హోండా జాజ్ ను ప్రబలం చేసే 5 విషయాలు:

హోండా జాజ్ 2014-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 02, 2015 12:53 pm సవరించబడింది

జైపూర్:

రాబోయే హోండా జాజ్, ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో జూలై 8 న ఒక కొత్త బెంచ్ మార్కు ను సృష్ట్టించడానికి విడుదల కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ఎలైట్ ఐ20 తో గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది. ఈ హోండా జాజ్ అనేక లక్షణాలతో రాబోతుంది. అంతేకాకుండా, ఇక్క దాని పోటీధారులను బయపెట్టేందుకు అందరూ అంగీకరించే 5 అంశాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి.

మొత్తం ఇలా!

ఈ వాహనం, ఒక ప్రత్యేకమైన రూపంతో రాబోతుంది. అంతేకాకుండా, ఈ కొత్త హోండా జాజ్ అనేక లక్షణాలతో రాబోతుంది. తయారీదారుడు ఈ వాహనంలో మ్యాజిక్ సీట్లను పొందుపరిచాడు. అంతేకాకుండా, ఫ్లిప్ మరియు అన్ ఫ్లిప్ లను అనుమతిచ్చేందుకు వివిధ సెట్టింగులతో పొందుపరిచారు. ఈ వాహనం లో సీట్లను మడవటం వలన సైకిళ్ళ దగ్గర నుండి ఇంటి కోసం అన్ని రకాల వస్తువులను పెట్టగలిగే స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ హాచ్బాక్ లో దాదాపు ప్రతీది సరిపోయే లా అనుమతిస్తుంది. అంతేకాక, ఈ జాజ్ రిక్లైన్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. వెనుక ప్రయాణికుల కొరకు ముందు సీట్లు కాల్ఫ్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. ముందు సీటు పూర్తిగా తీసినప్పుడు హెడ్రెస్ట్ తొలగించబడుతుంది.  

శక్తివంతమైన అంతర్గత భాగాలు

చాలా కాలం నుండి ఎలైట్ ఐ 20 ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్బ్యాక్ వర్గం లో జాజ్ తో పోల్చి చూస్తే  ఏకైక రేంజ్ ఉన్న వాహనంగా నిలిచింది. మరియు దీని లోపలి భాగాల విషయానికి వచ్చినప్పుడు,  అద్భుతమైన జాజ్ తో పోలిస్తే  కొద్దిగా సింపుల్ గా  ఎవరైనా మెచ్చే విధంగా ఉంది. హోండా 'హెచ్' డిజైన్  ఫిలాసఫీ ,అధిక నాణ్యత మరియు సాంకేతిక పరిఙ్ఞానం తో లోపలి వైపు అద్భుతంగా రూపొందించారు. దీని క్యాబిన్ లోపలి ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్  లో 3 మీటర్లతో డ్రైవర్ కి అందుబాటులో ఉంది. టచ్ నియంత్రిత కేంద్ర కన్సోల్ తో ఉన్న సొగసైన  ఏసి వెంట్లను ఊహించలేననత అద్భుతంగా మనకు అందించబోతుంది. వీటితో పాటు, హోండా మనకు అనుకూలమైన రీతిలో ఒకటి నలుపు మరియు లేత గోధుమరంగు కాంబో వంటి రెండు లోపలి  వైపు కలర్ ఎంపికలతో వస్తుంది, బ్లాక్  కలర్ ఉత్సాహికులకు  ఇది అత్యంత ప్రీతిపదంగా కనబడుతుంది.

పిల్లి జాతి- గర్వపడే వైఖరి!

గతంలో, జాజ్ యొక్క డిజైనర్లు, కారు ప్రక్క వైపు ప్రొఫైల్ లో ఒక పిల్లి ఆకారాన్ని సమతుల్యంగా విలీనం చేశారు. అదే డిజైన్ ని పునాది రాయిగా తీసుకుని హోండా యొక్క సరికొత్త 'హెచ్' డిజైన్ రూపొందించబడింది. ఇదంతా ఒక దుముకుతున్న పిల్లి నుండి ప్రేరణ పొంది చేశారు. ఎత్తైన ముందరి పై భాగం పిల్లి తలను సూచించగా, వాలుగా ఉండే వెనుక భాగం పిల్లికూన యొక్క కదిలే వెనుకభాగాన్ని సూచిస్తుంది. విస్తృతంగా హోండా 'హెచ్' డిజైన్ నిజానికి ఎన్నో దేశాలలో ప్రస్తుత తరం జాజ్, అకా ఫిట్ వంటి వాటితో ఉద్భవించింది. ఈ అందమైన పిల్లి జాతి- అత్యుత్తమ వైఖరి , అద్భుతమైన హెడ్ల్యాంప్స్, ఎల్ ఇ డి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, సొగసైన షోల్డర్స్ ఇవన్నీ కుడా వాహనాన్ని ఆకర్షణీయంగా కనిపించించేలా చేస్తున్నాయని చెప్పనవసరం లేదు.

27.30 కె ఎం పిఎల్!

ఆ సంఖ్య అద్భుతమైనదా! అవును ఇది నిజంగా అద్భుతమైనదే. ఎందుకంటే సెలెరియో డీజిల్ ఇంజన్ మాత్రమే దీని కంటే మెరుగైన సామర్థ్యం ఇవ్వగలదు. ఎంత? ఒక సాధారణ 0.32 కె ఎంపిఎల్. అయితే సెలేరియో 2-సిలిండర్ మోటార్, జాజ్ కంటే తక్కువ 700 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ సంస్థ తయారీధారుడు, ఈ జాజ్ ను అందమైన రీతిలో రూపొందించాడు. ఈ వాహనం యొక్క ఇంజన్ 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 100 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 200 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  

పెడల్ షిఫ్టర్!

చూడండి. మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, 1.2 లీటర్ ఐ-వి టెక్ ఇంజిన్ ఇప్పుడు పెడల్ షిఫ్టర్ కలిగియున్న ఆటోమేటిక్ సి విటి తో అమర్చబడింది. ఇంకా బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ అందరికీ తెలిసినదే కానీ ఇది ఇప్పుడు ఎగువ శ్రేణి వేరియంట్లలో షిప్టర్స్ తో అందుబాటులో ఉంది. ఇది ఉత్తమమైన వాహనం మాత్రమే కాకుండా ఉత్తమమైన అమ్మకాలని కుడా అందించడానికి రాబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా జాజ్ 2014-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience