హ్యుందాయ్ వెర్నా Vs హోండా సిటీ: ఈ రెండిటిలో ఏది మెరుగైన ADAS ప్యాకేజీని అందిస్తుంది?

హ్యుందాయ్ వెర్నా కోసం shreyash ద్వారా మార్చి 28, 2023 06:13 pm ప్రచురించబడింది

 • 32 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దాదాపుగా అన్నీ హోండా సిటీ వేరియెంట్‌లలో ADAS సాంకేతికత ఉంటుంది, హ్యుందాయ్ తన వెర్నా యొక్క అగ్ర శ్రేణి వేరియెంట్‌లకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది.

Verna vs City

మార్చి 2023లో, భారతదేశంలో రెండు కొత్త కాంపాక్ట్ సెడాన్ؚలు విడుదల అయ్యాయి; ఒకటి నవీకరించబడిన హోండా సిటీ, రెండవది కొత్త జనరేషన్ హ్యుందాయ్ వెర్నా. ఈ రెండు సెడాన్ؚలు కొత్త ఇంజన్‌లు మరియు వేరు వేరు పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించి పోటీని మరింతగా పెంచాయి, మార్కెట్ؚలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) స్యూట్ؚతో వస్తున్న కాంపాక్ట్ సెడాన్ؚలు ఇవి మాత్రమే. 

వీటి ADAS ఫీచర్‌ల శ్రేణిని పోల్చి చూద్దాం

ఫీచర్‌లు

హ్యుందాయ్ వెర్నా

హోండా సిటీ

అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ 

ఉంది 

ఉంది 

లేన్ డిపార్చర్ వార్నింగ్ 

ఉంది 

ఉంది 

లేన్ కీప్ అసిస్ట్ 

ఉంది 

ఉంది 

హై బీమ్ అసిస్ట్ 

ఉంది 

ఉంది 

ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్  

ఉంది 

ఉంది 

ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ 

ఉంది 

ఉంది 

బ్లైండ్ వ్యూ మానిటర్ 

ఉంది 

ఉంది 

బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ 

ఉంది 

లేదు 

సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ 

ఉంది 

లేదు 

రేర్ క్రాస్ అలర్ట్ 

ఉంది 

లేదు

పరిత్యాగ ప్రకటన: ఈ ఫీచర్‌లు అటానమస్ డ్రైవింగ్ కోసం కాకుండా కేవలం డ్రైవర్ؚకు సహాయంగా ఉండటానికి మాత్రమే రూపొందించబడినవి. ఈ ఫీచర్‌లను బాధ్యతగా ఉపయోగించాలి. 

 • ఈ సెడాన్ؚలు రెండిటిలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ఉంటాయి. లేన్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్‌లు భారతదేశం డ్రైవింగ్ పరిస్థితులలో కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, కొత్త వెర్నా రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ మరియు సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ వంటి అదనపు ఫీచర్‌లతో సిటీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

2023 Honda City ADAS

 • వెర్నా టాప్-స్పెక్ SX(O) ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలలో మాత్రమే ADAS ఫీచర్ ఉంటుంది, కానీ హోండా సిటీ అన్ని వేరియెంట్‌లలో (బేస్-స్పెక్ SVను మినహాయించి), మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలు రెండిటిలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ؚ ఉంటుంది. 

ఇది కూడా చూడండి: కొత్త హ్యుందాయ్ వెర్నా Vs ప్రత్యర్ధులు: స్పెసిఫికేషన్‌ల పోలిక 

Hyundai Verna ADAS

 • అయితే, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ హ్యుందాయ్ వెర్నా టర్బో చార్జెడ్ మోడల్ DCT వేరియెంట్ؚకు మాత్రమే ప్రత్యేకం. 

 • ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, భారతదేశంలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ؚని అందిస్తున్న ఒకే ఒక కాంపాక్ట్ సెడాన్ హోండా సిటీ మాత్రమే. 

 • ‘సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్’ మరియు ‘రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్’ ఏం చేస్తాయి?సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్: సేఫ్టీ ఎగ్జిట్ వార్నింగ్ؚను డోర్ ఓపెన్ వార్నింగ్ అని కూడా పిలుస్తారు, ఎవరైనా కార్ నుండి దిగుతున్నప్పుడు, ఇది వెనుక నుండి సమీపిస్తున్న వాహనాన్ని గుర్తించి హెచ్చరిస్తుంది. దీని వలన వాహనాన్ని ఢీ కొనడం నివారించవచ్చు మరియు అటువంటి సందర్భాలలో కలిగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

 • రేర్ క్రాస్ ట్రాఫిల్ అలర్ట్: ఇది డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, పార్కింగ్ స్పేస్ నుంచి వాహనాన్ని రివర్స్ తీస్తున్నప్పుడు, వెనుక నుండి వస్తున్న లేదా దాటి వెళ్తున్న ట్రాఫిక్ؚను గుర్తించి, డ్రైవర్ؚను హెచ్చరిస్తుంది. 

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ కొత్త ఛార్జింగ్ రోబోట్ ఆర్మ్ మీ EVని ఛార్జింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభతరం చేస్తుంది 

ధర తనిఖీ

హ్యుందాయ్ వెర్నా

హోండా సిటీ

 

1.5-లీటర్ పెట్రోల్ 

V: రూ. 12.37 లక్షలు

V CVT: రూ. 13.62 లక్షలు

VX: రూ. 13.49 లక్షలు

VX CVT: రూ. 14.74 లక్షలు

1.5- లీటర్ MPi పెట్రోల్ 

ZX: రూ. 14.72 లక్షలు

SX (O) CVT: రూ. 16.20 లక్షలు

ZX CVT: రూ. 15.97 లక్షలు

1.5-లీటర్ T-GDi (టర్బో-పెట్రోల్)

 

SX (O): రూ. 15.99 లక్షలు

SX (O) DCT: రూ. 17.38 లక్షలు

1.5-లీటర్ హైబ్రిడ్

 

V: రూ. 18.89 లక్షలు

ZX: రూ. 20.39 లక్షలు

అన్నీ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధరలు

పైన పేర్కొన్నట్లు, హోండా సిటీలో ADAS స్యూట్ V వేరియెంట్ నుండి అందుబాటులో ఉంటుంది, ఇది వెర్నా 1.5-లీటర్ SX(O) CVT వేరియెంట్‌తో పోలిస్తే రూ.3.83 లక్షలు తక్కువ ధరకు వస్తుంది, ఈ వేరియెంట్ నుంచి ప్రారంభించి హ్యుందాయ్ ADAS ఫీచర్‌లను అందిస్తుంది. కేవలం ADAS ఫీచర్‌ల పరంగా చూస్తే హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా కంటే మెరుగైన విలువను అందిస్తుంది, అయితే హ్యుందాయ్ వెర్నా, హోండా సెడాన్ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్‌లను అందిస్తుంది.  

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా

Read Full News

explore similar కార్లు

Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
 • quality వాడిన కార్లు
 • affordable prices
 • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

 • ట్రెండింగ్ వార్తలు
 • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience