Hyundai Creta Facelift vs Kia Seltos vs మారుతి గ్రాండ్ విటారా vs హోండా ఎలివేట్: ధర పోలిక
హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా జనవరి 18, 2024 01:58 pm ప్రచురించబడింది
- 843 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ మాత్రమే డీజిల్ ఇంజిన్ అందించే కాంపాక్ట్ SUVలు కాగా, గ్రాండ్ విటారా మరియు హైరైడర్ ఆప్షనల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ ట్రైన్ తో అందించబడతాయి.
2024 హ్యుందాయ్ క్రెటా ధరలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి, ప్రారంభ ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్). క్రెటా యొక్క ఫేస్ లిఫ్ట్ మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో కొన్ని డిజైన్ నవీకరణలు జరిగాయి. ఇప్పుడు ఇది మునుపటి కంటే ఎక్కువ కంఫర్ట్ మరియు భద్రతా ఫీచర్లను కూడా పొందుతుంది. ధర విషయానికి వస్తే, మేము కొత్త హ్యుందాయ్ క్రెటాను కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు హోండా ఎలివేట్ వంటి కాంపాక్ట్ SUVలతో పోల్చాము. వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
పెట్రోల్ మాన్యువల్
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ |
కియా సెల్టోస్ |
మారుతి గ్రాండ్ విటారా |
టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్ |
హోండా ఎలివేట్ |
E - రూ. 11 లక్షలు |
HTE- రూ. 10.90 లక్షలు |
సిగ్మా- రూ. 10.70 లక్షలు |
E- రూ. 11.14 లక్షలు |
|
SV - రూ. 11.58 లక్షలు |
||||
EX - రూ. 12.18 లక్షలు |
HTK- రూ. 12.10 లక్షలు |
డెల్టా- రూ. 12.10 లక్షలు |
V - రూ. 12.31 లక్షలు |
|
S- రూ. 12.81 లక్షలు |
||||
S - రూ. 13.39 లక్షలు |
HTK ప్లస్- రూ. 13.50 లక్షలు |
జీటా- రూ. 13.91 లక్షలు |
VX: రూ. 13.70 లక్షలు |
|
S(O) - రూ. 14.32 లక్షలు |
G - రూ. 14.49 లక్షలు |
|||
HTK ప్లస్ టర్బో iMT - రూ. 15 లక్షలు |
||||
SX - రూ. 15.27 లక్షలు |
HTX- రూ. 15.18 లక్షలు |
ఆల్ఫా- రూ. 15.41 లక్షలు |
ZX - రూ. 15.10 లక్షలు |
|
SX టెక్ - రూ. 15.95 లక్షలు |
V - రూ. 16.04 లక్షలు |
|||
ఆల్ఫా AWD - రూ. 16.91 లక్షలు |
||||
SX (O) -రూ. 17.24 లక్షలు |
V AWD - రూ. 17.54 లక్షలు |
|||
HTX ప్లస్ టర్బో iMT - రూ. 18.28 లక్షలు |
-
ఈ అన్ని కార్లలో, మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర అత్యల్పంగా ఉంది. దీని ప్రారంభ ధర ప్రారంభ ధర రూ. 10.70 లక్షలు, ఇది హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ కంటే రూ. 30,000 కంటే తక్కువ మరియు కియా సెల్టోస్ కంటే రూ. 20,000 తక్కువ.
- హోండా ఎలివేట్ గరిష్ట ప్రారంభ ధర రూ. 11.58 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ. 15.10 లక్షలు, ఇది ఈ పోలికలో ఇతర SUVల కంటే తక్కువ. క్రెటా యొక్క పెట్రోల్ మాన్యువల్ టాప్ వేరియంట్లు సెల్టోస్ మరియు హైరైడర్ యొక్క పెట్రోల్ మాన్యువల్ టాప్-స్పెక్ మోడళ్ల కంటే సరసమైనవి.
-
ప్రతి SUV 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో అందించబడుతుంది. క్రెటా మరియు సెల్టోస్ ఇంజన్ 115 PS శక్తిని మరియు 144 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా ఎలివేట్ యొక్క మాన్యువల్ మోడల్ ఇక్కడ అత్యంత శక్తివంతమైన మోడల్, ఇది 6-స్పీడ్ మాన్యువల్ తో 121 PS అవుట్ పుట్ ఇస్తుంది.
-
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (160 PS / 253 NM) తో IMT గేర్బాక్స్ (క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఎంపికను అందించిన ఏకైక SUVగా సెల్టోస్ నిలిచింది.
-
మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైదర్ 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తాయి, ఇది 103 PS మరియు 137 Nm ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడింది. ఈ ఇంజిన్ తక్కువ శక్తివంతమైన ఎంపిక, కానీ ఈ రెండు SUV కార్లలో, మీకు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపిక కూడా లభిస్తుంది.
ఇది కూడా చూడండి: ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా యొక్క అన్ని వేరియంట్ల ఫీచర్లు
పెట్రోల్ ఆటోమేటిక్
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ |
కియా సెల్టోస్ |
మారుతి గ్రాండ్ విటారా |
టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్ |
హోండా ఎలివేట్ |
డెల్టా- రూ. 13.60 లక్షలు |
V- రూ. 13.41 లక్షలు |
|||
S- రూ. 14.01 లక్షలు |
||||
VX: రూ. 14.80 లక్షలు |
||||
S (O) CVT - రూ. 15.82 లక్షలు |
జీటా- రూ. 15.41 లక్షలు |
G- రూ. 15.69 లక్షలు |
||
HTX CVT- రూ. 16.58 లక్షలు |
ఆల్ఫా- రూ. 16.91 లక్షలు |
S (హైబ్రిడ్)- రూ. 16.66 లక్షలు |
ZX - రూ. 16.20 లక్షలు |
|
SX టెక్ CVT - రూ. 17.45 లక్షలు |
V- రూ. 17.24 లక్షలు |
|||
SX (O) CVT - రూ. 18.70 లక్షలు |
జీటా ప్లస్ (హైబ్రిడ్) - రూ. 18.33 లక్షలు |
G (హైబ్రిడ్)- రూ. 18.69 లక్షలు |
||
HTX ప్లస్ టర్బో DCT - రూ. 19.18 లక్షలు |
||||
GTX ప్లస్ (S) టర్బో డీసీటీ- రూ. 19.38 లక్షలు |
||||
X లైన్ (S) - రూ. 19.60 లక్షలు |
||||
SX (O) టర్బో DCT - రూ. 20 లక్షలు |
GTX ప్లస్ టర్బో DCT - రూ. 19.98 లక్షలు |
ఆల్ఫా ప్లస్ (హైబ్రిడ్) - రూ. 19.83 లక్షలు |
||
X లైన్ టర్బో DCT - రూ. 20.30 లక్షలు |
V (హైబ్రిడ్)- రూ. 20.19 లక్షలు |
-
2024 క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ నేచురల్ ఆస్పిరేటెడ్ వెర్షన్ మరియు టర్బో వెర్షన్ మాదిరిగానే ఉంటుంది, ఇది సెల్టోస్లో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ లో CVT మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్(DCT) మిషన్ ఎంపికలు ఉంటాయి.
-
హోండా ఎలివేట్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కూడా ఉంటుంది, ఇది అత్యంత సరసమైన పెట్రోల్ ఆటోమేటిక్ కాంపాక్ట్ SUV, దీని ధర మారుతి గ్రాండ్ విటారా యొక్క ఎంట్రీ లెవల్ పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ కంటే రూ. 19,000 తక్కువ.
-
అత్యంత ఖరీదైన పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ కియా సెల్టోస్ యొక్క టాప్-స్పెక్ X లైన్ DCT వేరియంట్.
-
గ్రాండ్ విటారా మరియు హైదర్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఎంపికతో అందించబడుతుంది. ఈ రెండు SUVలు e-CVT గేర్ బాక్స్ తో జతచేయబడిన బలమైన హైబ్రిడ్ ఇంజిన్ తో అందించబడ్డాయి. ఈ మోడళ్ల ఇంధన సామర్థ్యం లీటరుకు 27.97 కిలోమీటర్లు.
ఇది కూడా చూడండి: హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ vs కియా సెల్టోస్: మైలేజ్ పోలిక
డీజిల్ మాన్యువల్
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ |
కియా సెల్టోస్ |
E - రూ. 12.45 లక్షలు |
HTE iMT - రూ. 12 లక్షలు |
EX - రూ. 13.68 లక్షలు |
HTK iMT - రూ. 13.60 లక్షలు |
S - రూ. 14.89 లక్షలు |
HTK ప్లస్ iMT - రూ. 15 లక్షలు |
S (O) - రూ. 15.82 లక్షలు |
|
HTX iMT - రూ. 16.68 లక్షలు |
|
SX టెక్ - రూ. 17.45 లక్షలు |
|
SX (O)- రూ. 18.75 లక్షలు |
HTX ప్లస్ iMT: రూ. 18.28 లక్షలు |
-
హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ మాత్రమే ఇప్పటికీ డీజిల్ ఇంజిన్ ఎంపికను అందించే రెండు కాంపాక్ట్ SUVలు. రెండూ ఒకే 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (116 PS / 250 Nm) ను ఉపయోగిస్తాయి. అయితే, క్రెటా సరైన 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికను అందిస్తుంది, అయితే సెల్టోస్ డీజిల్ 6-స్పీడ్ iMTతో వస్తుంది.
-
రెండింటి ధర దాదాపు ఒకేలా ఉంటుంది, కానీ సెల్టోస్ డీజిల్ ధర క్రెటా డీజిల్ కంటే రూ. 45,000 తక్కువ. టాప్-స్పెక్ సెల్టోస్ డీజిల్ మాన్యువల్ ధర క్రెటా కంటే రూ. 47,000 తక్కువ.
డీజిల్ ఆటోమేటిక్
హ్యుందాయ్ క్రెటా |
కియా సెల్టోస్ |
S (O) - రూ. 17.32 లక్షలు |
|
HTX- రూ. 18.18 లక్షలు |
|
GTX ప్లస్ (S) - రూ. 19.38 లక్షలు |
|
X లైన్ (S) - రూ. 19.60 లక్షలు |
|
SX (O)- రూ. 20 లక్షలు |
GTX ప్లస్ - రూ. 19.98 లక్షలు |
X లైన్ - రూ. 20.30 లక్షలు |
-
డీజిల్ ఆటోమేటిక్ విషయానికి వస్తే, సెల్టోస్ మరియు క్రెటా లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ లభిస్తుంది.
-
క్రెటా యొక్క ఎంట్రీ లెవల్ డీజిల్ ఆటోమేటిక్ ఎంపిక కియా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ కంటే సరసమైనది.
-
సెల్టోస్ X లైన్ యొక్క మ్యాట్ ఎక్ట్సీరియర్ మోడల్ ఇక్కడ అత్యంత ఖరీదైన డీజిల్ ఆటోమేటిక్ మోడల్ మరియు కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత ఖరీదైన ఎంపిక.
ప్రీమియం ఫీచర్ల విషయానికొస్తే, 2024 హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు కియా సెల్టోస్తో సమానంగా ఉంది మరియు ఈ రెండు SUVలు మంచి ఫీచర్లను అందిస్తాయి. ఇక్కడ హోండా ఎలివేట్ టాప్ వేరియంట్ ధర అత్యల్పంగా ఉంది, కానీ ఇందులో ఫీచర్లు కూడా లేవు. మారుతి మరియు టయోటా యొక్క SUVలు మంచి ఫీచర్లు మరియు టెక్నాలజీని అందిస్తాయి. మైలేజ్ ఫ్రెండ్లీ హైబ్రిడ్ పవర్ ట్రైన్ లు మరియు సరైన ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికను కలిగి ఉంటాయి, అయితే వాటి పవర్ ట్రెయిన్ పనితీరు కొద్దిగా తక్కువగా ఉంటుంది.
ఇతర కాంపాక్ట్ SUV కార్లతో పోలిస్తే కొత్త క్రెటా ధర ఎంతవరకు సహేతుకంగా ఉంది? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
మరింత చదవండి : హ్యుందాయ్ క్రెటా డీజిల్
0 out of 0 found this helpful