ఎలివేట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించిన హోండా, సెప్టెంబర్ؚలో ధరల ప్రకటన
హోండా ఎలివేట్ బుకింగ్ؚలు ప్రారంభం అయ్యాయి మరియు విడుదల సమయానికి కొన్ని నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు
-
గ్లోబల్ మోడల్ؚగా, హోండా ఎలివేట్ 90 శాతం ఉత్పత్తి స్థానికంగా ఉంటుంది.
-
హోండా సిటీలో ఉన్నట్లు గానే 1.5-లీటర్ 121 PS పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది.
-
లోపల 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ కలిగి ఉంటుంది, ఇది వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలకు మద్దతు ఇస్తుంది.
-
దీని భద్రత కిట్‌లో పూర్తి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌లు కూడా ఉంటాయి.
-
ఆగస్ట్ నెల రెండవ వారం నుండి మీ సమీప హోండా డీలర్ؚషిప్ వద్ద అందుబాటులో ఉంటుంది.
-
హోండా ఎలివేట్ ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది అని అంచనా.
హోండా ఎలివేట్ భారతదేశంలో అమ్మకానికి సిద్ధంగా ఉంది, దీని సాంకేతిక స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌లను ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం, తమ కొత్త కంపాక్ట్ SUV సీరీస్ ఉత్పత్తిని హోండా ప్రారంభించింది మరియు మొదటి హోండా ఎలివేట్ వాహనం తాపుకారా, రాజస్థాన్ తయారీ యూనిట్ నుండి బయటకి వచ్చింది.
ఎలివేట్ తయారీ 90 శాతం కంటే ఎక్కువ స్థానికంగా జరుగుతుందని హోండా తెలియజేసింది. ఎలివేట్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది, రూ.5,000 టోకెన్ అమౌంట్ؚతో బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
అందిస్తున్న ఎక్విప్మెంట్
హోండా ఈ కాంపాక్ట్ SUVలో వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల కార్ؚప్లేలకు మద్దతు ఇచ్చే 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, లేన్ వాచ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ మరియు రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ల (ADAS) పూర్తి సూట్‌ను ఎలివేట్ పొందుతుంది.
ఇది కూడా చదవండి: ఎలివేట్ ఇంధన సామర్ధ్య గణాంకాలను వెల్లడించిన హోండా!
కేవలం ఒకే ఇంజన్ ఎంపిక
హోండా ఎలివేట్, హోండా సిటీలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఇది 121PS మరియు 145Nm టార్క్‌ను విడుదల చేస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVT ఆటోమ్యాటిక్ؚతో జోడించబడుతుంది. భారతదేశంలో హైబ్రిడ్ ఎంపికలో అందించకపోవచ్చు, కానీ పూర్తి ఎలక్ట్రిక్ వర్షన్ కొన్ని సంవత్సరాలలో రానుంది.
ఇది కూడా చూడండి: భారతదేశంలో కొత్త WR-Vని హోండా ఎలివేట్ తో అందించాలా?
అంచనా ధర పోటీదారులు
హోండా ఎలివేట్ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభంకావచ్చు. కారు తయారీదారు అంచనా ప్రకారం, దీని వెయిటింగ్ పీరియడ్ విడుదల సమయానికి 3 నెలలు ఉండవచ్చు, కాబట్టి మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే త్వరపడాలి.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వా గన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు MG ఆస్టర్‌లతో ఎలివేట్ పోటీ పడనుంది. త్వరలో విడుదల కానున్న సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚకు కూడా పోటీగా నిలుస్తుంది.