• English
  • Login / Register

హ్యుందాయి ఫైవ్ 2015 గుడ్ డిజైన్ అవార్డ్స్ గెలుచుకుంది

జనవరి 06, 2016 03:13 pm anonymous ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ దాని రాబోయే IONIQ ఆల్టర్నేటివ్ ఇంధన కాంపాక్ట్ వాహనం, కొత్త టుక్సన్, కొత్త ఎలంట్రా, శాంటా క్రూయిజ్ కాన్సెప్ట్ మోడల్ మరియు సంస్థ యొక్క 'స్కల్ప్చర్ ఇన్ మోషన్ 'ఆర్ట్ ఇన్స్టాలేషన్ కొరకు గుడ్ డిజైన్ అవార్డ్స్ ని గెలుచుకుంది. గుడ్ డిజైన్ అవార్డులు అత్యంత వినూత్నమైన, అత్యధునాతన పారిశ్రామిక ఉత్పత్తి మరియు ప్రపంచవ్యాప్తంగా గ్రాఫిక్ నమూనాలకు గానూ అందించడం జరుగుతుంది.

హ్యుందాయ్ మోటార్ యొక్క ఆధునిక ఆల్టర్నేటివ్ ఇంధన కాంపాక్ట్ వాహనం IONIQ దాని ప్రముఖ ఏరోడైనమిక్స్ మరియు అద్భుతమైన రూపకల్పన వివరాల కొరకు ఎంపికయ్యింది. IONIQ సియోల్, కొరియా లో జనవరి 14, 2016 న తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేస్తోంది.

కొత్త హ్యుందాయ్ టక్సన్ పొడవుగా, విస్తృత మరియు ముందు దాని కంటే పొడవాటి వీల్ బేస్ ని కలిగియున్న ఫలితంగా విశాలమైన అంతర్గత స్థలం మరియు మెరుగైన వైవిధ్యంతో అందించబడుతుంది. హెగ్సాగొనల్ షేపెడ్ గ్రిల్, అధిక సామర్థ్యం గల LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, వెనుక చక్రాలు పైన Z ఆకారంలో క్యారెక్టర్ లైన్స్ అథ్లెటిక్ మరియు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేలా చేస్తాయి.

గుడ్ డిజైన్ అవార్డ్స్ హ్యుందాయ్ యొక్క ఎలాంట్రా ను కూడా గుర్తించింది, దీని ద్వారా భవిష్యత్తులో రాబోయే హ్యుందాయి యొక్క కాంపాక్ట్ కార్ల యొక్క డిజైన్ కి ఇది ప్రేరణగా ఉండబోతోంది. కొత్త ఎలాంట్రా హ్యుందాయ్ డైనమిక్ ప్రెసిషన్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుంది.

2015 డెట్రాయిట్ నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో శాంటా క్రుజ్ కాన్సెప్ట్ పరిచయం చేయబడింది. ఇది అధిక డిజైన్ వ్యక్తిత్వం, సామర్థ్యం మరియు యుక్తులు ప్రదర్శించేందుకు రూపొందించబడింది. శాంటా క్రుజ్ విస్తృత వైఖరి, ఉగ్రమైన డిజైన్ మరియు వినూత్న టెయిల్ గేట్ పొడిగింపు వంటి అంశాలకు ప్రసిద్ధి చెందింది. ఇంకా దీనిలో ముందు డోర్ కు సమానంగా ఉండే వెనుక హింజ్ కలిగిన వెనుక భాగపు డోర్స్ కలిగి ఉంటుంది.

హుండాయ్ మోటార్ యొక్క స్కల్ప్చర్ ఇన్ మోషన్ ప్రాజెక్ట్ కూడా గుడ్ డిజైన్ అవార్డు ని కలిగి ఉంది. ఇది ఒక ప్రాణంతో ఉన్న తరంగం ఒక ఫ్లుయిడ్ మోషన్ తో ప్రజ్వలిల్లుతున్న విధంగా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఇది వాహనం యొక్క కదలిక మరియు డిజైన్ రెండిటినీ అనుసంధీకరించే ఒక నిజమైన ఆటోమోటివ్ ప్రపంచంలోని ఒక కాన్సెప్ట్ విధానం.

"గుడ్ డిజైన్ అవార్డ్స్ ఐదుసార్లు విజేతగా నిలబడడం హ్యుందాయ్ మోటార్స్ స్థానం బలపడింది మరియు ఈ గుర్తింపు సంప్రదాయ కంబషన్ ఇంజిన్ల వాహనాలకు మాత్రమే కాకుండా ఎకో ఫ్రెండ్లీ వాహనాలకు మరియు ప్రతిష్టాత్మక డిజైన్ ఆలోచనలకు కూడా గుర్తింపుగా వచ్చింది. " అని హ్యుందాయ్ డిజైన్ సెంటర్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బైయుంగ్ సొయుబ్ లీ తెలిపారు. 

ద్వారా ప్రచురించబడినది
Anonymous
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience