• English
  • Login / Register

రూ 10,000 వరకు ధరల పెంపును ప్రకటించిన హోండా

జనవరి 12, 2016 03:07 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గత నెల ప్రకటించిన ధరల పెంపును హోండా ఇప్పుడు అమలు చేస్తుంది. వీటితో పాటు, టయోటా, స్కోడా, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా ధరల పెంపును జనవరి 5 వ తేదీ నుండి ఒక వారం లోపల అమలు చేస్తాయి. ఇప్పుడు హోండా వాహనాల ధరలు రూ 10,000 వరకు పెరిగాయి.

ప్రవేశ స్థాయి హాచ్బాక్ అయిన బ్రియో వాహనం విషయానికి వస్తే, వేరియంట్లు ఆధారంగా రూ 4.27 లక్షల నుండి 6.85 లక్షల మధ్యలో దాదాపు రూ 2,000 తగ్గి రాబోతున్నాయి. అదే అమేజ్ మరియు కారు తయారీదారుని యొక్క ప్రీమియం హాచ్బాక్ అయిన జాజ్ వంటి వాహనాల విషయానికి వస్తే, దాద్దపు రూ 3,000 నుండి 4,800 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యధిక ధర పెంపు సి ఆర్ వి వాహనానికి మాత్రమే. దీని యొక్క ధర రూ 10,000 వరకు పెరిగే అవకాశం ఉంది అప్పుడు దీని యొక్క ధర సుమారు 25.20 లక్షలు ఉండవచ్చు. మరోవైపు హోండా సిటీ మరియు మొబిలియో వాహనాలు వరుసగా, ప్రతి దానికి రూ 3,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.


ఇటీవల, స్కోడా మరియు టయోటా కార్ల మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. స్కోడా విషయానికి వస్తే, ఎక్కువగా ధరను పెంచిన వాహనం ఆక్టావియా, దీని ధర సుమారు రూ 33,000. మరోవైపు కామ్రీ యొక్క ధర సుమారు రూ 31,500 వరకు పెంచనుంది. కంపెనీలు, చాలా ఇతర మోడళ్లకు కూడా ధరలను పెంచింది, కానీ వాటి ధరలను గనుక పోల్చి చూస్తే నిరాడంబరంగా ఉన్నాయి

ధర పెంపు సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో మారుతుంది మరియు గత మూడు సంవత్సరాల నుండి ఇదే విధంగా జరుగుతున్నది. మారుతి సుజుకి, హ్యుందాయ్, బిఎండబ్ల్యూ మరియు నిస్సాన్ వంటి కంపెనీలు కూడా జనవరి 1, 2016 నుండి ధరల పెంపును ప్రకటించారు కానీ, ధర పెంపు ఇంకా అమలు చేయలేదు. అయితే హ్యుందాయ్ సంస్థ, వాటి వాహనాల ధర పెంపును సుమారు రూ 30,000 వరకు ప్రకటించింది. అదే బిఎండబ్ల్యూ, రెనాల్ట్ మరియు నిస్సాన్ వంటి వాహన తయారీదారులు వారి వాహనాలకు 3% పెంపును ప్రకటించారు.

పైన పేర్కొన్న అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలే.

ఇది కూడా చదవండి:

టయోటా, స్కోడా, మరియు టాటా మోటార్స్ సంస్థలు వాహనాల ధరలని పెంచబోతున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience