ఇండియా బౌండ్: బాలేనో అనగా వైఆర్ ఎ అధికారిక చిత్రాలను విడుదల చేసిన సుజికీ
సెప్టెంబర్ 01, 2015 11:29 am raunak ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అధికారిక చిత్రాలలో విజృభించిన మారుతి సుజుకి యొక్క ఎలైట్ ఐ20
జైపూర్:మారుతి అధికారికంగా వైఆర్ ఎ హాచ్బాక్ అనగా బాలెనో యొక్క చిత్రాలను విడుదల చేసింది. ఈ నిర్దేశ ఉత్పత్తి రాబోయే 66 వ ఐఐఎ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో (15 సెప్టెంబర్ 2015) వద్ద అధికారికంగా అరంగేట్రం చేయనున్నది. దీని కాన్సెప్ట్ వెర్షన్ జెనీవా మోటార్ షోలో ఈ సంవత్సరం బహిర్గతమైంది. దీని భారతీయ ప్రయోగం గురించి మాట్లాడుకుంటే, మారుతీ ఈ పేరుని తొలగించి 2015 లో ప్రారంభించటానికి అవకాశం ఉంది. యూరోపియన్ మార్కెట్ లో, కొత్త బాలెనో తదుపరి వసంత ఋతువులో అమ్మకానికి వెళ్తుంది.
సంస్థ ఈ వాహనం యొక్క నిర్దేశాలు మరియు కొలతలను విడుదల చేయలేదు. ఈ వివరాలు ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో బయట పడతాయని సంస్థ తెలిపింది. జపనీస్ తయారీసంస్థ ఒక 1.0-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బోచార్జ్డ్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఎస్ హెచ్ వి ఎస్ (స్మార్ట్ హైబ్రిడ్ సుజుకి వెహికిల్) లక్షణం కలిగిన ఇంజిన్ తో అమర్చబడి ప్రపంచవ్యాప్తంగా సమీకృత స్టార్టర్ జెనరేటర్ ద్వారా అధారితం చేయబడవచ్చని తెలిపింది. భారతదేశం పరంగా, మారుతీ సంస్థ ఈ ఇంజిన్ ని 1.2ఎల్ కె10బి ఇంజిన్ తో పాటుగా అందినచవచ్చు. అయితే, 1.3 లీటర్ డిడి ఐ ఎస్ డీజిల్ ఇంజిన్ సియాజ్ వలే ఎస్ హెచ్ వి ఎస్ తో అమర్చబడి ఉండవచ్చని అంచనా. ఈ సియాజ్ రేపు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. దీని డీజిల్ ఇంజిన్ సామర్థ్యం 28 నుండి 30 మధ్యలో ఉండవచ్చని అంచనా.
లక్షణాల పరంగా ఈ హాచ్బాక్ నావిగేషన్ తో 7 - అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనటువంటి అంశాలు సియాజ్ మరియు ఎస్- క్రాస్ నుండి తీసుకోబడినవి. అధికారిక చిత్రాలను చూసినట్లైతే, ఎల్ఇడి డే టైం రన్నింగ్ లైట్లతో స్పోర్ట్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉందని తెలుస్తుంది.