15 చిత్రాలలో New Mahindra XUV400 EL ప్రో వేరియంట్ వివరాలు వెల్లడి
మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం shreyash ద్వారా జనవరి 12, 2024 12:44 pm ప్రచురించబడింది
- 5.8K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా XUV400 EV కొత్త ప్రో వేరియంట్ల ధర గతంలో అందుబాటులో ఉన్న వేరియంట్ల కంటే రూ.1.5 లక్షల వరకు తక్కువ.
భారదేశంలో విడుదలైన నవీకరించిన మహీంద్రా XUV400 EV, మునుపటి మాదిరిగానే EC మరియు EL అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది, అయితే ఇప్పుడు వాటి పేరుకు 'ప్రో' అనే పదాన్ని జోడించారు. ఇందులో కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్, పెద్ద టచ్ స్క్రీన్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే గుర్తించదగిన మార్పులు. మేము XUV400 EV యొక్క టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్ను 15 చిత్రాలలో వివరించాము.
మహీంద్రా XUV400 EV ప్రో యొక్క ఎక్ట్సీరియర్ డిజైన్లో పెద్ద నవీకరణలు చేయలేదు. మునుపటిలా క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్పై కాపర్ ఇన్సర్ట్స్ మరియు LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్లైట్లను అందించారు.
ఈ కొత్త వేరియంట్ సైడ్ ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులు లేవు. వెనుక భాగంలో అదే LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. టెయిల్ గేట్ పై షార్ప్ ఫిన్ యాంటెనా, EV బ్యాడ్జింగ్ మాత్రమే ఇక్కడ ప్రధాన నవీకరణలు.
ఇది కూడా చదవండి: 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు మరియు అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్‌ను పొందనున్న టాటా పంచ్ EV
మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ SUV కారు క్యాబిన్ కు అనేక ముఖ్యమైన నవీకరణలను చేశారు. ఇందులో కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్, కొత్త సెంటర్ AC వెంట్‌ల పొజిషనింగ్ తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్, లెదర్ చుట్టిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. డ్యాష్ బోర్డ్ లోని కో-డ్రైవర్ సైడ్ లో స్టోరేజ్ స్పేస్ కు బదులుగా పియానో బ్లాక్ ఇన్సర్ట్ చేయబడింది.
XUV400 EV EL ప్రో వేరియంట్లో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీని క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ నవీకరించబడింది మరియు ఇది ఇప్పుడు డ్యూయల్-జోన్ ఫంక్షనాలిటీని పొందుతుంది.
ఇది కూడా చదవండి: మారుతి Evx ఎలక్ట్రిక్ SUV 2024 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది
క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కింద రెండు ఛార్జింగ్ పోర్టులు, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్ సెలెక్టర్ లివర్ మునుపటి మాదిరిగానే ఉంటుంది మరియు వెనుక భాగంలో రెండు కప్పు హోల్డర్లను కూడా అందించారు.
ఇందులో మహీంద్రా XUV700 నుంచి తీసుకున్న 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను అందించారు. ఈ డ్రైవర్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే ద్వారా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కు సింక్ చేయవచ్చు, ఆపై ఇది మ్యాప్ ఫీడ్ ను చూపించగలదు.
దీని అప్ హోల్ స్టరీ కూడా నవీకరించబడింది, ఇది ఇప్పుడు ఆల్-బ్లాక్ థీమ్ కు బదులుగా బ్లాక్ మరియు బ్యాడ్జ్ థీమ్ ను పొందుతుంది. వీటితో పాటు సన్ రూఫ్, ఎత్తు సర్దుబాటు చేసే డ్రైవర్ సీటును మునుపటిలా ఉంచారు.
వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కోసం, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లతో పాటు AC వెంట్లను కూడా అందించారు.
XUV400 EV లో రెండో వరుస సీట్లను ఉపయోగిస్తే 378 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదనపు స్థలం కోసం సీట్లను 60:40 నిష్పత్తిలో మడతపెట్టవచ్చు.
XUV400 EV EL ప్రో వేరియంట్ రెండు బ్యాటరీ ప్యాక్ లలో లభిస్తుంది: 34.5 కిలోవాట్లు మరియు 39.4 కిలోవాట్ల సామర్థ్యం, వరుసగా 375 కిలోమీటర్లు మరియు 456 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 150 PS శక్తిని మరియు 310 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది.
ధర శ్రేణి & ప్రత్యర్థులు
ప్రస్తుతం మహీంద్రా XUV400 EV ధర రూ.15.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్యలో ఉంది. ఇది టాటా నెక్సాన్ EV పోటీ పడనుంది. అలాగే దీన్ని MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ లకు సరసమైన ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
మరింత చదవండి : మహీంద్రా XUV400 EV ఆటోమేటిక్