పనోరమిక్ సన్ؚరూఫ్ ఫీచర్ లేని ఎలివేట్ SUV విడుదల తేదీని నిర్ణయించిన హోండా

హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా మే 17, 2023 11:10 am ప్రచురించబడింది

  • 25 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

SUVని పై నుండి చూపించే కొత్త టీజర్‌, వార్తలలో వెలువడుతుంది. 

Honda Elevate teaser image

  • హోండా ఎలివేట్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 6వ తేదీన పరిచయం కానుంది.

  • SUV ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ఇప్పటికే కొన్ని హోండా డీలర్ؚషిప్ؚల వద్ద ప్రారంభమయ్యాయి.

  • ఎలివేట్ SUVలో పనోరమిక్ సన్ؚరూఫ్ లేదు కానీ సింగిల్-పేన్ యూనిట్‌తో వస్తుంది.

  • టీజర్‌లో గమనించదగిన ఇతర వివరాలలో రూఫ్ రెయిల్ మరియు వైట్ బాడీ షేడ్ ఉన్నాయి.

  • హోండా దీన్ని ADAS మరియు సిటీ కంటే పెద్ద టచ్ؚస్క్రీన్ؚతో అందిస్తుందని అంచనా.

  • సిటీ 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ మరియు సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ బలమైన-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚలతో వస్తుందని అంచనా.

  • రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఆగస్ట్ؚలో విడుదల అవుతుందని అంచనా.

ఇటీవల తన కాంపాక్ట్ SUV పేరును “ఎలివేట్”గా ప్రకటించిన తరువాత, హోండా ఇప్పుడు తన కొత్త SUV జూన్ 6 తేదీన ఆవిష్కరించబడుతుంది అని వెల్లడించిన టీజర్ؚని పంచుకుంది. దీని ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అనేక హోండా డీలర్ షిప్ؚలలో ప్రారంభమైనవి.

టీజర్ؚలో వెల్లడైన కొత్త వివరాలు 

హోండా ఎలివేట్ SUV కొత్త టీజర్ చిత్రం తెల్లపు రంగు ఫినిషింగ్‌తో ఉన్న SUV టాప్-డౌన్ వ్యూను చూపింది. ఇది పనోరమిక్ సన్҄రూఫ్ؚతో కాకుండా సింగిల్-పేన్ యూనిట్ؚతో వస్తుంది అనేది గమనించవలసిన విషయం. LED DRL ముందు భాగంలో మరియు LED టెయిల్ లైట్ؚలు, రూఫ్ రెయిల్ؚలను కూడా ఈ టీజర్ సంక్షిప్తంగా చూపించింది.

హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి పోటీదారులు పనోరమిక్ సన్ؚరూఫ్ؚను అందిస్తున్నారు, ఈ విషయంలో ఎలివేట్ వెనుకబడింది. రానున్న నవీకరించబడిన కియా సెల్టోస్ కూడా దీన్ని అందిస్తుంది.

ఆశించదగిన ఇతర ఫీచర్‌లు

సన్ؚరూఫ్ కాకుండా, సిటీలో ఉండే 8-అంగుళాల డిస్ప్లే కంటే పెద్ద టచ్ؚస్క్రీన్ యూనిట్, వెంటిలేటెడ్ ముందరి సీట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚ వంటి ఫీచర్‌లతో ఎలివేట్ రావచ్చు. 

భద్రత విషయంలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీల కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)లతో హోండా ఈ వాహనాన్ని అందిస్తుంది. ఇది అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్ؚలతో (ADAS) కూడా వస్తుంది, ఇందులో లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా టియాగో EV మొదటి లుక్‌ను పంచుకున్న IPL స్టార్ ఋతురాజ్ గైక్వాడ్

బొనేట్ؚలో ఏమి ఉన్నాయి?

Honda City Hybrid's strong-hybrid powertrain

ఎలివేట్ SUV, 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు CVT ఎంపికలతో సిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో (121PS మరియు 145Nm) వస్తుంది. హోండా దీన్ని సిటీ హైబ్రిడ్ 126PS బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚతో అందిస్తుంది అని అంచనా. కొన్ని కొత్త కాంపాక్ట్ SUVలలాగా, ఎలివేట్ؚలో కూడా డీజిల్ ఇంజన్ ఉండదు. 

పోటీదారులను పరిశీలిద్దాం

Honda Elevate moniker

హోండా SUV, క్రిక్కిరిసిన ఈ విభాగంలోని టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, MG ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, కియా సెల్టోస్, వోక్స్ؚవ్యాగన్ టైగూన్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీ పడుతుంది. రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఆగస్ట్ 2023 నాటికి అమ్మకాలకు సిద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా ఎలివేట్

1 వ్యాఖ్య
1
M
mahantesh shigli
May 26, 2023, 1:40:34 PM

Highly anxious

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience