• English
  • Login / Register

Hyundai Exter vs Tata Punch: ఆగస్టు 2023 అమ్మకాలు, సెప్టెంబర్ వెయిటింగ్ పీరియడ్ పోలిక

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా సెప్టెంబర్ 13, 2023 02:18 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇంటికి తీసుకువెళ్లేందుకు, హ్యుందాయ్ ఎక్స్టర్ కు 3 నుండి 8 నెలల వెయిటింగ్ పీరియడ్ కాగా, టాటా పంచ్ వెయిటింగ్ పీరియడ్ ఒక నెల నుండి 3 నెలలు మాత్రమే.

Hyundai Exter vs Tata Punch

  • టాటా పంచ్ కు పోటీగా జూలై 2023 హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదలైంది.

  • టాటా ప్రతినెలా సగటున 10,000 యూనిట్ల పంచ్ విక్రయిస్తోంది.

  • హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభమైనప్పుడు నుండి 7,000 యూనిట్లను విక్రయించింది.

  • ఈ రెండు SUVల ధర రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి.

అక్టోబర్ 2021 నుండి భారతదేశంలో మైక్రో SUV సెగ్మెంట్లో వినియోగదారులు కొనుగోలు చేయగల ఏకైక కారు టాటా పంచ్, కానీ ఇప్పుడు జూలై 2023 నుండి, హ్యుందాయ్ ఎక్స్టర్ దానికి పోటీగా వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే ఎక్స్టర్ కారుకు 50,000 బుకింగ్ లు అయ్యాయి. అయితే హ్యుందాయ్ ఎక్స్టర్ రావడంతో టాటా పంచ్ అమ్మకాలపై ప్రభావం చూపిందా? దీని గురించి తెలుసుకోవడానికి, మనం గత రెండు నెలల్లో పెట్రోల్ తో మాత్రం పనిచేసే మైక్రో SUVల అమ్మకాలు మరియు వాటి ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ ను పరిశీలిద్దాము:

అమ్మకాలు

మోడల్

జూలై 2023

ఆగస్టు 2023

హ్యుందాయ్ ఎక్స్టర్

7,000 యూనిట్లు

7,430 యూనిట్లు

టాటా పంచ్

12,019 యూనిట్లు

14,523 యూనిట్లు

Tata Punch CNG

పై టేబల్ లో చూసినట్లయితే, పంచ్ కారు అమ్మకాలు జూలై మరియు ఆగస్టు 2023 లో ఎక్స్టర్ కంటే ఎక్కువగా ఉన్నాయి. టాటా పంచ్ యొక్క 10,000 యూనిట్లకు పైగా విక్రయించగా, ఎక్స్టర్ సుమారు 7000  యూనిట్లను విక్రయించింది. టాటా పంచ్ లో CNG కిట్ ఆప్షన్ మరియు సన్ రూఫ్ ఫీచర్ కూడా లభిస్తుంది, ఇది హ్యుందాయ్ ఎక్స్టర్ లో లేదు. రెండవ ప్రత్యేకత ఏమిటంటే పంచ్ కారు యొక్క నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం కూడా ఎక్స్టర్ కంటే ఎక్కువ.

ఇది కూడా చదవండి: టాటా పంచ్ CNG వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్ CNG - మైలేజ్ పోలిక

వెయిటింగ్ పీరియడ్

మోడెల్

సెప్టెంబర్ 2023 వెయిటింగ్ పీరియడ్

హ్యుందాయ్ ఎక్స్టర్

3 నుండి 8 నెలలు

టాటా పంచ్

1 నుండి 3 నెలలు

Hyundia Exter

ఈ రెండు మోడళ్ల లభ్యతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు టాటా పంచ్ SUVని తీసుకుంటే, మీరు దాని డెలివరీని త్వరగా పొందగలరు. అదే సమయంలో, మీరు హ్యుందాయ్ ఎక్స్టర్ డెలివరీ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది, కానీ ఏ ప్రధాన నగరంలో వెంటనే అందుబాటులో లభించవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి మోడల్ యొక్క వెయిటింగ్ సమయం వేరియంట్ మరియు రంగును బట్టి భిన్నంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి:  KBC 2023లో కోటి రూపాయలు గెలుచుకున్న కంటెస్టెంట్కు బహుమతిగా హ్యుందాయ్ ఎక్స్టర్

వేరియంట్లు మరియు ధరలు

హ్యుందాయ్ ఎక్స్టర్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది: EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్ - దీని ధర రూ .6 లక్షల నుండి రూ.10.10 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)మధ్య ఉంది. మరోవైపు, . టాటా పంచ్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది - ప్యూర్, అడ్వెంచర్, అచీవ్డ్ మరియు క్రియేటివ్ - హ్యుందాయ్ ప్రత్యర్థితో సమానమైన ధర శ్రేణిని కలిగి ఉంది.

ఇది కూడా చూడండి: హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ టాటా పంచ్: ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్ పోలిక

మరింత చదవండి : హ్యుందాయ్ ఎక్స్టర్ AMT 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai ఎక్స్టర్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience