• English
  • Login / Register

GM మోటార్స్ సౌజన్యంతో మూడవ తయారీ కర్మాగారాన్ని జోడించనున్న హ్యుందాయ్ మోటార్

ఆగష్టు 18, 2023 10:52 am tarun ద్వారా ప్రచురించబడింది

  • 2.4K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ కర్మాగారంతో, హ్యుందాయ్ ప్రతి సంవత్సరం 10 లక్షల కార్‌లను ఉత్పత్తి చేయగలదు.

Hyundai Exter

  • హ్యుందాయ్, జనరల్ మోటార్స్ భూములు మరియు భవనాలు, యంత్రాలు మరియు తయారీ సామగ్రిని కొనుగోలు చేయనుంది. 

  • మూడు కర్మాగారాల మిశ్రమ ఉత్పత్తి సామర్ధ్యం సంవత్సరానికి 10 లక్షల వరకు ఉంటుంది.

  • కారు తయారీదారు 2025 నుండి ఈ కర్మాగారంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది. 

  • ఈ విస్తరణతో, హ్యుందాయ్ భారతదేశానికి కొత్త EVలను అందించాలని భావిస్తుంది. 

తలేగావ్, మహారాష్ట్రలోని జనరల్ మోటార్స్ (GM) కర్మాగారాన్ని కొనుగోలు చేయడానికి హ్యుందాయ్ ఆస్తి కొనుగోలు ఒప్పందం (APA) పై సంతకం చేసింది. ఈ కొత్త కర్మాగారంతో, హ్యుందాయ్ؚకు దేశంలో మూడు తయారీ కర్మాగారాలు ఉంటాయి, వీటిలో రెండు శ్రీపెరుంబుదూరు, తమిళనాడులో ఉన్నవి. 

Hyundai Plant

ఈ కొనుగోలులో, హ్యుందాయ్, GM భూములు మరియు భవనాలను, కర్మాగారంలోని కొన్ని యంత్రాలు మరియు తయారీ సామగ్రిని కూడా సొంతం చేసుకుంటుంది. కొత్త కర్మాగారంతో, ఈ కారు తయారీదారు సంవత్సరానికి 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు, 2025లో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ప్రస్తుతం హ్యుందాయ్ రెండు కర్మాగారాల నుండి ఉత్పత్తి సామర్ధ్యం సంవత్సరానికి 8.2 లక్షల యూనిట్లుగా ఉంది. GM కర్మాగారం ప్రస్తుత సామర్ధ్యం సంవత్సరానికి 1.3 లక్షల యూనిట్లుగా ఉంది, తన లక్ష్యాన్ని సాధించడానికి దీని సామర్ధ్యాన్ని పెంచుతారు. 

ఇది కూడా చదవండి: ఈ పండుగ సీజన్ؚలో విడుదల కానున్న 5 కొత్త SUVలు 

హ్యుందాయ్ భారతదేశంలో కొత్త EVలను అందించాలనే ప్రణాళికలను కలిగి ఉంది, ఇవి తమ తమిళనాడు కర్మాగారం నుండి ఉత్పత్తి చేయనున్నారు. మూడవ ప్లాంట్ జోడింపుతో భారతదేశంలో మరిన్ని మోడల్‌లను అందించే అవకాశం ఉంది, వెయిటింగ్ పీరియడ్ؚను తగ్గించడం మరియు తమ ఎక్స్ؚపోర్ట్ؚలను పెంచుకోవడం గురించి హ్యుందాయ్ పరిశీలించవచ్చు. APAపై సంతకం చేసినప్పటికీ, కొనుగోలు పూర్తి కావడం అనేది నెరవేర్చవలసిన కొన్ని నియంత్రణ అనుమతులు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది. 

2023 Hyundai i20 spied

ప్రస్తుతం హ్యుందాయ్ భారతదేశంలో 13 కార్‌లను విక్రయిస్తోంది, వీటిలో రెండు EVలు – IONIQ 5 మరియు కోనా ఎలక్ట్రిక్ ఉన్నాయి. క్రెటా, i20, మరియు కోనా EVలకు నవీకరణ జరగవలసి ఉంది, వీటి కొత్త వర్షన్ؚల విడుదలను మనం వచ్చే సంవత్సరం చూడవచ్చు.

భవిష్యత్తులో కొత్త ఇండియా-ప్రత్యేక EVని విడుదల చేయాలనే ప్రణాళికను హ్యుందాయ్ ప్రకటించింది, క్రెటా EV అనేక సార్లు పరీక్షించబడుతూ కెమెరాకు చిక్కింది కాబట్టి ప్రత్యేక EV ఇదే కావచ్చు. అంతేకాకుండా, హ్యుందాయ్ ఒక MPVని కూడా తీసుకువస్తుందని అంచనా, దీని ధర క్యారెన్స్ؚకు సమానంగా ఉంటుంది మరియు టయోటా ఇన్నోవాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 

ఇది కూడా చదవండి: టాటా పంచ్ CNG Vs హ్యుందాయ్ ఎక్స్టర్ CNG – క్లెయిమ్ చేసిన మైలేజీ పోలిక 

ఈ కారు తయారీదారు చాలా కాలం నుండి భారత ఆటో పరిశ్రమలో రెండవ అతి పెద్ద బ్రాండ్ؚ స్థానాన్ని నిలుపుకుంది, అయితే ప్రస్తుతం టాటా ఈ స్థానానికి చేరుకుంది. ఈ కొనుగోలు, పెరిగిన ఉత్పత్తి సామర్ధ్యాలు, హ్యుందాయ్ తన మార్కెట్ సామర్ధ్యాన్ని నిలుపుకోవడంలో మాత్రమే కాకుండా, ఇంకా వృద్ధి చెందడానికి కూడా ఎంతో సహాయపడతాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience