• English
    • Login / Register

    దేశవ్యాప్తంగా 10వ 'ఆల్వేస్ ఎరౌండ్' ప్రచారంను ప్రారంభించిన హ్యూందాయ్ ఇండియా

    ఆగష్టు 24, 2015 05:10 pm cardekho ద్వారా సవరించబడింది

    • 15 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశవ్యాప్తంగా 10వ 'ఆల్వేస్ ఎరౌండ్' ప్రచారం ను ప్రకటించింది. ఈ 'ఆల్వేస్ ఎరౌండ్' ప్రచారం 23 ఆగష్టు 2015 నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది దేశవ్యాప్తంగా అనుకూలమైన ప్రాంతాల్లో దాని వినియోగదారుల కోసం ఉచిత 18 పాయింట్ చెక్ అప్ ను అందిస్తుంది. 2015 చివరి నాటికి 8,000 స్థానాలను కవర్ చేస్తుందని ఈ కొరియన్ వాహన సంస్థ హామీ ఇచ్చింది. 

    ఈ హ్యుందాయ్ 'ఆల్వేస్ ఎరౌండ్' ప్రచారం, వాహనాల యొక్క పరీక్ష కోసం ఒక సమగ్ర 18 పాయింట్ చెక్ అప్ ను అందిస్తుంది మరియు కారు కి ఉచిత డ్రై వాష్ మరియు శీతలకరణి మరియు ఆయిల్ టాప్ అప్ వంటి సేవలను అందిస్తుంది. హ్యుందాయ్ యొక్క టీం కూడా వాహనం యొక్క పనితీరు & అమ్మకాల తర్వాత సేవల గురించిన సలహాలు మరియు సూచనలను సేకరిస్తుంది. అంతేకాక, వినియోగదారులు ఈ క్యాంప్ గురించి మరింత సమాచారం కోసం వారి సమీప డీలర్స్ ను సంప్రదించవచ్చు అని హ్యూందాయ్ సంస్థ తెలిపింది.
     
    ఈ క్యాంప్ సందర్భంగా హ్యూందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్. రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ "హ్యుందాయ్ 'ఆల్వేస్ ఎరౌండ్' ప్రచారం మా వినియోగదారుల యొక్క సంతృప్తి స్థాయిని విస్తరించేందుకు చేపట్టబడింది. మా దృష్టి అంతా మా వినియోగదారుల యొక్క జీవిత కాల భాగస్వామ్యం మీద ఉంది మరియు అన్ని టచ్ పాయింట్ల వద్ద హ్యుందాయ్ ప్రీమియం అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాము. మేము మా వినియోగదారులకు విలువను అందించడానికి ఎప్పటికప్పుడు ఇటువంటి ప్రచారాలను చేపడతాము. గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుండి మేము గొప్ప స్పందనను పొందుతున్నాము మరియు హ్యుందాయ్ యజమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రచారం చాలా బాగా విజయం సాధిస్తుందని మేము బలంగానమ్ముతున్నాము " అని ఆయన వాఖ్యానించారు.

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    కార్ వార్తలు

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience