• English
  • Login / Register

హ్యుండై యొక్క ఐ20 N స్పోర్ట్ ఆవిష్కృతమైంది

ఆగష్టు 31, 2015 11:55 am nabeel ద్వారా సవరించబడింది

  • 21 Views
  • 4 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుండై వారి N 2025 విజన్ గ్రాన్ ట్యురిస్మో కాన్సెప్ట్ తో N విభాగాన్ని ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో పాల్గొనేందుకు సిద్దం అయ్యారు. ఐ20, ఐ20 N యొక్క వేగవంతమైన వెర్షన్ ని దక్షిణ ఆఫ్రికా లో ప్రదర్శించారు. మిగతా కార్ల కు తగిన పోటీ ఇచ్చే విధంగా N కి కొన్ని మార్పులు చేర్పులు చేయబడింది.

ఐ20 N కి బయటి వైపున మరింత స్పోర్టియర్ రూపం ఇవ్వబడింది. కొత్త జత 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు మరియు వెనక వైపు బంపర్ కి అమరికలు, సరికొత్త బాడీ కిట్ మరియూ సైడ్ స్కర్ట్స్, ముందు వైపు మడ్ గార్డ్స్ కి N-బ్యాడ్జెస్ మరియూ బూట్ కి వెనుక స్పాయిలర్. ఇంజిను విషయానికి వస్తే, ఐ20 కి 113బీహెచ్పీ తో పాటుగా 160ఎనెం టార్క్ ని అందించే ఒక 1.4-లీటర్ పెట్రోల్ మోటర్ అమర్చబడింది. ఇది మునుపు 98.6బీహెచ్పీ మరియూ 136ఎనెం టార్క్ కంటే మెరుగైనది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ తో మరియూ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. దీని యొక్క సామర్ధ్యాన్ని పెంచేందుకు ఇందులో ఒక స్టెయిన్లెస్స్ స్టీల్ ఫ్రీ-ఫ్లో క్యాట్ బ్యాక్ ఎగ్జాస్ట్ సిస్టం ని అందించడం జరిగింది. ఈ కారు కి 4-వీల్స్ ఎలక్ట్రానిక్ 4-చానెల్ ఏబీఎస్ తో ఈబీడీ సిస్టం మరియూ వెంటీలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ముందు వైపు ఇంకా డిస్క్ బ్రేక్స్ వెనుక వైపు కలిగి ఉంటాయి.

ఇప్పటికైతే, N బ్యాడ్జ్ ఐ20 కేవలం విదేశీ మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఫియట్ అబార్త్ మరియూ ఫోక్స్వాగెన్ వంటి తయారిదారులు వారి కొత్త హ్యాట్చ్ లను భారతదేశం లో అందిస్తున్నారు. హ్యుండై వారు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చునేమో అని ఆశిస్తున్నాము మరియూ దేశం లోని కారు ఔత్సాహికులకు ఈ శక్తివంతమైన ఐ20 N స్పోర్ట్ ని నడిపే అవకాశం కల్పిస్తారు అని అనుకుంటున్నాము. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience