• English
  • Login / Register

కొత్త ఎలంట్రా యొక్క అంతర్భాగాలను అధికారికంగా బహిర్గతం చేసిన హ్యుందాయి

ఆగష్టు 27, 2015 02:40 pm manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయి ఒకప్పుడు తన రాబోయే ఎలంట్రా యొక్క ఆకారాలు మరియు స్కెచ్లును అధికారికంగా విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ కొరియన్ మార్కెట్ రాబోయే ఎలంట్రా యొక్క అంతర్భాగాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రాలు కొత్త కారు ఎలా కనిపిస్తుందో మనకి తెలియజేసేలా ఉంటాయి. దీని యొక్క బాహ్య భాగాలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ అంతర్భాగాలు మరియు బాహ్య భాగాలు హ్యుందాయి ఎస్యువి అయిన కొత్త టుక్సన్ నుండి తీసుకోబడినట్ట్లుగా తెలుస్తుంది. ఈ టుక్సన్ ఈ సంవత్సరం మొదటి భాగంలో ప్రారంభించబడి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారు డాష్బోర్డ్ మరియు కేంద్ర కన్సోల్ ప్రస్తుత కారులో ఉన్న వాటికి విరుద్ధంగా ఉంటాయి. 

ఈ కారు యొక్క కొత్త డాష్బోర్డ్ పై ఉన్న పెద్ద సమాచారవ్యవస్థ దీనిలో ఒక ముఖ్యమైన లక్షణంగా చెప్పవచ్చు. దీనికి ఇరువైపులా ఏ.సి వెంట్లు ఉండగా , దీనిని నియంత్రించే బటన్లు సమాచార వ్యవస్థ క్రింద ఉంటాయి. ఈ కారులో ఎయిర్ కాన్ నియంత్రణల క్రింద కబ్బీ హోల్ ఉంటుంది. దీనిలో ఇతర లక్షణం అయిన హజార్డ్ లైట్ బటన్ ఎయిర్ కాన్ నియంత్రణకి మరియు సమాచారవ్యవస్థకి మధ్యలో ఉంచబడింది. అయితే దీనిలో కప్ హోల్డర్స్ మరియు హ్యాండ్ బ్రేక్ ప్రస్తుతతరం ఎలంట్రా నుండి తీసుకోబడినట్టుగా కనిపిస్తుంది. దీని అంతర్భాగాలు కూడా క్రోం మరియు సిల్వర్ చేరికలను కలిగి ఉంటాయి. ఈ కొత్త కారు ఈ సంవత్సరం తరువాత ప్రారంభించబడుతుందని ఆశిస్తున్నాం. నాలుగు-సిలిండర్ డీజిల్ లేదా కొత్త టక్సన్ లో చూసిన 174 bhp శక్తిని అందించే 1.6 లీటర్ టర్బో పవర్ ప్లాంట్ తో రావచ్చు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience