హ్యుండై వారు 4,70,000 సొనాటా కార్లను ఉత్పాదక లోపం కారణంగా వెనక్కు పిలిపిస్తున్నారు
సెప్టెంబర్ 28, 2015 11:47 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫోక్స్వాగెన్ వారు ఎమిషన్ కుంభకోణం కారణంగా 1.5 మిలియన్ కార్లను యూకే లో వెనక్కి పిలవగా హ్యుండై వారు కూడా సాంకేతిక లోపాల కారణంగా ఇదే వరుసలో చేరారు. కంపెనీ వారు దాదాపుగా 0.5 మిలియన్ మిడ్ సైజు కార్లను యూఎస్ లో ఇంజిను లోపాల కారణంగా వెనక్కి పిలిపిస్తున్నారు. వీటిలో ప్రముఖమైనవి సొనాటా సెడాన్ 90% ఉన్నాయి. ఇవి 2011 మరియూ 2012 మోడల్స్ తో 2 లేదా 2.4-లీటర్ పెట్రోల్ ఇంజిను కలిగి ఉన్నవి మరింతగా లోప పూరితమైనవి.
ఫోక్స్వాగెన్ విషయం లో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న దేశం యూఎస్. ఇంజినులోని ముఖ్య భాగాల భర్తీ అవసరమని, లేదా పని చేయడం ఆగిపోతాయి అని హ్యుండై వారు తెలిపారు. క్రాంక్ షాఫ్ట్ నుండి లోహపు వ్యర్ధాలు బయటకి వచ్చి ఉండకపోవచ్చును, ఈ కనెక్టింగ్ రాడ్స్ యొక్క కారణంగా ఆయిల్ ఫ్లో అడ్డు పడవచ్చు.
లోపాలకై ఇంజిన్లను పరీక్షించబడతాయి మరియూ భర్తీ చేయబడతాయి. పైగా, ఇంజిను యొక్క వారెంటీని 10 సంవత్సరాలకు లేదా 1,20,000 మైళ్ళకి పొడిగిస్తుంది. కంపెనీ వద్ద పార్ట్లు లభ్యం అయినప్పటి నుండి వాహనాలను వెనక్కి పిలవడం మొదలు పెడతారు.
ఈ ఘటన ఫోక్స్వాగెన్ మరియూ హోండా వారు సాంకేతిక లోపాల వలన వాహనాలను వెనక్కి పిలిస్తున్న తరుణంలో జరుగుతోంది. ఫోక్స్వాగెన్ వారు భారీ ఎమిషన్ కుంభకోణం యూఎస్ లో మొదలయ్యి ప్రపంచం అంతటా పాకింది. హోండా వారు లోపం ఉన్న ఎయిర్ బ్యాగ్ ఇంఫ్లేటర్ కారణంగా భారతదేశంలో వాహనాలు వెనక్కు పిలిచారు. పేరుమోసిన మరియూ ప్రధానమైన కార్ల తయారీదారులు ఇటువంటి లోపాలతో బయటకి వస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క నియంత్రణ సంస్థలు యొక్క ప్రామాణికత పై సందేహాలు తలెత్తుతున్నాయి.
0 out of 0 found this helpful