Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా డబ్ల్యూఆర్- వి ఎక్స్క్లూజివ్ ఎడిషన్ రూ. 9.35 లక్షల ధర వద్ద విడుదల

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 కోసం sonny ద్వారా మార్చి 28, 2019 01:02 pm ప్రచురించబడింది

  • డబ్ల్యూఆర్- వి ఎక్స్క్లూజివ్ ఎడిషన్, విఎక్స్ వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది; అదనంగా రూ 18,000 ను చెల్లించాల్సి ఉంటుంది.

  • వీటిలో- కొత్త బాడీ గ్రాఫిక్స్, బ్లాక్ సీటు కవర్లు మరియు నలుపు టైల్ గేట్ స్పాయిలర్ అందించబడ్డాయి.

  • విఎక్స్ వేరియంట్ అనేది ఆటో ఏసి, వెనుక కెమెరా మరియు సన్రూఫ్ వంటి లక్షణాలతో ఉన్న డబ్ల్యూఆర్- వి యొక్క అగ్ర శ్రేణి వేరియంట్.

డబ్ల్యూఆర్- వి యొక్క మరొక ప్రత్యేక ఎడిషన్ను హోండా ప్రవేశపెట్టింది, ఇది అదనపు వ్యయం తో అనేక సౌందర్య మార్పులతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ డబ్ల్యూఆర్- వి యొక్క కొత్త ఎక్స్క్లూజివ్ ఎడిషన్ ధర రూ. 9.35 లక్షలు (పెట్రోల్), రూ. 10.48 లక్షలు (డీజిల్) ధరతో అందుబాటులో ఉంది. దీని ధర అగ్ర శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ కు రూ .18,000 రూపాయలతో దగ్గరగా ఉంటుంది.

డబ్ల్యూఆర్ -వి ఎక్స్క్లూజివ్ ఎడిషన్ అనేక అద్భుతమైన అంశాలతో అందించబడుతుంది. అవి ఏమిటో చూద్దాం, అవి వరుసగా- ఎల్ఈడి స్టాప్- లైట్ తో కూడిన ఒక బ్లాక్ టైల్ గేట్ స్పాయిలర్, బ్లాక్ సీటు కవర్లు, సైడ్ సిల్ ఇల్యూమినేషన్ గార్నిష్, బాడీ గ్రాఫిక్స్ మరియు ఒక 'ఎక్స్క్లూజివ్ ఎడిషన్' చిహ్నంతో ఈ కారు అందించబడుతుంది. డబ్ల్యూఆర్ -వి ఎక్స్క్లూజివ్ ఎడిషన్ రెండు రంగులు మాత్రమే అందుబాటులో ఉంది: అవి వరుసగా రేడియంట్ రెడ్ మెటాలిక్ మరియు ఆర్చిడ్ వైట్ పెర్ల్. హోండా బాడీ కలర్ టైల్ గేట్ స్పాయిలర్ మరియు సీటు కవర్లను ప్రత్యేకంగా డబ్ల్యూఆర్ -వి కోసం ఉపకరణాల జాబితాను అందిస్తుంది. మీరు ఈ రెండు చేర్పుల వలన మాత్రమే ప్రత్యేకమైన ఎడిషన్ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు- రెగ్యులర్ మోడల్ ను కొనుగోలు చేసిన తరువాత కూడా అదనపు వ్యయంతో ఈ ఉపకరణాలను పొందవచ్చు. ఆ విధంగా, మీరు మీకు కావలసిన బాహ్య రంగులో డబ్ల్యూఆర్ -వి ను కొనుగోలు చేయగలుగుతారు.

డబ్ల్యూఆర్- వి ఎక్స్క్లూజిషన్ ఎడిషన్, అగ్ర శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ లో ఉండే అవే లక్షణాల జాబితాను పొందుతుంది. దీనిలో పవర్డ్ సన్రూఫ్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, అల్లాయ్ వీల్స్, మిర్రర్లింక్, ఆటో ఎసి మరియు రేర్ పోర్టు కెమెరాతో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ లు ఉన్నాయి. డబ్ల్యూఆర్- వి రెండు రకాల ఇంజన్ ఎంపికలతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది, అవి వరుసగా- 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇవి రెండూ కూడా 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఇప్పటి వరకు దీనిలో ఏ రకమైన ఆటోమేటిక్ వేరియంట్ లేదు.

హోండా, డబ్ల్యూఆర్- వి అలైవ్ ఎడిషన్ అని పిలిచే క్రాస్ ఓవర్ యొక్క మరొక ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ ను కూడా అందిస్తుంది. ఈ రకాన్ని ఎస్ వేరియంట్ ఆధారంగా నిర్మించారు, కాని అల్లాయ్ చక్రాలు, వెనుక పార్కింగ్ సెన్సార్స్, అలైవ్ లోగో తో కూడిన బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ మరియు వెనుక కెమెరా ప్రదర్శన తో కూడిన ఐవిఆర్ఎమ్ వంటి అదనపు ఫీచర్లను అమర్చారు. అలైవ్ ఎడిషన్ ధర 8.08 లక్షలు (పెట్రోల్), రూ. 9.16 లక్షలు (డీజిల్) ధరలతో అందుబాటులో ఉంది.

డబ్ల్యూఆర్- వి వాహనం, ఫోర్డ్ ఫ్రీస్టైల్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు త్వరలోనే ప్రారంభించనున్న మహీంద్రా ఎక్స్యూవి 300 వంటి ఇతర ఉప -4 మీటర్ల క్రాస్ఓవర్లకు మరియు ఎస్యువి లకు గట్టి పోటీ ను ఇస్తుంది. డబ్ల్యూఆర్- వి ధర - రూ .7.84 లక్షలు (ఎక్స్-షోరూం ఢిల్లీ) ధరతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

మరింత చదవండి: హోండా డబ్ల్యూఆర్- వి డీజిల్.

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 18 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా WRV 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర