• English
  • Login / Register

హోండా e ప్రొడక్షన్-స్పెక్ EV అనేది 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ని అందిస్తుందని వెల్లడించింది

సెప్టెంబర్ 13, 2019 10:18 am sonny ద్వారా ప్రచురించబడింది

  • 44 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ORVM లలో ఆడి ఇ-ట్రోన్ లాంటి కెమెరాలను పొందుతుంది మరియు మరెన్నో!

  •  ఎలక్ట్రిక్ మోటారు కోసం రెండు పవర్ అవుట్‌పుట్‌ లతో 35.5kWh బ్యాటరీని ఉపయోగిస్తుంది: అవి 136PS మరియు 154PS.
  •  మొత్తం 5 స్క్రీన్‌లతో కూడిన డిజిటల్ డాష్‌బోర్డ్‌ను పొందుతుంది.
  •  ఆడి ఇ-ట్రోన్ మాదిరిగానే ORVM లు కెమారాతో మార్చబడి ఉంటాయి
  •  హోండా 2023 కి ముందు భారతదేశంలో E వంటి మాస్-మార్కెట్ EV ని ప్రవేశపెట్టే అవకాశం లేదు.

Honda e Production-spec EV Revealed With Over 200km Of Claimed Range

హోండా యొక్క మొట్టమొదటి మాస్-మార్కెట్ EV యొక్క ఉత్పత్తి-సిద్ధంగా వెర్షన్, హోండా E అని పేరు పెట్టబడింది, ఇది ఈ వారం ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ప్రవేశిస్తుంది. ఇది 2017 లో అర్బన్ EV కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబడింది మరియు 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శనలో ఉంది. అయితే దీని యొక్క ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌ ను 2019 జెనీవా మోటార్ షోలో చూపించడం జరిగింది. ఇప్పుడు మనకు హోండా E యొక్క మరిన్ని వివరాలు మరియు లక్షణాలు ఉన్నాయి.

Honda e Production-spec EV Revealed With Over 200km Of Claimed Range

హోండా E ను 35.5 కిలోవాట్ల లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీతో అమర్చారు మరియు ఎలక్ట్రిక్ మోటారును రెండు పవర్ అవుట్‌పుట్‌లలో అందిస్తోంది , అవి 136 పిఎస్ మరియు 154 పిఎస్ లు అయితే పీక్ టార్క్ 315 Nm వద్ద రెండిటిలోనీ అదే విధంగా ఉంటుంది. యాక్సిలరేషన్ గణాంకాలు E లో 8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగం చేరుకోగలదని పేర్కొన్నాయి.

Honda e Production-spec EV Revealed With Over 200km Of Claimed Range

ఈ చిన్న EV కోసం క్లెయిమ్ చేసిన పరిధి 220 కిలోమీటర్లు, సిసిఎస్ 2 (కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్) డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 0 నుండి 80 శాతం బ్యాటరీని తిరిగి నింపడానికి 30 నిమిషాల వేగవంతమైన ఛార్జ్ సమయం ఉంటుంది. ఈ శ్రేణి కొన్ని ఇతర కొత్త EV ల కంటే ఎక్కువగా లేదు, కానీ హోండా E ఇంట్రా-సిటీ రాకపోకల కోసం ఉద్దేశించబడింది.

మూడు-డోర్ల లేఅవుట్ మరియు ఫాన్సీ వీల్స్ వంటి అర్బన్ EV ప్రోటోటైప్‌ల యొక్క కొన్ని మంచి డిజైన్ అంశాలను తుది హోండా E తప్పిపోయినప్పటికీ, ఇది ORVM లకు బదులుగా కెమెరాల వాడకాన్నిమాత్రం నిలుపుకుంది. ఇది మొత్తం 5 స్క్రీన్‌లను కలిగి ఉన్న హోండా E డిజిటల్ డాష్‌బోర్డ్‌ లో భాగమైన డ్యూయల్ 12.3-అంగుళాల LCD టచ్‌స్క్రీన్‌లతో వస్తుంది. జెనీవాలోని ప్రోటోటైప్‌లో కనిపించే దాదాపు అన్ని లక్షణాలు తుది మోడల్‌ లోకి వచ్చాయి.

Honda e Production-spec EV Revealed With Over 200km Of Claimed Range

ఇది కొత్త యుగం EV అని చెప్పవచ్చు, హోండా E లో కనెక్ట్ చేయబడిన సర్వీసెస్ మరియు యాప్ కూడా ఉన్నాయి, వీటిని హోండా పర్సనల్ అసిస్టెంట్ అని పిలువబడే AI సదుపాయాన్ని ఉపయోగించి వాయిస్ కమాండ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. దాని కోసం ఆక్టివేషన్ పదబంధం కూడా చాలా సాధారణమైనది: అది “ఓకె హోండా.” మిగిలిన వాహానల నుండి భిన్నంగా చూసుకోవాలంటే ఇది ఒక మంచి అంశం అని చెప్పవచ్చు.

ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలు మరియు జపాన్లలో హోండా Eకోసం బుకింగ్‌లు తెరిచి ఉన్నాయి, అయితే ఈ చిన్న EV భారతదేశానికి రావడానికి స్పష్టమైన కాలక్రమం లేదు. జపనీస్ కార్ల తయారీదారు భారతదేశంలో E యొక్క టైలర్డ్ వెర్షన్ ను ప్రవేశపెట్టవచ్చు ,కాని 2023 కి ముందు కాదు, 2021 నాటికి మాస్ మార్కెట్ హైబ్రిడ్లు వస్తాయి.

Honda e Production-spec EV Revealed With Over 200km Of Claimed Range

ప్రస్తుతానికి, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఏకైక దీర్ఘ-శ్రేణి EV గా మిగిలిపోయింది, అయితే MG తన eZS ప్రారంభాన్ని 2020 కి నెట్టివేసింది.

ఇవి కూడా చదవండి: భారతదేశంలో ప్రారంభించబోయే 10 ఎలక్ట్రిక్ కార్లు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience