• English
  • Login / Register

హోండా WR-V వేరియంట్స్ వివరణ

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 కోసం raunak ద్వారా మార్చి 27, 2019 01:49 pm ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Honda WRV

హోండా సంస్థ నిన్న WR-V ని నడిపింది , అంటే మార్చి 16 న, రూ. 7.75 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ) ప్రారంభ ధరను కలిగి ఉంది. WR-V  రూ. 8-10 లక్షల ధరను కలిగి ఉంది, ఇది అనేక వాహనాలను - కాంపాక్ట్ SUVలు మరియు క్రాస్ హాచ్లతో సహా - దాని రాడార్లో ఉంచింది. సబ్- 4m క్రాస్ఓవర్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలను 2017 హోండా సిటీ నుండి తీసుకుంది మరియు దీనిలో అద్భుతమైనది ఏమిటి అంటే విభాగంలో మొదటిసారిగా సన్రూఫ్ ని కలిగి ఉంది. ఇక్కడ హోండా WR-V  ఎటువంటి లక్షణాలను కలిగి ఉంది మరియు ఇది కేవలం బేస్ 'S' మరియు టాప్ వేరియంట్ 'VX' అను రెండు వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.

రంగులు

హోండా WRV ఆరు రంగులలో అందుబాటులో ఉంది. వాటిలో నాలుగు, హోండా జాజ్ నుండి తీసుకోబడినవి. అయితే ఇది ప్రత్యేకమైన కొత్త ప్రీమియం అంబర్ మెటాలిక్ షేడ్ మరియు 2017 హోండా సిటీ యొక్క ' మోడ్రన్ స్టీల్ మెటాలిక్' ని కలిగి ఉన్నాయి.

  •  ప్రీమియం అంబర్ మెటాలిక్
  •  మోడ్రన్ స్టీల్ మెటాలిక్
  •  ఆల్బస్టర్ సిల్వర్ మెటాలిక్
  •  కార్నిలియన్ రెడ్ మెటాలిక్
  •  గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
  •  వైట్ ఆర్చిడ్ పెరల్

Honda WRV

ప్రాధమిక లక్షణాలు

  •  డ్యుయల్ ముందు ఎయిర్ బాగ్స్ మరియు EBD తో ABS
  •  బ్రేక్ ఓవర్రైడ్ వ్యవస్థ (బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ ఏకకాలంలో నొక్కినట్లయితే వేగవంతం చేస్తాయి)
  •  LED డే టైం రన్నింగ్ లైట్స్ మరియు పొజిషనింగ్ లైట్స్
  •  వెనుక డిఫేజర్
  •  హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
  •  టిల్ట్ మరియు టెలీస్కోపిక్ అడ్జస్ట్మెంట్ తో మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్

హోండా WR-V S

ధర: రూ 7.75 లక్షలు (p) / 8.79 లక్షలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

  •  బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్, USB- ఇన్, AUX- ఇన్, ఐపాడ్ మరియు ఐఫోన్ కనెక్టివిటీ, మరియు ట్యూనర్లతో ఆడియో సిస్టమ్ వస్తుంది.
  •  ఈ యూనిట్ నాలుగు-స్పీకర్ సిస్టమ్ తో జత చేయబడుతుంది
  •  మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్
  •  నలుపు మరియు నీలం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ
  •  LCD మల్టీ-ఇంఫర్మేషన్ డ్రైవర్ డిస్ప్లేతో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

హోండా WR-V VX

ధర: రూ. 8.99 లక్షలు (P) / రూ. 9.99 లక్షలు(D) (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)

S ట్రిమ్ లక్షణాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా, VX ఈ అదనపు లక్షణాలను అందిస్తుంది.

Honda WRV

  •  ఫాగ్ ల్యాంప్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వాష్ మరియు వైపర్, మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్స్
  • సైడ్ బ్లింకర్స్ తో ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ORVMs
  •  వన్ టచ్ ఓపెన్ మరియు క్లోజ్ సన్రూఫ్
  •  హోండా కార్ ఇండియా యొక్క తాజా 7.0-అంగుళాల కెపాసిటివ్ టచ్-ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (2017 హోండా సిటీతో పరిచయం చేయబడింది) తో వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత వ్యవస్థ ప్రత్యక్ష ట్రాఫిక్ అప్డేట్ ,ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇ-మెయిల్స్ మరియు నావిగేషన్ కోసం WiFi రిసెప్షన్ తో వస్తుంది. ఈ యూనిట్ 1.5 గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజ్, యూనిట్ లేదా స్టీరింగ్-మౌంట్ బటన్లు ద్వారా వాయిస్ రికగ్నైజేషన్ మరియు రెండు USB- స్లాట్లు, రెండు మైక్రో SD కార్డ్ స్లాట్లు మరియు ఒక HDMI స్లాట్ వంటి కనెక్టివిటీ ఎంపికలను కూడా అందిస్తుంది. మిర్రర్లింక్ స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ కారు డిస్ప్లే ద్వారా సెలెక్ట్ యాప్ యూసేజ్ ని కూడా అందిస్తుంది.
  •  ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆరు-స్పీకర్ సిస్టమ్ తో (నాలుగు-స్పీకర్లు మరియు రెండు-ట్వీటర్స్)జత చేయబడుతుంది.
  •  గైడ్ లైన్స్ తో మల్టీ-వ్యూ రేర్ వ్యూ కెమెరాని అందిస్తుంది
  •  గ్లోసీ సిల్వర్ డోర్ హ్యాండిల్స్,పియానో ఫినిష్ సెంట్రల్ పానెల్ మరియు సిల్వర్ డాష్బోర్డ్ అప్లిక్ వంటి సూక్ష్మమైన సౌందర్య మెరుగుదలలు అందిస్తుంది
  •  ప్రీమియం స్టిచ్చింగ్ తో బ్లాక్ మరియు సిల్వర్ అపోలిస్టరీ
  •  ఒక పవర్ అవుట్లెట్ ఉన్న సెంట్రల్ ఆర్మ్ తో వస్తుంది
  •  ఒక టచ్ ప్యానెల్ తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ని పొందుతుంది
  •  రెండు డీజిల్ ప్రత్యేఖమైన ఫీచర్లు ఉన్నాయి - పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ

​​​​​​​Honda WRV

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda డబ్ల్యుఆర్-వి 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience