• English
  • Login / Register

అధికారిక విడుదలకు ముందుగానే ఆన్ؚలైన్ؚలో కనిపించిన హ్యుందాయ్ ఎక్స్టర్

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా మే 05, 2023 01:41 pm ప్రచురించబడింది

  • 66 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ భారతదేశ లైనప్ؚలో ఎక్స్టర్ కొత్త ఎంట్రీ-లెవెల్ SUVగా నిలుస్తుంది

Hyundai Exter spied

  • హ్యుందాయ్ ఇండియా ఇటీవల ఈ మైక్రో SUV టీజర్ స్కెచ్ؚను పంచుకుంది.

  • H-అకారపు LED DRLలు మరియు టెయిల్ؚలైట్ ఎలిమెంట్ؚలు, రూఫ్ రెయిల్స్ మరియు ఆలాయ్ వీల్స్ కూడా రహస్య చిత్రాలలో కనిపించాయి.

  • భారీ టచ్ؚస్క్రీన్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు కూడా ఉంటాయని అంచనా.

  • గ్రాండ్ i10 నియోస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చు; టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా ఉండవచ్చని ఆశిస్తున్నాము.

  • ధరలు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చు.

హ్యుందాయ్ ఎక్స్టర్ టీజర్ స్కెచ్ రూపంలో ఈ వాహన మొదటి లుక్ؚను ఇటీవలే చూశాము. పూర్తిగా దాచి ఉంచబడినట్లుగా కొన్ని వాహనాలు కనిపించినప్పటికి, ప్రస్తుతానికి సౌత్ కొరియాలో స్పష్టంగా కనిపించిన మోడల్ؚతో దీని ఫస్ట్ లుక్ చూడవచ్చు.

ఏం కనిపించింది?

రహస్య చిత్రాలలో గమనించదగిన మొదటి అంశం, టీజర్ స్కెచ్‌లో అందించిన డిజైన్ వాస్తవానికి  చాలా దగ్గరగా ఉంది. తెలుపు రంగు ఫినిషింగ్‌తో, స్కెచ్ؚలో ఉన్నట్లుగానే SUV ప్రాజెక్టర్ హెడ్‌లైట్‌లను (చుట్టూ క్రోమ్ؚతో) మరియు H-ఆకారపు LED DRL సెట్అప్ؚ కనిపిస్తుంది. Y-అకారపు ధృడమైన వీల్ ఆర్చ్ؚలు, 4-స్పోక్ డ్యూయల్-టోన్ ఆలాయ్ వీల్స్ మరియు రూఫ్ రెయిల్స్ؚలు కూడా ఈ రహస్య మోడల్ؚలో చూడవచ్చు.

Hyundai Exter rear spied

దీని వెనుక మరింత నిటారైన టెయిల్ గేట్‌ను కలిగి ఉంది మరియు కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లు కూడా ఉన్నాయి, ఇవి H-ఆకారంలో LED DRLలతో వస్తాయి. కంపించిన ఎక్స్టర్ భారీ గుండ్రని ఆకారం కలిగిన ఎగ్జాస్ట్ؚను కలిగి ఉంది అయితే ఇది ఇండియా-స్పెక్ మోడల్ؚలో ఉండకపోవచ్చు.  

ఇది కూడా చదవండి: 5 భారతీయ నగరాలలో తమ కస్టమర్‌ల కోసం కాన్సర్ట్ؚలను నిర్వహిస్తున్న హ్యుందాయ్ 

హ్యుందాయ్ ఎక్స్టర్ క్యాబిన్ మరియు ఫీచర్‌లు 

ఎక్స్‌టర్ ఇంటీరియర్‌ల గురించి ఇప్పటికీ వెల్లడించకపోయిన, హ్యుందాయ్ తన మైక్రో SUVలో భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ యూనిట్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, డిజిటైజ్ చేసిన డ్రైవర్ డిస్ప్లే మరియు క్రూజ్ కంట్రోల్ అందించవచ్చని అంచనా.

భద్రత విషయంలో, ఇండియా-స్పెక్ ఎక్స్టర్ ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), EBDతో ABS, మరియు రివర్సింగ్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా.

పెట్రోల్ పవర్ؚను మాత్రమే పొందుతుంది 

ఇండియా-స్పెక్ ఎక్స్‌టర్‌లో గ్రాండ్ i10 నియోస్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ (83PS/114Nm) పెట్రోల్ ఇంజన్ ఉంటుందని ఆశిస్తున్నాము. 5- స్పీడ్‌ల మాన్యువల్ؚను పొందవచ్చు, హ్యుందాయ్ దీనిలో 5-స్పీడ్‌ AMT ఎంపికను కూడా అందించవచ్చు. గ్రాండ్ i10 నియోస్ؚలో చూసినట్లుగా ఎక్స్టర్ CNG కిట్ ఎంపికతో కూడా రావచ్చు.

ఇది షోరూమ్ؚలకు ఎప్పుడు వస్తుంది?

Hyundai Exter teaser sketch

రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఎక్స్టర్ؚను హ్యుందాయ్ జూన్ 2023 నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని అంచనా. ఈ మైక్రో SUV టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, సిట్రోయెన్ C3, రెనాల్ట్ కైగర్ మరియు నిసాన్ మాగ్నైట్ؚలతో పోటీ పడనుంది.

చిత్రం మూలం 

was this article helpful ?

Write your Comment on Hyundai ఎక్స్టర్

1 వ్యాఖ్య
1
S
sumeet v shah
May 5, 2023, 6:29:34 PM

Your article was a great help for me to understand about this car in detail.

Read More...
    సమాధానం
    Write a Reply

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience