• English
  • Login / Register

జూలై 8 న జాజ్ ప్రారంభ తేదీని నిర్దారణ చేసిన హోండా- రూ .21,000 వద్ద అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం

హోండా జాజ్ 2014-2020 కోసం sourabh ద్వారా జూన్ 24, 2015 06:18 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హోండా సంస్థ యొక్క రాబోయే ప్రీమియం హాచ్బ్యాక్, జాజ్ కోసం హోండా డీలర్స్ ముందుగానే బుకింగ్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ కారును ఇప్పుడు ముందస్తు చెల్లింపు రూ 21,000 వద్ద బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఇప్పుడు హోండా జాజ్ ను అధికారికంగా జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు వారు చెప్పారు. ఇప్పుడు మూడో తరం జాజ్ లో ఇంధన సామర్థ్యం 1.5 లీటర్ కలిగిన ఐ-డిటిఇసి డీజిల్ ఇంజన్ ను దానితో పాటు శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ మిల్లు ను కూడా అందిస్తున్నట్లు వారు చెప్పారు. 

ఈ సరికొత్త హచ్బ్యాక్, ఒక కొత్త రూపంతో సిటీ సెడాన్ కి దగ్గర పోలికలతో వస్తోంది. దీనిలో మందంగా ఉండే నల్లటి గ్రిల్ అద్భుతంగా ఒక క్రోమ్ లైనింగ్ ద్వారా అలంకరించబడి ఉంది. స్వెప్ట్ బ్యాక్ హేడ్ల్యాంప్స్ మరియు లోయర్ ఎయిర్ డ్యామ్ మీద ఉండే హనీ కోంబ్ ప్యాటర్న్ దీనిని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేసింది. దీని సైడ్ ప్రొఫైల్ కూడా సెడాన్ ని తలపిస్తుంది. అయితే, దీని వెనుక వైపు ఎల్ఈ డి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు సి- పిల్లర్ మరియు విండ్ షీల్డ్ మధ్య ఉండే దాని ప్రతిబింబ అంశాలు దానిని పోలి ఉన్నాయి. 

జాజ్ యొక్క అంతర్గత డిజైన్ ఒక ఖరీదైన భావాన్ని ఇస్తుంది. టాప్ మోడల్ కార్లు ఎప్పుడు సిల్వర్ చేరికలతో లోపలి అన్ని భాగాలు బ్లాక్ కలర్ తో అందిస్తారు. ఇది హోండా సిటీ నుండి తీసుకోబడిన 15.7 సెం.మీ. టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థను కలిగి ఉంది. ఇది ఉపగ్రహ ఆధారిత స్వర దిశ నిర్దేశ మలుపు తర్వాత మలుపుతో కూడిన నావిగేషన్ వ్యవస్థను దానితో పాటు గా బ్లూటూత్ కనెక్టివిటి మరియు ఆడియో స్ట్రీమింగ్, మరియు డివిడి / సిడి ప్లేబ్యాక్ వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాక, ఈ కారులో 'మేజిక్ సీట్లు' మరియు ఏసి తో పాటుగా సిటీ సెడాన్ లో ఉన్నటువంటి టచ్ ప్యానెల్ నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంది. 

దీనిలో శక్తిమంతమైన డీజిల్ మోడల్ 1.5 లీటర్ ఐ-డిటిఈ సి ఇంజన్ ను పొందుపరిచారు, ఇది ఒక 100 పిఎస్ అవుట్ పుట్ మరియు 200 నానో మీటర్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంకో మోడల్ లో ఉన్నట్లుగానే దీని గేర్ బాక్స్ ని 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్ తో అమర్చారు. దీని పెట్రోల్ మోడల్ 1.2 లీటర్ ఐ-విటెక్ యూనిట్ 90పిఎస్ ని మరియు 110 నానో మీటర్ టార్క్ ని బయటకు ఉత్పత్తి చేస్తుంది. వాహన తయారీ దారుడు పెట్రోల్ లో 5-స్పీడ్ మాన్యువల్ ఎంపికను, మరియు ఒక ఆటోమేటిక్ సివిటి ట్రాన్స్మిషన్ ను అందిస్తున్నారు.

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience