ఈ మార్చిలో రూ.43,000 విలువైన ఆఫర్లను అందిస్తున్న Hyundai
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం shreyash ద ్వారా మార్చి 12, 2024 05:06 pm ప్రచురించబడింది
- 106 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరా కూడా రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌తో లభిస్తాయి.
-
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కారుపై అత్యధికంగా రూ.43,000 డిస్కౌంట్ లభిస్తుంది.
-
హ్యుందాయ్ ఆరాపై రూ.33,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
-
హ్యుందాయ్ i20 కారుపై రూ.25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
-
హ్యుందాయ్ వెన్యూపై వినియోగదారులు రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
-
అన్ని ఆఫర్లు 31 మార్చి 2024 వరకు చెల్లుబాటు అవుతాయి.
ఈ మార్చిలో హ్యుందాయ్ తన కాంపాక్ట్ కార్లన్నింటిపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తున్నారు. హ్యుందాయ్ ఎక్స్టర్, i20 N లైన్, వెన్యూ N లైన్, క్రెటా, అల్కాజార్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్ మరియు అయోనిక్ 5 వంటి మోడళ్లపై ఈ ప్రయోజనాలను అందించడం లేదు. మోడల్ ను బట్టి అందిస్తున్న ఆఫర్ల వివరాలపై ఓ లుక్కేయండి.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
ఆఫర్లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ.30,000 వరకు |
ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ.10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ.3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ.43,000 వరకు |
- హ్యుందాయ్ తన అన్ని మోడళ్లలో, గ్రాండ్ i10 నియోస్పై అత్యధిక తగ్గింపును అందిస్తోంది.
-
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కారు ధర రూ.5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షల మధ్యలో ఉంది.
ఇది కూడా చదవండి: ఈ నగరాల్లో కాంపాక్ట్ SUVని ఇంటికి తీసుకురావడానికి ఎనిమిది నెలల సమయం పట్టవచ్చు
హ్యుందాయ్ ఆరా
ఆఫర్లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ.20,000 వరకు |
ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ.10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ.3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ.33,000 వరకు |
-
గ్రాండ్ i10 నియోస్ కు పోటీగా హ్యుందాయ్ ఆరా కారుపై రూ.20,000 తగ్గింపు లభిస్తుంది.
-
ఆరా సబ్-4m సెడాన్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.05 లక్షల మధ్యలో ఉంది.
హ్యుందాయ్ i20
ఆఫర్లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ.15,000 వరకు |
ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ.10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ.25,000 వరకు |
-
ఇక్కడ పేర్కొన్న డిస్కౌంట్లు హ్యుందాయ్ i20 యొక్క అన్ని వేరియంట్లకు చెల్లుబాటు అవుతాయి.
-
గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరా మాదిరిగా కాకుండా, కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై ఎటువంటి కార్పొరేట్ తగ్గింపును అందించదు.
-
హ్యుందాయ్ i20 కారు ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్యలో ఉంది.
ఇది కూడా చూడండి: ఫిబ్రవరి 2024 లో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ మరియు మిడ్సైజ్ హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మారుతి మరియు టాటా కార్లు అగ్రస్థానంలో ఉన్నాయి
హ్యుందాయ్ వెన్యూ
ఆఫర్లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ.20,000 వరకు |
ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ.10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ.30,000 వరకు |
-
హ్యుందాయ్ వెన్యూకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు, కానీ కంపెనీ ఖచ్చితంగా దానిపై నగదు తగ్గింపులు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్లను అందిస్తోంది.
-
వెన్యూ N లైన్ లో ఎలాంటి ప్రయోజనాలను అందించడం లేదు.
-
హ్యుందాయ్ వెన్యూ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల మధ్యలో ఉంది.
గమనికలు
-
ఎంచుకున్న రాష్ట్రం, నగరం మరియు వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ ఆఫర్లు మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఆఫర్ యొక్క సరైన సమాచారం కోసం దయచేసి సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి.
-
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ.
మరింత చదవండి: గ్రాండ్ i10 నియోస్ AMT
0 out of 0 found this helpful