హోండా జాజ్ మరియూ తరువాతి తరం ఆడీ ఏ4 కి 5 స్టార్ యూరో ఎన్‌సీఏపీ రేటింగ్ లభించింది
హోండా జాజ్ 2014-2020 కోసం raunak ద్వారా నవంబర్ 05, 2015 01:17 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఐదవ తరం ఆడీ ఏ4 ఇండియాకి వచ్చే ఏడాది భారతదేశానికి రానుంది, హోండా వారు మూడవ తరం జాజ్ ని దేశంలో తాజాగా విడుదల చేసింది!
జైపూర్: యూరో ఎన్‌సీఏపీ, యురోపియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం - కారు రక్షణ ప్రదర్శన ప్రోగ్రాం బ్రసెల్స్ ఆధారితంగా జరిగిన పరీక్ష ఫలితాలను తెలిపింది. నాలుగు కార్లలో, హోండా జాజ్ మరియూ ఆడీ ఏ4 భారతదేశంలో అందుబాటులో ఉన్న కార్లు. వీటికి ఈ పరీక్షలో 5-స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది.
హోండా వారు భారతదేశపు జాజ్ కి ప్రామాణిక ఎయిర్-బ్యాగ్స్ అందించకపోయినా, పరీక్ష చేయబడిన కారుకి ప్రామాణిక మల్టిపల్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటుగా ఇతర రక్షణ పరికరాలు యురోపియన్ లా ప్రకారం అందించబడి ఉంది. జాజ్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కి గాను 93% పైగా మార్కులు సాధిస్తే, చైల్ద్ ప్రొటెక్షన్ కి గాను 85% మార్కులు సాధించింది. పెడెస్ట్రియన్ సేఫ్టీ మరియూ సేఫ్టీ అసిస్టన్స్ విభాగాలలో జాజ్ 73% ఇంకా 71% అందుకుంది.
ఆడీ ఇండియా వారు ఐదవ తరం సెడాన్ ని రాబోయే 2016 ఆటో ఇండియా ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నరు. ఈ జర్మన్ తయారీదారి కొత్త ఏ4 ని కూడా భారతదేశంలో పరీక్షిస్తూ కంటపడ్డారు. ఫలితాల గురించి మాట్లాడుతూ, ఐదవ తరం ఏ4 90% మొత్తం మీద మార్కులు సాధించింది మరియూ చైల్డ్ ప్రొటెక్షన్ కై 87% మార్కులు పొందింది. పెడెస్ట్రియన్ రక్షణ మరియూ సేఫ్టీ అసిస్టన్స్ సిస్టంస్ విభాగంలో ఏ4 75% మార్కులను సాధించింది.