ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని చిత్రణలతో సహా విడుదల చేసిన హ్యుందాయ్
డిసెంబర్ 23, 2015 09:44 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటనలో తెలిపింది, హ్యుందాయ్ ఐకానిక్ వాహనం యొక్క వెలుపలి మరియు లోపలి నుండి రెండింటి స్కెచ్లు లను హ్యుందాయ్ ప్రియులకు వివరాలను ఇవ్వడం కోసం ఇటీవల విడుదల చేసింది. ఈ వాహనం యూక్క వెనుక భాగం, ఒక ఫాస్ట్బేక్ రకమైన ఐకానిక్ డిజైన్ తో బాహ్య భాగం మరింత ఆహ్లాదకరంగా ఉంది. అదే లోపలి భాగం విషయానికి వస్తే, కనీసపు లేఅవుట్ తో డాష్బోర్డ్ చక్కగా రూపొందించబడింది. హ్యుందాయ్ ఐకానిక్, జనవరిలో కొరియా వద్ద ప్రపంచ ప్రదర్శన జరగనుంది. దాని వెంటనే, మార్చి లో జరగబోయే జెనీవా మోటార్ షో మరియు న్యూయార్క్ ఆటో షో లలో ఒక పెద్ద ప్రేక్షకాదరణ వద్ద ప్రదర్శింపబడుతుంది.
హ్యుందాయ్ సంస్థ, ఈ ఐకానిక్ వాహనం యొక్క పవర్ ప్లాంట్ల గురించి ముందుగానే తెలియజేసింది. ఈ ఐకానిక్ వాహనం, పూర్తి ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ గ్యాసోలైన్ / ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మరియు గ్యాసోలైన్ / ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వంటి మూడు ఇంజన్ లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రకటించింది. ఈ రకమైన పవర్ట్రెయిన్ లతో అందించబడిన మొదటి కారు ఇదే అని చెప్పవచ్చు. ఈ నిర్ధిష్ట పవర్ ట్రీన్ లను నిర్వహించడానికి, ఒక ప్రత్యేకమైన కొత్త వేదిక అబివృద్ది చేయడానికి నిర్మించబడింది. ఈ ఐకానిక్ వాహనం, హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ డిజైన్ అంశాలైనటువంటి హెగ్జాగోనల్ గ్రిల్, సి ష్తానం లైట్లను కలిగిన విలక్షణమైన కొత్త హెడ్ ల్యాంప్లు వంటి అంశాలతో వస్తుంది.
ఈ ఐకానిక్ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, నియంత్రణా స్విచ్చుల కొరకు మృదువైన, ఒక తార్కిక విధానంతో క్లట్టర్ ఫ్రీ తీం అందించబడుతుంది. ఈ వాహనానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఎలక్ట్రికల్లీ చార్జెడ్ ఆటం అయిన కాంబినేషన్ అయాన్ (ఈ వాహనం యొక్క ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రైన్లు) మరియు తక్కువ ఎమిషన్ మోడల్ కోసం ఒక కొత్త విధానం వంటి వాటితో వచ్చింది.
మీ మనస్సులో ఉన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, హ్యుందాయ్ ఐకానిక్ వాహనం భారత తీరాలకు వచ్చే అవకాశం లేదు. మొదటిగా, ఈ డీజిల్ ఇంజన్ ల పై ఉన్న సమస్యలు పరిష్కరించబడిన తరువాత చూద్దాం. మరిన్ని వివరాలకు ఈ కార్ధెఖో ను వీక్షిస్తూనే ఉండండి.
ఇవి కూడా చదవండి: