హ్యుందాయ్ అయోనిక్ 5 వాస్తవ పరిధి తనిఖీ – సింగిల్ ఛార్జ్ؚతో ఈ వాహనం ఎంత మైలేజ్‌ను అందిస్తుంది
హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం tarun ద్వారా మే 08, 2023 12:07 pm ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అయోనిక్ 5, 600కిలోమీటర్‌ల పరిధిని క్లెయిమ్ చేస్తుండగా, వాస్తవ- డ్రైవింగ్ పరిస్థితులలో ఇది ఎంత మైలేజ్‌ను అందిస్తుందో చూద్దాం
దక్షిణ కొరియన్ కారు తయారీదారు భారతదేశంలో విక్రయిస్తున్న అతి ఖరీదైన కారు, హ్యుందాయ్ అయోనిక్ 5. ఇది నియో-రెట్రో స్టైల్ SUV-హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్, దీని ధర రూ. 44.95 లక్షలగా ఉంది (ఎక్స్-షోరూమ్). ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన హ్యుందాయ్ E-GMP ప్లాట్ؚఫార్మ్‌పై ఆధారపడిన మొదటి మోడల్‌గా అయోనిక్ 5 నిలుస్తుంది. ఈ ప్రీమియం EVని బ్యాటరీ స్థాయి సున్నాకు వచ్చే వరకూ ఇటీవల డ్రైవ్ చేశాము. కొన్ని సాంకేతిక వివరాలతో ప్రారంభించి ఇయోనిక్ 5 గురించిన పరిశీలనలను క్రింద అందించబడ్డాయి:
బ్యాటరీ మరియు మోటార్ స్పెసిఫికేషన్‌లు
బ్యాటరీ |
72.6kWh |
పవర్ |
217PS |
టార్క్ |
350Nm |
0-100kmph (పరీక్షించబడినది) |
7.68 సెకన్లు |
పరిధి (క్లెయిమ్ చేసినది) |
631 kms |
డ్రైవ్ |
రేర్-వీల్ డ్రైవ్ |
72.6kWh బ్యాటరీ ప్యాక్‌తో 631కిలోమీటర్‌ల క్లెయిమ్ చేసిన మైలేజ్‌ను అయోనిక్ 5 అందిస్తుంది. వెనుక యక్సిల్ؚకు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 217PS పవర్ మరియు 350Nm గరిష్ట టార్క్ؚను అందిస్తుంది. రోడ్ టెస్ట్ؚలో, సున్నా నుండి 100 kmphను కేవలం 7.68 సెకన్‌లలో అందుకున్నాం. ఈ భారీ బ్యాటరీకి ఉన్న సింగిల్ మోటార్ సాధారణంగా మరింత పరిధి అందించడానికి సరిపోతుంది, కానీ దీని పనితీరు ఈ గణాంకాన్ని తగ్గించవచ్చు.
వాస్తవ- పరిధి
‘డ్రైవ్ؚ టు డెత్’ అనే ఆలోచనతో హైవేలు, సిటీ ట్రాఫిక్ మరియు వంపులు తిరిగిన ఘాట్ؚలలో ప్రయాణం చేస్తూ బ్యాటరీని 100 శాతం నుండి 0 శాతం వరకు వచ్చేలా చేశాము. క్లైమేట్ కంట్రోల్ؚను సౌకర్యవంతమైన 23 డిగ్రీల వద్ద మరియు ఫ్యాన్ వేగాన్ని 2లో ఉంచాము, ఇది ఎండాకాలానికి సరైన సెట్టింగ్. అయితే, ఫ్యాన్ వేగాన్ని పెంచితే, అంచనా పరిధి గణనీయంగా తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి: అధికారిక విడుదలకు ముందే ఆన్ؚలైన్ؚలో కనిపించిన హ్యుందాయ్ ఎక్స్ؚటర్
పైన పేర్కొన్న పారామీటర్‌లలో మరియు వివిధ వాస్తవ-డ్రైవింగ్ పరిస్థితులలో, అయోనిక్ 5 431.9 కిలోమీటర్‌ల వరకు పరిధిని అందించింది. ఇది క్లెయిమ్ చేసిన 631కిమీ కంటే చాలా తక్కువ, కానీ ఊయపయోగకరమైనది. ఆ సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలంటే, వ్యూహాత్మక డ్రైవింగ్ మరియు రూట్ ప్లానింగ్ؚతో దీని 500కిమీ వరకు పొందవచ్చు.
సున్నాకు దగ్గర అయినప్పుడు ఏం జరుగుతుంది?
సాధారణంగా, బ్యాటరీ 20 లేదా 15 శాతం కంటే తగ్గినప్పుడు ఛార్జర్ అందుబాటులో వచ్చేవరకు తగిన పరిధిని అందించడానికి EVల పనితీరు తగ్గిపోతుంది. అయోనిక్ 5 విషయంలో, ఛార్జింగ్ ఐదు శాతానికి తగ్గేవరకూ పనితీరులో ఎటువంటి మార్పులు లేదు, అప్పుడు మాత్రమే, పిక్అప్ؚలో గణనీయమైన తగ్గుదలను గమనించవచ్చు. ఛార్జింగ్ స్థాయి సున్నా శాతం మార్క్ؚకు వచ్చినప్పుడు, కారు లింప్ మోడ్ؚలోకి వెళ్తుంది కానీ అప్పటికీ నగరంలో నడపగలిగేలా ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా సున్నాకు వచ్చినప్పుడు కూడా రెండు కిలోమీటర్‌ల డ్రైవబుల్ పరిధిని పొందగలము.
మీ హ్యుందాయ్ అయోనిక్ 5తో ఎంత పరిధి వచ్చింది? క్రింద కామెంట్ సెక్షన్ؚలో తెలియజేయండి.
ఇక్కడ మరింత చదవండి : హ్యుందాయ్ అయోనిక్ 5 ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful