• English
  • Login / Register

10 వ తరం సివిక్ సెడాన్ ని బహిర్గతం చేసిన హోండా

హోండా సివిక్ కోసం raunak ద్వారా సెప్టెంబర్ 18, 2015 03:17 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఐ-విటెక్ మోటార్ ద్వారా ఆధారితం ఉంటుంది!

జైపూర్: హోండా ఉత్తర అమెరికాలో 10 వ తరం సివిక్ యొక్క తెర దించారు. ఈ వాహనం యుఎస్ నిర్దేశాలు కలిగినటువంటి ట్రిమ్. ఈ 2016 సెడాన్ కొత్త బ్రాండ్ ప్లాట్ఫార్మ్ మీద సవారీలు చేస్తుంది. ఇది ఒక ఫాస్ట్ బ్యాక్ డిజైన్ తో మరియు కూపే, ఎస్ఐ నమూనాలు, 5-డోర్ల హాచ్బాక్ మరియు యుఎస్- మార్కెట్ చరిత్రలో మొట్టమొదటి సివిక్ టైప్- ఆర్ మోడల్ వంటి వివిధ శరీర రకాలలో అందుబాటులో ఉంటుది. ఈ వాహనం ఈ సంవత్సరం తర్వాత అమ్మకానికి వెళ్తుంది. దీని భారతీయ ప్రారంభం గురించి మాట్లాడుకుంటే, హోండా దేశంలో ఇప్పటికీ సివిక్ సెడాన్ ని తిరిగి ప్రారంభించేందుకు చూస్తుంది. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో 9 వ తరం సివిక్ రాజస్థాన్ తపుకరా ప్లాంట్ లో రహస్యంగా కనిపించింది. 9 వ తరం బాగా క్లిక్ అయితే 10వ తరం సివిక్ సెడాన్ ని తీసుకువచ్చేందుకు హోండా సంస్థ సిద్ధంగా ఉంది.

ఇంజిన్ నుండి ప్రారంభిస్తే, ఇది డైరెక్ట్ ఇంజెక్టెడ్ మరియు టర్బో చార్జెడ్ ఇన్ లైన్ -4 1.5 లీటర్ ఐ-వి టెక్ మోటార్ తో పాటూ 2.0-లీటర్, 16-వాల్వ్ డిఒహెచ్ సి ఐ-వి టెక్ 4-సిలిండర్ మోటార్ తో శక్తినివ్వబడుతుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ బాక్స్ లేదా నిరంతరం మారే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్(సివిటి) ద్వారా జతచేయబడి ఉంటుంది. 1.5-లీటర్ ఐ-విటెక్ ఏకైక 'సివిటి 'లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిజైన్ పరంగా, 2015 సివిక్ సెడాన్ కొత్త ఫాస్ట్ బ్యాక్ వెనుక ప్రొఫైల్ తో మునుపటి తరం సెడాన్ కంటే ఎక్కువ వ్యక్తిత్వం పొందుతుంది. అవుట్గోయింగ్ మోడల్ పోలిస్తే ఈ వాహనం 1.2 అంగుళాల పొడవాటి వీల్బేస్ తో దాదాపు 2 అంగుళాలు విస్తృతంగా మరియు 1 అంగుళం తక్కువగా ఉంటుందని హోండా సంస్థ తెలిపింది. వెనుకభాగం పక్కన పెడితే, దీని ముందర భాగం స్పోర్టీ లుక్ తో మరియు సొగసైన్ హుడ్ తో ఉంటుంది. అంతేకాక, ఇది 'సి' ఆకారంలో గల టెయిల్ ల్యాంప్స్ తో పాటుగా పగటి పూట నడిచే ఎల్ఇడి తో ఎల్ఇడి హెడ్లైట్లను కలిగి ఉంటుంది. దీని అంతర్భాగాలు 7- అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థతో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది.

చాసిస్ గురించి మాట్లాడుకుంటే, అల్ట్రా-అధిక బలం స్టీల్ ఉపయోగించి 25 శాతం వరకూ టార్షన్ రిజిడిటీ ని అభివృద్ధి చేయబడినది . ఈ వాహనం సుమారు 30కిలోలు తేలికైనది మరియు కొత్త శరీరం సీలింగ్ సాంకేతికతలతో 58 శాతం క్యాబిన్ లో గాలి లీక్ అవ్వడాన్ని తగ్గిస్తుందని సంస్థ తెలిపింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda సివిక్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience