విడుదలకు ముందే ఎక్స్టర్ రేర్ డిజైన్ؚను వెల్లడించిన హ్యుందాయ్
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం shreyash ద్వారా మే 31, 2023 08:53 pm ప్రచురించబడింది
- 117 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పంచ్ؚతో పోటీ పడే ఈ హ్యుందాయ్ మైక్రో SUV జులై 10వ తేదీన విడుదల కానుంది
-
టీజర్‌ల ద్వారా ఎక్స్టర్ ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚను పూర్తిగా ఒకేసారి కాకుండా హ్యుందాయ్ విడుతల వారీగా చూపిస్తుంది.
-
ఇది ఐదు విస్తృత వేరియెంట్‌లలో అందించబడుతుంది: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్.
-
ఈ మైక్రో SUV 1.2-లీటర్ ఇంజన్ నుండి పవర్‌ను పొందుతుంది, ఇది పెట్రోల్ మరియు CNG ఎంపికలు రెండిటిలో అందించబడుతుంది.
-
ఈ విభాగంలో సన్ؚరూఫ్ మరియు డ్యూయల్ డ్యాష్‌క్యామ్ సెట్అప్ؚను కలిగి ఉన్న మొదటి మైక్రో SUV.
-
దీని ధరను హ్యుందాయ్ రూ.6 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించింది.
అనేక టీజర్‌లను విడుదల చేసిన తరువాత, ప్రస్తుతం హ్యుందాయ్ మొదటిసారిగా ఎక్స్టర్ వెనుక వైపు డిజైన్ؚను టీజర్‌లలో ప్రదర్శించింది, తద్వారా ఈ మైక్రో SUV ఎక్స్ؚటీరియర్ వివరాలను వెల్లడించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాల గురుంచి చూద్దాం.
రేర్ డిజైన్
వెనుక నుండి కూడా ఎక్స్టర్ నిటారైన SUV వంటి వైఖరిని హ్యుందాయ్ కొనసాగించింది. ఈ మైక్రో SUV రేర్ –ఎండ్ డిజైన్ మధ్యలో హ్యుందాయ్ లోగోను కలిగిన నల్లని స్ట్రిప్‌తో కలిసిన H-ఆకారపు LED టెయిల్ ల్యాంపులతో హైలైట్ చేయబడింది. ఈ రెండూ ముందు ఉన్న గ్రిల్ మరియు H-ప్యాటర్న్ LED DRLలకు సారూప్యంగా ఉన్నాయి. వెనుక బంపర్ పైన ఉన్న భారీ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఎక్స్టర్ؚకు ధృఢమైన రూపాన్ని ఇస్తుంది.
ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు ఏవి
ఇంటీరియర్‌ను ఇప్పటి వరకు చూపించకపోయిన, ఎక్స్‌టర్ కలిగి ఉన్న అనేక ఫీచర్‌లను హ్యుందాయ్ విడుదల చేసింది. ఈ మైక్రో SUV వాయిస్-అసిస్టెడ్ సింగిల్-పెన్ సన్ؚరూఫ్ మరియు డ్యూయల్ డ్యాష్ؚక్యామ్ؚలను అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ؚలో ఉంటాయని ఆశిస్తున్న ఫీచర్‌లలో భారీ టచ్ؚస్క్రీన్ డిస్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ ధరల అంచనా: టాటా పంచ్ؚతో ఎలా పోల్చబడుతుంది?
భద్రత విషయానికి వస్తే, ఎక్స్టర్ ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా కలిగి ఉంటుందని హ్యుందాయ్ ఇప్పటికే నిర్ధారించింది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్, మరియు 3-పాయింట్ల సీట్ బెల్టులు, మొత్తం ఐదు సీట్‌లకు రిమైండర్‌లు ఉంటాయి. ఈ SUV టాప్ వేరియెంట్‌లు హెడ్ؚల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటోమ్యాటిక్ హెడ్ ؚల్యాంపులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
ఇంజన్ & ట్రాన్స్ؚమిషన్
హ్యుందాయ్ ఎక్స్టర్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.2-లీటర్ ఇంజన్ 5-స్పీడ్‌ల మాన్యువల్ లేదా పెట్రోల్ రూపంలో 5-స్పీడ్‌ల AMTతో జోడించబడుతుంది, మరియు CNG కాన్ఫిగరేషన్ؚలో 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది.
అంచనా ధర & పోటీదారులు
ఈ మైక్రో SUVని హ్యుందాయ్ ఐదు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది– EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్ – దీని ధరలు రూ.6 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు. విడుదలైన తరువాత ఇది టాటా పంచ్, సిట్రోయెన్ C3, నిసాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు మారుతి ఫ్రాంక్స్ؚలతో పోటీ పడుతుంది.