్స్రిస్థితి గురించి అయి ఉండవచ్చును అని అనుకోవచ్చు. ఈ విచారకర పరిస్థితి ని అవకాశంగా చేసుకుని సుజూకీ వారు కాంపాక్ట్ ఎస్యూవీ అయిన ఐఎం-4 ని ఈ ఏడాది మొదట్లో ప్రదర్శించారు. ఈ ఆవిష్కారం 2015 జెనీవా మోటర్ షోలో చోటు చేసుకుంది. ఈ కారు యొక్క పేటెంట్ ఫోటోలు ఆన్లైన్ లో కనపడినప్పటి నుండి, ఈ కారు త్వరలోనే ఇగ్నిస్ పేరున మార్కెట్ లోకి విడుదల అవుతుంది అను తెలుస్తోంది. సుజుకీ వారు దీనిని ఇగ్నిస్ మానికర్ పేరిట 2000-2008 కలంలో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మడం జరిగింది. సుజుకీ యొక్క ఇన్స్టాగ్రాం ఫ్యాన్ పేజీలో కనపడిన ఈ ఫోటోలు ఉత్పత్తి మోడల్ మరియూ ఐఎం-4 కాన్సెప్ట్ కారు పోలికలు కలిగి ఉంది. 

తయారీకి సిద్దంగా ఉన్న ఐఎం-4 లేదా ఇగ్నిస్ కి 1.0-లీటర్ 3-సిలిండర్ల బూస్టర్జెట్ ఇంజిను అమర్చబడి ఉండచ్చు. ఇది మొదటి సారిగా కొత్త సుజూకీ బలెనో లో ఆరంగ్రేటం చేయనుంది. ఈ కారు కి ఇతర ఇంజిను ఎంపికలు కూడా కలవు. అవి యూరప్ ఆధారిత నిర్దేశాలతో కూడిన స్విఫ్ట్ యొక్క 1.2-లీటర్ డ్యువల్జెట్ ఇంజిను మరియూ ఫియట్ ఆధారిత 1.3-లీటర్ డీజిల్ మోటరు కలిగి ఉండవచ్చును.  

ఎటువంటి అధికారిక ప్రకటన కంపెనీ వారి నుండి ఈ విషయం పై రాలేదు మరియూ ఇగ్నిస్ అసలు భారతదేశానికి వస్తుందా లేదా అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. ఒక కాంపాక్ట్ ఎస్యూవీ పై మారుతీ వారు పనిచేస్తున్నారు. ఇది భారత్దేసపు రోడ్ల పైకి త్వరలోనే వైబీఏ అనే పేరుతో రానుంది. ఆన్లైన్ లో కనపడిన ఫోటోల ఆధారంగా ఈ కారు 2012 ఆటో ఎక్స్పో లో ప్రదర్శితమైన ఎక్సే ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపొందింది అని తెలుస్తుంది. మొదట అందించిన కాన్సెప్ట్ కి ఇది ఎంతవరకు దగ్గరగా పోలి ఉంటుందో అనే విషయాన్ని చూడాలి. 

వారి అధ్బుతమైన అంశములు తయారీలోకి తేవడం సుజూకీ వారికి ఇది కొత్తేమీ కాదు. గతంలో, కిజాషీ మరియూ ఏ-స్టార్ మోడల్స్ కూడా ఇలా వచ్చినవే. ఇందువల రాబోయే సుజూకీ మోడల్స్ పై ఆశక్తి పెంచుతోంది. అధ్బుతమైన ఈ జపనీస్ ఆటోమేకర్ యొక్క అంశములు ఆవిష్కృతమయ్యి, ఇవి ఎంత వరకు అసలు మొదటి మోడల్ కి అచ్చు ఉంటుందా మరియూ ఇకపై ఏవేమి మోడల్స్ రానున్నాయా అన్న ఆశ్చర్యం పెంచుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience