జనవరి నుండి వాహనాల ధరలో రూ.30,000ల పెరుగుదల ఉంటుందని ప్రకటించిన హ్యుందాయ్
డిసెంబర్ 10, 2015 12:50 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి,2016 నుండి వాహనాల ధరలో రూ.30,000 వరకు పెరుగుదల ఉంటుందని ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు హ్యుందాయ్ యొక్క వివిధ మోడల్స్ అయిన ఇయాన్ ( రూ. ౩ లక్షలు సుమారుగా) నుండి స్యాంట ఫే(రూ. 27 లక్షలు సుమారుగా) ధరల శ్రేణిలో ఉంటాయని ప్రకటించింది. వీటితో పాటు ఐ 10, గ్రాండ్ ఐ 10, ఎలీట్ ఐ 20, ఆక్టివ్ ఐ 20, యెక్స్ సెంట్, వెర్నా మరియు ఎలంత్రా మోడల్స్ ల పై కూడా ఉంటుంది. ఇన్-పుట్ వ్యయాలూ పెరిగినపుడు ఇలాంటి పెంపు తప్పదని సౌత్ కొరియన్ కంపెనీ అయిన హ్యుందాయ్ తెలిపింది. అంతేకాకుండా భారతీయ కరెన్సీ క్షీణిస్తూ ఉండడం వలన కూడా ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కంపెనీ అంది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ," ఇటువంటి కఠిన సవాల్ లను ఎదుర్కొంటున్న మార్కెట్ పరిస్థితులు లో, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం, రూపాయి బలహీన పడడం లాంటి ముఖ్యమైన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ పెంపుని చేయడం జరిగింది. ఎలీట్ మరియు క్రెటా మోడల్స్ తో పాటు ఉన్న అన్ని మోడల్స్ ల పై సుమారు రూ.30000 వరకు పెంపు ఉంటుందని, ఇది జనవరి,2016 నుండి అమలవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. " ఇన్-పుట్ వ్యయాలూ పెరగడం వలన ధరలు పెంచడం మాకు అనివార్యంగా మారిందని, ఎందుకంటే ఇటువంటి పోటీకరమైన మార్కెట్ లో నిలవడానికి తప్పనిసరి పరిస్తితులలో పెంచాల్సి వచ్చిందని అన్నారు.
జర్మనీ కంపెనీలు అయిన బిం.ఎమ్.డబ్ల్యు , బెంజ్ లు కూడా ఇంచుమించు ఇదే విధంగా వచ్చే సంవత్సరం నుండి ధరలను పెంచనున్నాయి. అదే దారిలో హ్యుందాయ్ కంపెనీ కూడా వెళ్తోంది. ఇదే కారణాలను చూపిస్తూ టోయోటా కంపెనీ కూడా వచ్చే సంవత్సరం నుండి 3% ధరలను పెంచుతామని ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి:
షారుక్ ఖాన్ హ్యుందాయ్ . 'సేఫ్ మువ్' ప్రచారం లొ పాల్గొనేందుకు ముందుకువచ్చారు :