జాజ్ ను రూ.5.30 లక్షల వద్ద ప్రారంబించిన హోండా (ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి)

హోండా జాజ్ 2014-2020 కోసం akshit ద్వారా జూలై 08, 2015 03:05 pm సవరించబడింది

ఢిల్లీ:

చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హోండా ఇండియా, జాజ్ తో నేడు ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో తిరిగి ప్రవేశించింది. కంపెనీ ద్వారా మొట్టమొదటిసారిగా విడుదల అవుతున్న ఈ హాచ్బాక్ ను రూ 5.30 లక్షల ప్రారంభ ధర వద్ద ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, ఈ జాజ్, హ్యందాయ్ ఎలైట్ ఐ20, వోక్స్వాగన్ పోలో వంటి వాహనాలతో గట్టి పోటీను ఇవ్వడానికి ఇటీవల విడుదల అయ్యింది.

ఈ జాజ్ అందమైన లుక్ తో మరియు అనేక అంశాలతో వచ్చింది. అంతేకాకుండా, ఈ వాహనం ముందరి భాగానికి వస్తే బోల్డ్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ తో పాటు సిటీ ను పోలి ఉండే షార్ప్ హెడ్ల్యాంప్స్ తో ఇటీవల మన ముందుకు వచ్చింది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే,ముందుగా మోడల్ దాదాపు ఒకేలా కనిపిస్తుంది. అధనంగా, ఫ్రంట్ డోర్ నుండి వెనుక డోర్ వరకు ఒక పెద్ద షోల్డర్ లైన్ ను కలిగి ఉంటుంది. అయితే, వెనుక భాగంలో క్రోం తో కూడిన ఎల్ఇడి లైట్స్ దీనిలో పొందుపరిచారు. దీని వలన వాహనానికి మరింత అందాన్ని చేకూర్చుతుంది.

ఈ వాహనం యొక్క అంతర్గత భాగాల విషయానికి వస్తే, బ్లాక్ మరియు బేజ్ కలర్ తో మద్య శ్రేణి వేరియంట్ మరియు అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో అందుబాటులో ఉంది. దీని యొక్క డాష్బోర్డ్, సిటీను పోలి ఉంటుంది. అంటే, 6.2 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ను కలిగి ఉంటుంది.

ఈ కొత్త జాజ్, ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ లను కలిగి ఉంది. అవి వరుసగా, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్. అయితే, ఈ వాహానల పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 90 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 110 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ మైలేజ్ గురించి చెప్పాలంటే, ఈ వాహనాలు మాన్యువల్ మోడ్ లో 18.7 kmpl మైలేజ్ ను అందిస్తాయి. అదే విధంగా, సివిటి మోడ్ లో 19 kmpl మైలేజ్ ను ఇస్తాయి. మరోవైపు, 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్, అమేజ్ మరియు సిటీ వాహనాల వలే అత్యధికంగా 100 PS పవర్ ను మరియు 200 Nm పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఏఆర్ ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం ఈ జాజ్ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 27.3 kmpl మైలేజ్ ను అందిస్తుంది. భారతదేశం లో ఇంత ఎక్కువ మైలేజ్ ను అందించే రెండవ వాహనం ఇటీవల విడుదల అయిన మారుతి సుజుకి సెలిరియో డీజిల్ వాహనం.

హోండా జాజ్ యొక్క మొదటి డ్రైవ్ వీడియో ను వీక్షించండి.

ప్రయోగ ప్రత్యక్ష ప్రసారం చూడండి:

లైవ్ అప్డేట్స్

జాజ్, 354 లీటర్లు కలిగిన మంచి బూట్ స్పేస్ అందిస్తుంది.

కంపెనీ 2016 నాటికి 300 డీలర్షిప్ తెరవాలన్నది వారి ముఖ్య లక్ష్యం.

ఈ హాచ్బాక్ 9 కప్ హోల్డర్స్ లను కలిగి ఉంది.

ఈ సంస్థ యొక్క రాజస్థాన్ ప్లాంట్ లో ఈణృ 380 కోట్లు పెట్టుబడి పెట్టింది

పాత జాజ్ తో పోలిస్తే, ఈ కొత్త జాజ్ వాహనం 13 mm వీల్బేస్ ఎక్కువ మరియు పాత జాజ్ కంటే ఎక్కువ లెగ్రూం ను కూడా కలిగి ఉంది.

ఈ కొత్త జాజ్ యొక్క 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 27.3 kmpl మైలేజ్ ను ఇస్తుంది. అంతేకాకుండా, ఇది భారతదేశం లోనే అత్యధికంగా మైలేజ్ ను ఇచ్చే వాహనం.

పెట్రోల్ మాన్యువల్ 18.7 kmpl మైలేజ్ ను ఇవ్వగా, వీటి సివిటి వేరియంట్ 19 కంప్ల్ మైలేజ్ ను అందిస్తాయి.

బాహ్య ప్రొఫైల్ విషయానికి వస్తే, ఎల్ ఇ డి టైల్ ల్యాంప్స్, రేర్ స్పాయిలర్, స్పోర్టి లుక్ కలిగిన 15 అంగుళాల అలాయ్ వీల్స్ ను గమనించవచ్చు.

ఈ హాచ్బాక్ లో 30 కంటే ఎక్కువ ఉపకరణాలను చూడవచ్చు.

ఈ జాజ్ యొక్క డీజిల్ వేరియంట్ లలో ఏబిఎస్ మరియు ఈబిడి లు ప్రామాణికంగా అందించబడతాయి.

సివిటి వేరియంట్, పెడల్ షిఫ్టర్స్ తో 19 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

ఈ కొత్త జాజ్ లో, 5 డీజిల్ వేరియంట్ లు మరియు 7 పెట్రోల్ వేరియంట్లు (5 మాన్యువల్ మరియు 2 సివిటి)

హోండా, జాజ్ ను రూ 5.30 లక్షల ఎక్స్-షోరూమ్, ఢిల్లీ వద్ద ప్రవేశపెట్టింది.

పూర్తి ధర జాబితా

Honda Jazz Price (EX-Showroom, Delhi) (INR)
Petrol  Diesel
E:530,900 E:649,900
S:594,000 S:714,000
SV:644,900 SV:764,900
V:679,900 V:809,900
VX:729,000 VX:859,000
S CVT:699,000  
V CVT:785,000  
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా జాజ్ 2014-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience