• English
  • Login / Register

సిసిఐ ద్వారా 420.26 కోట్ల జరిమానాకు గురైన హ్యూందాయ్ ఇండియా

జూలై 29, 2015 12:54 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) 28 జూలై 2015 న, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ ) చేత 420.26 కోట్ల జరిమానా విధించబడింది. వాహనతయారరీ సంస్థ బహిరంగ మార్కెట్లో దాని వాహనాల యొక్క విడిభాగాల విక్రయం నిరోధించమని ఆరోపణలు చేసింది. 14 మంది ఆటో జెయింట్స్ ఇదే విషయంలో ఆగష్టు లో సిసిఐ చేత మొత్తం 2,544.64 కోట్ల జరిమానాకు గురి అయ్యారు. ఈ జాబితాలో కంపెనీలు హోండా సియోల్, ఫియట్, వోక్స్వ్యాగన్, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, జనరల్ మోటార్స్, హిందూస్థాన్ మోటార్స్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, నిస్సాన్ మోటార్స్, స్కోడా, టాటా మోటార్స్ మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఉన్నాయి.

హెచ్ఎంఐఎల్ తో పాటు, రేవా మరియు ప్రీమియర్ కూడా "సీజ్ మరియు డెసిస్ట్" పోటీనిరోధక విధానాలకు లోనయ్యారు, కానీ అదృష్టవశాత్తూ ఏ జరిమానా వారిపై విధించలేదు. సిసిఐ కూడా ప్రీమియర్ మరియు రేవా సంస్థలకు అనుకూలంగా కొన్ని ఉపశమన విషయాలు ఉన్నాయి అని చెప్పారు. అందువలన కమిషన్, ఈ రెండు కంపెనీలకు వ్యతిరేకంగా ఎలాంటి ద్రవ్య సంబంధమైన జరిమానా విధించకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఇది కాకుండా ఈ 17 కంపెనీలకు వర్తించే ఇతర ఆదేశాలు అన్నీ కూడా ఈ రెండు కంపెనీలకు వర్తిస్తాయి. సిసిఐ కూడా ఈ 17 కంపెనీలకు వ్యతిరేకంగా దీర్ఘ కాల విచారణ పూర్తిచేసింది.

సంస్థలు కొన్ని నిర్దిష్ట వారంటీ నిబంధనలను కలిగి ఉన్నాయని, అవి వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని, ఏవైనా మరమ్మత్తులు ఉంటే వారి స్వంత నెట్వర్క్ డీలర్స్ దగ్గర మాత్రమే చేయించుకోవాలని సిసిఐ తెలిపింది. ఒకవేళ వినియోగదారులు వారి వాహనాన్ని ఏదైనా మూడవ పార్టీ వ్యాపారి దగ్గర మరమ్మతులు చేయించుకుంటే ఆ వారంటీ అలాగే నిలిచిపోతుందని తెలిపింది. అన్ని కంపెనీలు ఒక ఒప్పందం ప్రకారం వారి యొక్క విడి భాగాలను బయట మార్కెట్లో అమ్మకాలు సాగించకుండా నిరోధించాయి లేదా ప్రత్యేకమైన పంపిణీ ఒప్పందాల ద్వారా వారి డీలర్స్ వద్ద కొనుగోలు చేయవచ్చు అని ప్రకటించాయి మరియు ధర్మమైన నిబంధలను తిరస్కరించకుండా పాటించాలని కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

హెచ్ఎంఐఎల్ ఆరోపణలు చేసినప్పటికీ జరిమానాను కొంతమేరకు తగ్గించి మొత్తం 420.26 కోట్ల జరిమానాను కట్టవలసిందిగా సిసిఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది హెచ్ఎంఐఎల్ సంస్థ యొక్క భారతదేశంలోని మూడు ఆర్థిక సంవత్సరాల, సగటు వార్షిక టర్నోవర్ లో రెండో శాతం ఉంటుంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience