• English
  • Login / Register

హ్యుందాయ్ క్రెటా ఎంట్రీ వేరియంట్స్ 1.6-లీటర్ డీజిల్ ని పొందనున్నాయి; ధర ప్రకటన త్వరలో

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం sonny ద్వారా అక్టోబర్ 21, 2019 04:29 pm ప్రచురించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజన్ ఎంపిక ఇప్పుడు మరింత తక్కువ ధరతో కూడుకున్నది

  •  క్రెటాకు మూడు BS4 ఇంజన్ ఎంపికలు లభిస్తాయి, అవి వరుసగా 1.6 లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ డీజిల్ మరియు 1.6-లీటర్ డీజిల్.
  •  ఇప్పటి వరకు, ఎంట్రీ-స్పెక్ డీజిల్ వేరియంట్లు E + మరియు EX లు 1.4-లీటర్ డీజిల్-మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
  •  ఇది ఇప్పుడు 1.6-లీటర్ డీజిల్-మాన్యువల్ పవర్ట్రెయిన్ యొక్క ఎంపికను పొందుతుంది; లక్షణాల జాబితా మాత్రం మారదు.
  •  రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్ 2020 నాటికి కొత్త BS6 ఇంజన్లతో రానుంది.
  •  మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌ కలిగిన E + మరియు EX ధరలను ఇంకా ప్రకటించలేదు.

Hyundai Creta Entry Variants To Get 1.6-Litre Diesel; Price Announcement Soon

కాంపాక్ట్ SUV యొక్క తాజా బ్రోచర్ ప్రకారం హ్యుందాయ్ క్రెటా యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్లు ఇప్పుడు మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి. 1.6-లీటర్ డీజిల్-మాన్యువల్ పవర్ట్రెయిన్ ఇప్పుడు 1.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు E + మరియు EX వేరియంట్‌లలో అందించబడుతుంది.

ప్రస్తుత-జెన్ క్రెటా మూడు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది - 1.6-లీటర్ పెట్రోల్, 1.6-లీటర్ డీజిల్ మరియు 1.4-డీజిల్. ఇది మొత్తం ఏడు వేరియంట్లతో లభిస్తుంది - E +, EX, S, SX, SX డ్యూయల్ టోన్, SX (O) మరియు SX (O) ఎగ్జిక్యూటివ్. ఇప్పటి వరకు, E +, EX మరియు S వేరియంట్‌కు 1.4-లీటర్ డీజిల్ ఎంపిక తో మాత్రమే ఉంది.

Hyundai Creta Entry Variants To Get 1.6-Litre Diesel; Price Announcement Soon

 వేరియంట్ ఇప్పటికీ 1.4-లీటర్ డీజిల్-మాన్యువల్‌కు మాత్రమే పరిమితం కాగా, ఎంట్రీ-స్పెక్ E + మరియు EX వేరియంట్లు ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్‌కు అనుసంధానించబడిన మరింత శక్తివంతమైన 1.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతున్నాయి. ఈ వేరియంట్లలో ఇప్పటికీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ AC వెంట్స్ వంటి ప్రాథమిక ఫీచర్లు లభిస్తుండగా, EX లో రియర్ పార్కింగ్ కెమెరా, LED DRL లు మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 5.0-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ప్రస్తుత ఇంజన్లు BS 4 కంప్లైంట్ మరియు  తదుపరి తరం క్రెటా లో ఏప్రిల్ 2020 నాటికి కొత్త BS 6 ఇంజన్లతో భర్తీ చేయబడతాయి.

Hyundai Creta Entry Variants To Get 1.6-Litre Diesel; Price Announcement Soon

1.6-లీటర్ డీజిల్-మాన్యువల్ ఎంపికతో లోవర్ వేరియంట్స్ యొక్క ధరల వివరాల కోసం మనం ఇంకా ఎదురు చూస్తున్నప్పటికీ, క్రెటా యొక్క ధరల వివరాలు మాత్రం అలానే ఉంటాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ SUV ప్రస్తుతం రూ .10 లక్షల నుంచి రూ. 15.67 లక్షల మధ్య రిటైల్ అవుతుంది (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). మరింత ప్రత్యేకంగా, 1.4-లీటర్ డీజిల్ మాన్యువల్‌ తో ఉన్న ప్రస్తుత E + మరియు EX వేరియంట్ల ధరలు వరుసగా 10 లక్షల రూపాయలు మరియు 11.02 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కొత్త  కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్,  MG హెక్టర్, టాటా హారియర్ మరియు రెనాల్ట్ కాప్టూర్ వంటివారికి ప్రత్యర్థి.   

మరింత చదవండి: క్రెటా డీజిల్

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience