2020 హ్యుందాయ్ క్రెటా చైనా-స్పెక్ ix25 కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది
అక్టోబర్ 16, 2019 11:01 am sonny ద్వారా సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఎలా ఉండబోతుందో మేము కొంచెం దగ్గరగా చూసాము
రెండవ తరం హ్యుందాయ్ క్రెటా 2020 ఆరంభంలో భారతదేశానికి చేరుకుంటుందని భావిస్తున్నారు, అయితే ఇది ఇప్పటికే దాని చైనీస్ కౌంటర్ ix25 ద్వారా ఎలా ఉండబోతుంది అనేది తెలిసింది. Ix25 ఇప్పుడు చైనాలో ప్రారంభించటానికి ముందే డీలర్ ఫ్లోర్స్ కు రావడం ప్రారంభించింది, ఇది లోపల మరియు వెలుపల ఎలా ఉండబోతుంది అనేది మరింత వివరంగా చూడటానికి అనుమతిస్తుంది. హ్యుందాయ్ 2020 ఆటో ఎక్స్‌పోలో రెండవ తరం క్రెటాను విడుదల చేయనుంది.
వెలుపలి భాగం
చైనా-స్పెక్ ix25 ప్రస్తుత క్రెటా నుండి చాలా భిన్నంగా కనిపిస్తుంది, ఇది మొట్టమొదట వెన్యూ లో చూసినటువంటి హ్యుందాయ్ యొక్క కొత్త సెన్సుయస్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ అనేది దీనిలో ఉండబోతుంది. LED DRLలను ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ యూనిట్ల పైన వేరే ఫ్రంట్ గ్రిల్‌తో అమర్చారు.
కొత్త గ్రిల్ కూడా బోనెట్ లిడ్ క్రింద స్పోర్టి వెంట్స్ ని కలిగి ఉంది.
దీని కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్ దాని కజిన్, కియా సెల్టోస్ వలే మల్టీ-రిఫ్లెక్టర్ LED లను కలిగి ఉంది.
దీని సైడ్ ప్రొఫైల్ సైడ్స్ మరియు వీల్ ఆర్చులపై క్లాడింగ్‌తో బాక్సీగా ఉంటుంది. ఇక్కడ కనిపించే మోడల్ కు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో సిల్వర్ C-పిల్లర్ లభిస్తుంది. దీనిని కొత్త అల్లాయ్ వీల్స్‌తో కూడా చూడవచ్చు.
వెనుక నుండి చూస్తే, ఇది ప్రస్తుత-జెన్ క్రెటా నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. టెయిల్‌గేట్ కొత్త టెయిల్ లాంప్స్‌ను కలిపే లైట్ బార్‌తో పెద్దగా కనిపిస్తుంది. ఇది ఇప్పటికీ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో బ్లాక్ బంపర్‌ను కలిగి ఉంది.
రెండవ తరం క్రెటా కియా సెల్టోస్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇది ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. మూడు మోడళ్ల మా డైమెన్షన్ పోలికను మీరు ఇక్కడ చదవవచ్చు.
లోపల భాగాలు
ix25 నెక్స్ట్-జెన్ క్రెటా గురించి చూపించే అత్యంత ఆసక్తికరమైన అంశం ఎక్స్టీరియర్ కంటే కూడా ఇంటీరియర్ అని చెప్పవచ్చు. ఈ చైనా-స్పెక్ మోడల్ కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంది.
ఇక్కడ కనిపించే మోడల్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం టెస్లా లాంటి వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో సరికొత్త సెంట్రల్ కన్సోల్ లేఅవుట్ ఉంది. దీని లేఅవుట్ పియానో బ్లాక్ ఫినిష్‌తో కన్సోల్ టన్నెల్‌లో కలిసిపోతుంది.
ఏదేమైనా, ix25 యొక్క మరొక వెర్షన్ కియా సెల్టోస్ వంటి డాష్‌బోర్డ్ లేఅవుట్ ని కలిగి ఉంటుంది. ఇండియా-స్పెక్ క్రెటాలో డాష్‌బోర్డ్ లేఅవుట్ ఎలా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇక్కడ కనిపించే కొత్త ix 25 కొత్త గేర్ సెలెక్టర్ డిజైన్‌తో ఆటోమేటిక్ వేరియంట్.
ఇది కొత్త సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది, ఇది ఇప్పుడు సెంటర్ లో మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే (LED) తో స్పోర్టియర్ లేఅవుట్‌ను పొందుతుంది.
నెక్స్ట్-జెన్ క్రెటా హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ లక్షణాల కోసం eSIM ని కలిగి ఉంటుంది.
ఇంజిన్లు
చైనా-స్పెక్ హ్యుందాయ్ ix 25 కి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే లభిస్తుంది. ఇండియా-స్పెక్ 2020 క్రెటా కియా సెల్టోస్‌లో లభించే అదే BS 6 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది.
హ్యుందాయ్ సెల్టోస్ నుండి 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందిస్తుందని భావిస్తున్నారు, బహుశా అది స్పోర్టియర్ N-లైన్ వేరియంట్.
మరింత చదవండి: క్రెటా డీజిల్