• English
  • Login / Register

రేపే విడుదల కు సిద్ధంగా ఉన్న హోండా జాజ్

హోండా జాజ్ 2014-2020 కోసం sourabh ద్వారా జూలై 07, 2015 01:09 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చివరిగా, ఆరోజు రానే వచ్చింది. ఇంతకి దేని గురించా అనుకుంటున్నారు కదా! ఏమి కాదండోయ్ హోండా సంస్థ వారు ఒక ప్రీమియం హ్యాచ్బాక్ అయిన జాజ్ వాహనాన్ని రేపే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపే అంటే జూలై 8 వ తారీకు. డీలర్స్, రూ 21,000 ముందస్తు చెల్లింపు వద్ద ముందుగానే బుకింగ్ తీసుకోవడం మొదలు పెట్టారు మరియు మీడియా నివేదికలు ఈ విధంగా చెబుతున్నాయి. నమ్మసక్యంగా లేని విషయం ఏమిటంటే, కంపెనీ ఇప్పటికే జాజ్ వాహనాలను 2,336 యూనిట్లను బుక్ చేసింది. గత కారులో ఉండే తప్పులను దృష్ట్టి లో పెట్టుకొని ఈ కారును విడుదల చేస్తున్నారు. ఈ సంస్థ యొక్క తయారీదారుడు, ఈ వాహనానికి 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ తో పాటుగా 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ లను అందించాడు. 

ఈ వాహనం యొక్క బాహ్య భాగాలను చూసినట్లైతే, ఈ జాజ్ యొక్క ముందరి భాగం, హోండా సిటీ ను పోలి పెద్దగా రాబోతుంది. అంతేకాకుండా, చిన్న చిన్న మార్పులతో రాబోతుంది. ఈ మందపాటి నల్లటి గ్రిల్ అందంగా ఒక క్రోమ్ లైనింగ్ ద్వారా అలంకరించి ఉంది. మరింత అందంగా ఉండటం కోసం హెడ్ల్యాంప్స్ మరియు హనీకోంబ్ నమూనా తో పాటు లోయర్ ఎయిర్ డాం లను కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, సిటీ ను పోలి రాబోతుంది. వెనుక భాగం విషయానికి వస్తే, ఎల్ ఇ డి టైల్ ల్యాంప్ క్లస్టర్ మరియు సి- పిల్లర్ మరియు విండ్షీల్డ్ మధ్య రిఫ్లెక్టయ్యే అంశాలతో రాబోతుంది. 

జాజ్ యొక్క అంతర్గత బాగాలను కనుక చూసినటైతే, ఒక్ ఖరీధైన లుక్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో వెండి చేరికలతో అలంకరించబడిన ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అందించబడతాయి. అంతేకాకుండా, హోండా సిటీ నుండి తీసుకోబడిన 15.7 టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఉపగ్రహ ఆధారిత స్వరంతో దిశానిర్దేశ టర్న్ బై టర్న్ తో నావిగేషన్ వ్యవస్థ తో పాటు బ్లూటూత్ మరియు ఆడియో స్టీమింగ్, డివిడి / సిడి ప్లే బేక్ వంటి వాటితో రాబోతుంది. అంతేకాక, ఈ వాహనానికి మేజిక్ సీట్లు కూడా అందించబడతాయి. దీనితో పాటు, సిటీ నుండి తీసుకోబడిన టచ్ ప్యానల్ నియంత్రణ తో కూడిన ఆటోమేటిక్ ఏసి కూడా అందించబడుతుంది.

హుడ్ క్రింది బాగానికి వస్తే, ఈ హాచ్బాక్ 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 100 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 200 Nmగల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ హాచ్బాక్ 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 90 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 110 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ సివిటి ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. 

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience