మైక్రో SUV ఎక్స్టర్లో ఉన్న రెండు కీలక ఫీచర్‌లను వెల్లడిస్తూ సరికొత్త టీజర్‌ను విడుదల చేసిన హ్యుందాయ్
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా మే 25, 2023 07:24 pm ప్రచురించబడింది
- 46 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశంలో సన్ؚరూఫ్ؚను పొందిన మొదటి మైక్రో SUVగా ఎక్స్టర్ నిలుస్తుంది
-
హ్యుందాయ్, ఎక్స్టర్ؚను జులై 10న విడుదల చేయనుంది.
-
దీన్ని ఐదు వేరియెంట్‌లలో అందిస్తున్నారు: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్.
-
ఎక్స్టర్ؚ డ్యాష్ؚకామ్‌తో పాటుగా డ్యూయల్ కెమెరాలతో వస్తుంది, ముందు మరియు వెనుక భాగాలలో కెమెరా వస్తుంది.
-
దీని సన్ؚరూఫ్ వాయిస్ కమాండ్ؚలతో పని చేస్తుంది.
-
హ్యుందాయ్ దీన్ని 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ؚతో అందిస్తుంది; CNG ఎంపిక కూడా ఉంటుంది.
-
ప్రారంభ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
హ్యుందాయ్ ఎక్స్టర్ؚలోని ముఖ్యమైన భద్రత ఫీచర్‌లను వెల్లడించిన కొంత కాలానికే, ఈ కారు తయారీదారు ఇప్పుడు దీని సింగిల్-పేన్ సన్ؚరూఫ్ؚను చూపుతున్న టీజర్ చిత్రాన్ని విడుదల చేశారు. టీజర్ చిత్రంతో పాటు, ఈ మైక్రో SUV భారతదేశంలో జులై 10న విడుదల అవుతుందని కూడా హ్యుందాయ్ నిర్ధారించింది. ఈ ఫీచర్ కారణంగా తన ప్రధాన పోటీదారు టాటా పంచ్ పై ఎక్స్టర్ ఖచ్చితంగా పై చేయి సాధిస్తుంది.
వెల్లడించబడిన రెండు కీలకమైన ఫీచర్‌ల గురించి మరిన్ని వివరాలు
ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తున్న సన్ؚరూఫ్ మాత్రమే కాకుండా, ఎక్స్టర్ؚలో డ్యూయల్ డ్యాష్ؚకామ్ సెట్అప్ కూడా ఉంది, ఇది కూడా ఈ విభాగంలో మొదటిసారి వస్తోంది.
ముందు మరియు వెనుక కెమెరాలతో, ఇది 2.3-అంగుళాల డిస్ప్లే, స్మార్ట్ؚఫోన్ యాప్ కనెక్టివిటీ, మల్టీ-రికార్డింగ్ మోడ్ؚలతో వస్తుంది. పూర్తి HD రిజల్యూషన్ؚలో వీడియోలను షూట్ చేయగలరు, డ్యూయల్ కెమెరాలు డ్రైవింగ్ (సాధారణం), ఈవెంట్ (భద్రత) మరియు వెకేషన్ (టైమ్ లాప్స్) వంటి విభిన్న రికార్డింగ్ ఎంపికలను కలిగి ఉంటాయి.
కనెక్టెడ్ కార్ సాంకేతికత కారణంగా, ఎక్స్టర్ సన్ؚరూఫ్ؚను “సన్ؚరూఫ్ؚను తెరువు” లేదా “నేను ఆకాశాన్ని చూడాలనుకుంటున్నాను” వంటి వాయిస్ కమాండ్ؚలతో ఆపరేట్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: త్వరలోనే డ్యాష్ؚకామ్ؚగా కూడా పని చేయనున్న మీ ఆండ్రాయిడ్ ఫోన్
ఆశించదగిన ఇతర ఫీచర్‌లు
ఈ రెండు ఫీచర్‌లు మాత్రమే కాకుండా, ఎక్స్టర్ؚలో క్రూయిజ్ కంట్రోల్, భారీ టచ్ؚస్క్రీన్ యూనిట్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను కూడా హ్యుందాయ్ అందిస్తుందని ఆశిస్తున్నాము. దీని భద్రత నెట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.
రెండు పవర్ؚట్రెయిన్ ఎంపికలు
హ్యుందాయ్, ఎక్స్టర్ను 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందిస్తుంది, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో జోడించబడుతుంది. CNG కిట్ ఎంపికతో కూడా అందుబాటులో ఉంటుంది.
వేరియెంట్ؚలు, ధరలు మరియు పోటీదారులు
దీన్ని ఐదు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తున్నారు - EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. ఎక్స్టర్ ధరలు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. టాటా పంచ్‌తో మాత్రమే కాకుండా ఇది సిట్రోయెన్ C3, రెనాల్ట్ కైగర్, మారుతి ఫ్రాంక్స్ మరియు నిసాన్ మాగ్నైట్ؚలతో కూడా పోటీ పడుతుంది.