పనోరమిక్ సన్ؚరూఫ్ ఫీచర్ లేని ఎలివేట్ SUV విడుదల తేదీని నిర్ణయించిన హోండా
హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా మే 17, 2023 11:10 am ప్రచురించబడింది
- 26 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
SUVని పై నుండి చూపించే కొత్త టీజర్, వార్తలలో వెలువడుతుంది.
-
హోండా ఎలివేట్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 6వ తేదీన పరిచయం కానుంది.
-
SUV ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ఇప్పటికే కొన్ని హోండా డీలర్ؚషిప్ؚల వద్ద ప్రారంభమయ్యాయి.
-
ఎలివేట్ SUVలో పనోరమిక్ సన్ؚరూఫ్ లేదు కానీ సింగిల్-పేన్ యూనిట్‌తో వస్తుంది.
-
టీజర్‌లో గమనించదగిన ఇతర వివరాలలో రూఫ్ రెయిల్ మరియు వైట్ బాడీ షేడ్ ఉన్నాయి.
-
హోండా దీన్ని ADAS మరియు సిటీ కంటే పెద్ద టచ్ؚస్క్రీన్ؚతో అందిస్తుందని అంచనా.
-
సిటీ 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ మరియు సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ బలమైన-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚలతో వస్తుందని అంచనా.
-
రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఆగస్ట్ؚలో విడుదల అవుతుందని అంచనా.
ఇటీవల తన కాంపాక్ట్ SUV పేరును “ఎలివేట్”గా ప్రకటించిన తరువాత, హోండా ఇప్పుడు తన కొత్త SUV జూన్ 6 తేదీన ఆవిష్కరించబడుతుంది అని వెల్లడించిన టీజర్ؚని పంచుకుంది. దీని ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అనేక హోండా డీలర్ షిప్ؚలలో ప్రారంభమైనవి.
టీజర్ؚలో వెల్లడైన కొత్త వివరాలు
Witness the #WorldPremiere of the most awaited SUV, the all-new Honda Elevate on June 06, 2023. Mark your calendar for the big unveil!#HondaElevate #NewHondaSUV #AllNewElevate pic.twitter.com/sc8TVGpjgN
— Honda Car India (@HondaCarIndia) May 15, 2023
హోండా ఎలివేట్ SUV కొత్త టీజర్ చిత్రం తెల్లపు రంగు ఫినిషింగ్‌తో ఉన్న SUV టాప్-డౌన్ వ్యూను చూపింది. ఇది పనోరమిక్ సన్҄రూఫ్ؚతో కాకుండా సింగిల్-పేన్ యూనిట్ؚతో వస్తుంది అనేది గమనించవలసిన విషయం. LED DRL ముందు భాగంలో మరియు LED టెయిల్ లైట్ؚలు, రూఫ్ రెయిల్ؚలను కూడా ఈ టీజర్ సంక్షిప్తంగా చూపించింది.
హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి పోటీదారులు పనోరమిక్ సన్ؚరూఫ్ؚను అందిస్తున్నారు, ఈ విషయంలో ఎలివేట్ వెనుకబడింది. రానున్న నవీకరించబడిన కియా సెల్టోస్ కూడా దీన్ని అందిస్తుంది.
ఆశించదగిన ఇతర ఫీచర్‌లు
సన్ؚరూఫ్ కాకుండా, సిటీలో ఉండే 8-అంగుళాల డిస్ప్లే కంటే పెద్ద టచ్ؚస్క్రీన్ యూనిట్, వెంటిలేటెడ్ ముందరి సీట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚ వంటి ఫీచర్‌లతో ఎలివేట్ రావచ్చు.
భద్రత విషయంలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీల కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)లతో హోండా ఈ వాహనాన్ని అందిస్తుంది. ఇది అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్ؚలతో (ADAS) కూడా వస్తుంది, ఇందులో లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా టియాగో EV మొదటి లుక్‌ను పంచుకున్న IPL స్టార్ ఋతురాజ్ గైక్వాడ్
బొనేట్ؚలో ఏమి ఉన్నాయి?
ఎలివేట్ SUV, 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు CVT ఎంపికలతో సిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో (121PS మరియు 145Nm) వస్తుంది. హోండా దీన్ని సిటీ హైబ్రిడ్ 126PS బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚతో అందిస్తుంది అని అంచనా. కొన్ని కొత్త కాంపాక్ట్ SUVలలాగా, ఎలివేట్ؚలో కూడా డీజిల్ ఇంజన్ ఉండదు.
పోటీదారులను పరిశీలిద్దాం
హోండా SUV, క్రిక్కిరిసిన ఈ విభాగంలోని టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, MG ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, కియా సెల్టోస్, వోక్స్ؚవ్యాగన్ టైగూన్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీ పడుతుంది. రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఆగస్ట్ 2023 నాటికి అమ్మకాలకు సిద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నాము.