• English
    • Login / Register

    సరికొత్త లుక్‌, మరిన్ని భద్రతా ఫీచర్‌లతో నవీకరించబడిన హ్యుందాయ్ ఆరా

    హ్యుందాయ్ ఔరా కోసం tarun ద్వారా జనవరి 24, 2023 03:01 pm ప్రచురించబడింది

    • 71 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    సబ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ؚలో మొదటిసారిగా ఇతర భద్రత అంశాలతో పాటు నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలతో ప్రామాణికంగా వస్తుంది.

    Hyundai Aura Facelift

    • ఆరా ధర రూ.6.30 లక్షల నుండి రూ.8.87 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

    • ముందలి భాగం సరికొత్త లుక్‌తో; పక్క, వెనుక భాగంలో ఎటువంటి మార్పు లేకుండా వస్తుంది. 

    • క్యాబిన్ؚలో కొత్తగా ‘ఆరా’ బ్యాడ్జింగ్ؚతో లేత బూడిద రంగు సీట్ అప్ؚహోల్ؚస్ట్రీని కలిగి ఉంది.

    • ఆటో హెడ్ؚల్యాంప్ؚలు, అనలాగ్ క్లస్టర్, ఫుట్ؚవెల్ లైటింగ్ మరియు ముందు USB సి-టైప్ చార్జర్ వంటి కొత్త ఫీచర్‌లు కలిగి ఉంది. 

    • నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు ఇప్పుడు ప్రామాణికంగా ఉంటూ; ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS కూడా అందించబడుతుంది. 

    • 1.2 లీటర్ పెట్రోల్ మరియు CNG ఎంపికలు కొనసాగాయి.

     

    నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ؚను అనుసరిస్తూ, హ్యుందాయ్ కూడా నవీకరించిన ఆరాని లాంచ్ చేసింది. సరికొత్త ముందు భాగం, మరిన్ని భద్రత ఫీచర్‌లతో ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్ నియోస్ వలే సారూప్యమైన నవీకరణలను పొందింది. ఆరా బుకింగ్ؚ ప్రారంభం అయ్యాయి, ధర రూ.6.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. 

    Hyundai Aura facelift

    వేరియంట్-వారీ ధరలు

    వేరియంట్ؚలు

    పెట్రోల్-MT

    పెట్రోల్-AMT

    సి‌ఎన్‌జి

    E

    రూ. 6.30 లక్షలు

    -

    -

    S

    రూ. 7.15 లక్షలు

    -

    రూ. 8.10 లక్షలు

    SX

    రూ. 7.92 లక్షలు

    రూ. 8.73 లక్షలు

    రూ. 8.87 లక్షలు

    SX (O)

    రూ. 8.58 లక్షలు

    -

    -

     

    మునపటి మోడల్స్‌తో పోలిస్తే, నవీకరించిన వేరియంట్ల ధర రూ.11,000 నుండి రూ.32,000 వరకు అధికంగా ఉన్నాయి.

     

    మరింత కొత్తగా, ప్రీమియంగా కనిపిస్తోంది

    కొత్తగా క్రిందకు అమర్చిన గ్రిల్, తిరిగి డిజైన్ చేసిన బంపర్, కొత్త ఆకారం గల LED DRLలతో నవీకరించ ఆరా వెలుపలి వైపు గమనించగలిగినంత భిన్నంగా కనిపిస్తుంది. డిజైన్ؚకు చేసిన మార్పులు ఇవి మాత్రమే, హెడ్ ల్యాంప్ؚలు, సైడ్ ప్రొఫైల్, రేర్ ప్రొఫైల్ؚకు ఎలాంటి మార్పులు చేయలేదు. 

    లోపలి వైపున అతి తక్కువ మార్పులు

    Hyundai Aura facelift

    క్యాబిన్ؚలో కొత్త లేత బూడిద రంగు సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ, హెడ్‌రెస్ట్‌పై ‘ఆరా’ బ్యాడ్జింగ్ వంటి చెప్పుకోదగిన మార్పులు మాత్రమే చేశారు. నవీకరించబడిన ఆరాలో, మునపటి వేరియంట్ వలె డ్యూయల్-టోన్ ఇంటీరియర్ లేఅవుట్ కూడా కొనసాగించారు.

    ఇది కూడా చదవండి: ఈ 7 ఫీచర్‌లు కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ؚలో ఉన్నాయి కానీ మారుతి స్విఫ్ట్ؚలో లేవు

    కొత్త ఫీచర్‌లు

    ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్ؚలు, ఫుట్ؚవెల్ లైటింగ్, ముందరి USB సి-టైప్ చార్జర్ వంటి ఫీచర్‌లను హ్యుందాయ్ కొత్త ఆరాకు జోడించింది. ఎనిమిది-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, వైర్ؚలెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ AC వంటి అంశాలను కొనసాగించింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚలో కొంత మార్పులు చేశారు, కానీ మునపటి 3.5-అంగుళాల MIDని కొనసాగించారు. 

    ​​​​​​​మరింత సురక్షితమైనది

    భద్రత విషయంలో, ఆరా ఎన్నో నవీకరణలను పొందింది. ఇప్పుడు అన్నీ వేరియంట్లలో నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా మారాయి, టాప్-స్పెక్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు అందుబాటులో ఉన్నాయి. ఈ సెడాన్ؚలో, అధిక భద్రతను అందించే ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

    ​​​​​​​కొత్త రంగు ఎంపిక

    హ్యుందాయ్, ఇప్పుడు అందుబాటులో ఉన్న – పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, తీల్ బ్లూ, ఫైరీ రెడ్ؚకు అదనంగా కొత్త ఆరాలో ‘స్టారీ నైట్’ రంగు ఎంపికను ప్రవేశపెట్టింది. 

    New Hyundai Aura

    నవీకరించబడిన ఇంజన్లు

    ఆరాలో 83PS/113Nm, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగుతుంది, ఇది ఇప్పుడు కొత్త E20 (20% ఎథనాల్ బ్లెండ్) మరియు BS6 ఫేస్ 2-కాంప్లియెంట్. ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు AMT ట్రాన్స్ؚమిషన్ؚల మధ్య ఎంచుకోవచ్చు. మునపటిలాగే, సి‌ఎన్‌జి కూడా అందుబాటులో ఉంది, ఇది 69PSను ఉత్పత్తి చేస్తుంది, మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడింది.

    హ్యుందాయ్, ఆరా డీజిల్ؚ వేరియంట్ను గత సంవత్సరం నుండి నిలిపివేసింది, ప్రస్తుతం, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కూడా నిలిపివేసినట్లు కనిపిస్తోంది. AMT ఎంపిక, టాప్ SX వేరియంట్ కంటే తక్కువ వేరియంట్ కు మాత్రమే పరిమితం చేసింది. 

    ​​​​​​​ప్రత్యర్ధులు

    ఆరా- హోండా అమేజ్, టాటా టిగోర్, మారుతి సుజుకి డిజైర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.

    ఇక్కడ మరింత చదవండి: ఆరా ఆన్-రోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Hyundai ఔరా

    explore మరిన్ని on హ్యుందాయ్ ఔరా

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience