హ్యుందాయ్ ఫిబ్రవరి 2019 ఆఫర్లు: ఎలంట్రా, టక్సన్ మీద 1.3 లక్షలు వరకూ ప్రయోజనాలు
ఏప్రిల్ 20, 2019 01:30 pm dinesh ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
- ఎలంట్రా, టక్సన్ మీద 1.3 లక్షలు వరకూ ప్రయోజనాలు ఉన్నాయి.
- ఎలైట్ i20, i20 యాక్టివ్ మరియు వెర్నా రూ. 50,000 వరకు లాభాలతో లభిస్తాయి.
- గ్రాండ్ i10 మరియు ఎక్సెంట్ వరుసగా రూ. 85,000, రూ. 90,000 వరకు లాభాలతో లభిస్తాయి.
ఈ నెలలో హ్యుందాయ్ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే, మీ కోసం మా దగ్గర ఒక మంచి వార్త ఉంది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ దాని మొత్తం శ్రేణిలో వివిధ ప్రయోజనాలను అందిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఆఫర్లు, ఫిబ్రవరి 25 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి, అవి కూడా MY2018 కార్లపై చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు, ఆఫర్లను చూద్దాం:
మోడల్ |
వేరియంట్స్ |
ప్రయోజనాలు |
గ్రాండ్ i10 (పెట్రోల్) |
అన్ని |
రూ. 75,000 వరకు |
గ్రాండ్ i10 (డీజిల్) |
అన్ని |
రూ. 85,000 వరకు |
ఎలైట్ i20 |
అన్ని |
రూ. 50,000 వరకు |
i20 యాక్టివ్ |
అన్ని |
రూ. 50,000 వరకు |
Xcent |
అన్ని |
రూ . 90,000 వరకు |
వెర్నా |
అన్ని |
రూ.50,000 వరకు |
ఎలంట్రా |
అన్ని |
రూ. 1,30,000 వరకు |
టక్సన్ |
అన్ని |
రూ. 1,30,000 వరకు |
హ్యుందాయ్ మొత్తం లాభాలపై వివరణాత్మక విభజన వెల్లడించలేదు. అయితే, దీనిలో ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, పొడిగించిన వారంటీ మరియు ఉచితం భీమా వంటి ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి, మీ సమీప హ్యుందాయ్ డీలర్ ను సంప్రదించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.
మీరు ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం కారుని మీతో ఉంచుకున్నామని ప్లాన్ చేస్తే మాత్రమే మేము MY2018 కారు కొనుగోలు చేసుకోమని మీకు సిఫార్సు చేస్తాము. మీరు తరచుగా కారులను మార్చుకుంటే మాత్రం, MY2018 కారు MY 2019 కారు కంటే తక్కువ పునఃవిక్రయం(రీ సేల్) విలువను పొందవచ్చని గుర్తుంచుకోండి.