హ్యుందాయ్ వెర్నా: పాతది Vs కొత్తది

హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం raunak ద్వారా మే 20, 2019 12:48 pm ప్రచురించబడింది

హ్యుందాయ్ వెర్నా తమ యొక్క 2017 మోడల్ లో విభాగంలోనే మొదటి లక్షణాలను అందించేందుకు తమ యొక్క ఫీచర్ జాబితా నుండి కొన్ని లక్షణాలను తొలగించింది

Hyundai Verna: Old vs New

నవీకరణ: 2017 హ్యుందాయ్ వెర్నా రూ.7.99 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది.

చివరి తరం హ్యుందాయ్ వెర్నా, దాని ప్రారంభ సంవత్సరాల్లో, అత్యధికంగా అమ్ముడయ్యే మధ్య-స్థాయి సెడాన్లలో ఒకటిగా ఉంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం అని చెప్పవచ్చు. కొత్త 2017 మోడల్ కి పెద్ద భాద్యత ఉంది, నిజమా? కాదా?

2017 Hyundai Verna

దీనికి ప్రధాన కారణం దాని యొక్క అవుట్గోయింగ్ మోడల్ అనేది దాని యొక్క 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ప్రవేశపెట్టాక అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్ గా నిలిచింది.  దీనికి తోడు దీని యొక్క విభాగంలోని మొదటి లక్షణాల జాబితా మరియు కూపే వంటి స్టయిలింగ్ దీనితో పాటూ చేదోడు వాదోడుగా వస్తాయి. కానీ దీని యొక్క అంత బాగాలేని డైనమిక్స్ వలన బాగా ఇబ్బంది పడుతున్నాము అని చాలా మంది చెప్పారు.

Hyundai Verna

ఒక్కసారి మనం 2017 వెర్నా ని చూద్దాము మరియు దానిని గనుక మనం చూసినట్లయితే హ్యుందాయి అదే పద్దతిని అవలభించిందని తెలుస్తుంది. అలాగే ఇది విభాగంలో మొదటి లక్షణాలు, కూపే వంటి స్టైలింగ్ మరియు దాని రహదారి మర్యాదలను మెరుగు పరచడం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మాకు ఈ కొత్త డీజిల్ వెర్నా ని బయట తిప్పడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ మా రహదారి పరీక్షను పరిశీలించండి: 2017 హ్యుందాయ్ వెర్నా: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెండు మోడల్ మధ్య తేడా ఏమిటి చూద్దాం.

గమనిక: హ్యుందాయ్ వెర్నా ఎంచుకున్న మార్కెట్లలో ఏక్సెంట్ గా పిలువబడుతుంది. భారతదేశంలో, మూడవ-తరానికి చెందిన మోడల్ పేరును 'వెర్నా' గా మార్చారు, ఎందుకంటే ఏక్సెంట్ దీనితో పాటే కొన్ని సంవత్సరాల పాటు అమ్ముడుపోతుంది. మన దేశంలో ప్రవేశపెట్టిన ఏక్సెంట్, రెండవ తరం గ్లోబల్ మోడల్. సాంకేతికంగా, కొత్త 2017 సెడాన్ ఐదో తరం మోడల్. హ్యుందాయ్ భారతదేశంలో 3.17 లక్షల యూనిట్లు కలిగి ఉంటూ,  66 దేశాల్లో 8.8 మిలియన్ల కంటే ఎక్కువ యూనిట్ల పేరును (ఏక్సెంట్ + వెర్నా)ని విక్రయించింది.  

కొలతలు

Hyundai Verna: Old vs New (dimensions)

Hyundai Verna: Old vs New (dimensions)

డిజైన్

2017 Hyundai Verna

2017 వెర్నా యొక్క డిజైన్ అనేది బాగా విప్లవాత్మకమైనదిగా ఉంటుంది మరియు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. దీని యొక్క పాత మోడల్ అనేది దీని యొక్క రూఫ్‌లైన్ మరియు గుండ్రంగా కనిపించే హెడ్ మరియు టెయిల్ ల్యాంప్స్ వలన దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే సెడాన్ లలో ఒకటిగా నిలిచింది.

Hyundai Verna

హ్యుందాయ్ యొక్క తాజా 'కాస్కేడింగ్ గ్రిల్' డిజైన్ మూలకం 2017 హ్యుందాయ్ వెర్నా యొక్క హైలైట్ అంశం అని చెప్పవచ్చు. ఇది కొత్త హ్యుందాయ్ ఎలన్త్ర్రాకు చాలా పోలి ఉంటుంది. ముందు వలె, దీని యొక్క ప్రక్క భాగం కూపే వంటి రూఫ్ లైన్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో ఆధిపత్యం వహిస్తుంది.

2017 Hyundai Verna

వెనకాతల భాగంలో సన్నగా ఉంటూ, ఈ స్ప్లిట్ వ్రాప్ అరౌండ్ టెయిల్ లాంప్స్ మరియు పెరిగిన వెడల్పు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, కొత్త వెర్నా మునుపటి మోడల్ కంటే మరింత విస్తృతమైనదిగా ఉంటుంది. అంతే కాకుండా, డ్యుయల్-టోన్ బంపర్ వెనకాతల కారు వెళుతున్నప్పుడు ఏమీ తగలకుండా చూసుకుంటుంది.

Hyundai Verna

లక్షణాలు

2017 మోడల్ తో, హ్యుందాయ్ వెర్నా యొక్క లక్షణాల జాబితాకు ఒక ప్రధాన సమగ్రతను ఇచ్చింది. హ్యుందాయ్ కొత్త మోడల్లో కొన్ని లక్షణాలను తెలివిగా తొలగించింది మరియు వెర్నా యొక్క మొత్తం ప్యాకేజీని పెంచడానికి కొన్ని విభాగపు-మొదటి లక్షణాలను జోడించింది.  

పాత దాని నుండి వస్తున్న లక్షణాలు:

  • ప్రాధమిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్ మరియు ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
  • టాప్ స్పెక్ ట్రిం కర్టెన్ మరియు సైడ్ ఎయిర్ బాగ్స్ (మొత్తం 6 ఎయిర్ బాగ్స్)ని పొందుతుంది
  • 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ (కొత్త డిజైన్ ని అందుకుంటుంది)
  • ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
  • ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్ తో ఆటోమాటిక్ హెడ్ల్యాంప్స్
  • షార్క్-ఫిన్ యాంటెన్నా
  • డ్యుయల్ టోన్(నలుపు మరియు లేత గోధుమరంగు) థీమ్ మరియు ఫాక్స్ లెథర్ అపోలిస్ట్రీ
  • లెదర్-చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్
  • హైట్ అడ్జస్టబుల్ సీటు్‌బెల్ట్స్
  • క్లస్టర్ ఐయానైజర్ తో అటో వాతావరణ నియంత్రణ
  • కూలేడ్ గ్లోవ్ బాక్స్
  • ఎలక్ట్రోనికల్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ అవుట్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్ (ORVM)
  • ఆటో డిమ్మింగ్ లోపల రేర్ వ్యూ మిర్రర్(IRVM)
  • పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ

కొత్త లక్షణాలు

  • ఎలక్ట్రానిక్ సన్రూఫ్ (ఇండియా-స్పెక్ హ్యుందాయ్ వెర్నా / యాక్సెంట్ లో మొదటిసారిగా జోడించబడింది)
  • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (ఇండియా-స్పెక్ హ్యుందాయ్ వెర్నా / యాక్సెంట్ లో మొదటిసారిగా చేర్చబడ్డాయి)
  • ఎకో కోటింగ్ (A.C వాసన ఎలిమినేటర్)
  • హ్యాండ్స్-ఫ్రీ బూట్ రిలీజ్ (మీరు చేయవలసిందల్లా మీ అడుగు క్రింద వేయాలి మరియు ఇది ఓపెన్ పాప్ అవుతుంది)
  • ప్రొజెక్టర్ ఫాగ్‌ల్యాంప్స్(బహుళ రిఫ్లెక్టర్ యూనిట్ కంటే సాపేక్షంగా మెరుగ్గా ఉండే హ్యుందాయ్ ఎలాంట్రాతో కూడా అందుబాటులో ఉంటుంది)
  • LED డే టైం రన్నింగ్ లైట్లు (DRLs) మరియు LED టెయిల్ ల్యాంప్స్ (లైట్స్ రెండింటిలోనూ ఎలంట్రా- వంటి గ్రాఫిక్స్ ని కలిగి ఉంది)
  • ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో హుండై యొక్క తాజా 7.0-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (వైడ్-యాంగిల్ వీక్షణ కోసం IPS ప్రదర్శన). ఈ యూనిట్ ఆర్కేంస్ సౌండ్ ట్యూనింగ్ తో 6 స్పీకర్ (4 డోర్ స్పీకర్లు మరియు 2 ముందు ట్వీటర్స్) సౌండ్ సిస్టంతో జత చేయబడి ఉంది.  
  • ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ కోసం హ్యుందాయి i-బ్లూ స్మార్ట్‌ఫోన్ యాప్-బేసెడ్ రిమోట్ (ఎంపిక చేసుకున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు పనిచేస్తుంది)
  • తక్కువ వేరియంట్స్ లో రేర్ పార్కింగ్ కెమేరాతో 5.7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
  •  రేర్ A.C వెంట్స్ మొదటిసారిగా చేర్చబడ్డాయి
  • వెనుక USB చార్జింగ్ పోర్ట్
  • ఆటో లింక్ కనెక్ట్ కారు టెక్
  • క్రూయిజ్ నియంత్రణ
  • లగేజ్ హుక్ మరియు నెట్
  • మాన్యువల్ వెనుక కర్టెన్

మిస్ అయిన లక్షణాలు

  • EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) మునుపటి వేరియంట్ లో ప్రమాణంగా అందించబడేది, ఇది ఇప్పుడు పరికరాల జాబితాలో ఆశ్చర్యకరంగా లేనే లేదు.
  • వెనుక డిస్క్ బ్రేక్లు (చివరి-తరం ఫేస్లిఫ్ట్ మోడల్ పరిచయంతో తొలగించబడ్డాయి, కాని ముందు-ఫేస్లిఫ్ట్ చివరి తరం మరియు మూడవ తరం మోడల్ లో అందుబాటులో ఉంది)
  • రెయిన్-సెన్సింగ్ వైపర్స్
  •  ఎర్గో-లేవేర్ (వెనుక సీట్ ప్రయాణీకులు లెగ్‌రూం ను విస్తరించుటకు ముందు ప్రయాణీకుల సీటు సర్దుబాటు చేయవచ్చు)
  •  స్టీరింగ్ వీల్ కోసం టెలిస్కోపిక్ సర్దుబాటు
  • పవర్ విండోస్ లో టైం లాగ్ ఫంక్షన్ లేదు(కీ తొలగించిన కొన్ని క్షణాల తరువాత కూడా పవర్ విండోస్ పనిచేస్తాయి)
  • డ్రైవర్ వానిటీ మిర్రర్

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్

హ్యుండాయ్ ప్రవేశ-స్థాయి 1.4-లీటరు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను మునుపటి-తరం మోడల్ నుండి విడిచిపెట్టి, పెద్ద, మరింత శక్తివంతమైన 1.6 లీటర్ ఇంజన్స్ ని మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా, పాత  4-స్పీడ్ ఆటో కి బదులుగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ముందులానే పెట్రోలు మరియు డీజిల్ రెండింటిలో లభ్యమవుతుంది) ని అందిస్తుంది.

  •  పెట్రోల్: 1.6 లీటర్ డ్యుయల్  VTVT: 123PS శక్తిని  మరియు 155Nm టార్క్ (6-స్పీడ్ MT / AT)
  •  డీజిల్: 1.6 లీటర్ U2 CRDi VGT: 128PS శక్తిని మరియు 260Nm టార్క్ (6-స్పీడ్ MT / AT)

2017 Hyundai Verna

Check out: 2017 New Hyundai Verna – Expected Prices

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience