హ్యుండై వారు జెనెసిస్ జీ90 బ్రాండ్ యొక్క చిత్రణలను బహిర్గతం చేశారు
నవంబర్ 16, 2015 05:29 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: జెనెసిస్ ని ఒక ప్రత్యేక లగ్జరీ బ్రాండ్ గా ప్రకటించిన తరువాత, హ్యుండై వారు జీ90 అనే కొత్త ఫ్లాగ్‌షిప్ యొక్క చిత్రణలను బహిర్గతం చేశారు. జెనెసిస్ జీ90 ని అందరికీ ఉపయోగించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానంతో అందించడం జరిగింది. ఈక్యూ900 పేరిట కొరియాలో త్వరలోనే విడుదల కాబోయే ఈ జీ90 కారు, హ్యుండై వారు 2020 లోపుగా 6 జెనెసిస్ కార్లు విడుదల చేసే కార్యక్రమంలో భాగం.
హ్యుండై మోటర్ ఆర్డీ కి హెడ్ మరియూ వైస్ చైర్మన్ అయిన వూంగ్-చుల్ యాంగ్, " మా జెనెసిస్ జీ90 కారు కస్టమర్లకి విలాసాన్ని అందిస్తుంది. వాహన అనుభవం కస్టమర్లకు మెరుగుగా అందించే విధంగా ఈ కారు ఉంటుంది," అని తెలిపారు.
హ్యుండై వారిచే అభివృద్ది చేయబడిన డిజైన్ విభాగం జెనెసిస్ బ్రాండ్ అయిన జీ90 ని ఎంతో హుందాగా నిర్మించారు. హుడ్ పైన జెనెసిస్ యొక్క ఎంబ్లెం ఉండి, రేడియేటర్ గ్రిల్లు ఇంకా హెడ్ ల్యాంప్స్ ఎంతో అందంగా ఉంటాయి.