హోండా సిటీ: ఓల్డ్ వర్సెస్ న్యూ - ఏ ఏ అంశాలు మార్చాడ్డాయి?
మే 25, 2019 11:29 am akas ద్వారా ప్రచురిం చబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరణ - ఫిబ్రవరి 14, 2017: 2017 హోండా సిటీ ప్రారంభించబడింది. దీని ధర రూ. 8.50 లక్షల నుంచి ప్రారంభమైంది
హోండా సిటీ, దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో ఒకటి. ఇది భారతీయ మార్కెట్ లో చాలా ప్రజాదరణ పొందింది అలాగే ఈ వాహనం, సౌలభ్యం మరియు పనితీరుకు ప్రసిద్ధి చెందింది. 2014 లో భారత మార్కెట్లో ఆరవ తరం సిటీ వాహనం ప్రవేశపెట్టబడింది. అయితే, ఈ ఫేస్లిఫ్ట్ థాయిలాండ్లో వెల్లడైంది మరియు 2017 ఫిబ్రవరిలో దేశంలో ప్రవేశపెట్టబడింది. వెనువెంటనే కొన్ని డీలర్షిప్లు సిటీ బుకింగ్లను అంగీకరించాయి. ఫేస్ లిఫ్ట్ కొన్ని కాస్మటిక్ మార్పులు మరియు కొన్ని కొత్త లక్షణాలను కలిగి ఉంటుంది. వాటిని తనిఖీ చేద్దాం.
ముందు భాగం
సిటీ ఫెసిలిఫ్ట్ వాహనంలోని మార్పులు ముందు భాగంలో మరింత ప్రముఖంగా ఉన్నాయి. ముందు తరం సిటీ వాహనంతో పోలిస్తే, కొత్త కారు ఒక సన్నగా క్రోమ్ రేడియేటర్ గ్రిల్ మరియు చిన్న ఫాగ్ లాంప్ హౌసింగ్ లను కలిగి ఉంటుంది. ముందు బంపర్ కూడా సవరించబడింది. అత్యంత ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, డే టైమ్ రన్నింగ్ ఎల్ ఈ డి లైట్ లతో కలిసి కొత్త ఎల్ ఈ డి హెడ్ల్యాంప్ లతో హెడ్ల్యాంప్ క్లస్టర్ సవరించబడింది.
సైడ్ భాగం
సైడ్ విషయానికి వస్తే, కొత్త తరం మరియు ముందు తరం సిటీ వాహనాలు ఒకేలా కనిపిస్తాయి, కొత్త సిటీ వాహనంలో 16 అంగుళాల టైర్లు డైమండ్- కట్ అల్లాయ్ వీల్స్ కొత్త సెట్లో అమర్చబడ్డాయి. ఈ ఒక్క తేడా మాత్రమే సైడ్ భాగంలో చోటుచేసుకుంది.
వెనుక భాగం
కొత్త తరం సిటీ వాహనం, నలుపు రంగు హానీకొంబు చేరికలతో కూడిన వెనుక బంపర్ మరింత దూకుడుగా శైలి కలిగి ఉంది. వెల్లడించిన థాయిలాండ్ - సిటీ వాహనం, పాత టైల్ లైట్లతో అదే విధంగా కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ, భారతీయ వెర్షన్ ఒక కొత్త సెట్ స్పెషల్ లెన్స్ లాంప్స్ మరియు ఒక సమీకృత స్టాప్ లైట్ వంటి అంశాలు వెనుక స్పాయిలర్ కు అమర్చబడి ఉంటాయి.
ఇంటీరియర్స్
ఈ సిటీ వాహనం యొక్క ఇంటీరియర్ భాగంలో ఏ విధమైన తేడా కనిపించదు. అయితే, క్యాబిన్ ఒక పెద్ద స్క్రీన్ (ఏడు అంగుళాలు) మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంది. ఇతర మార్పులు విషయానికి వస్తే, ఎల్ఈడి మ్యాప్ మరియు ఇంటీరియర్ లాంప్ లను కలిగి ఉన్నాయి. సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్బాగ్స్, వాహన స్టెబిలిటీ అసిస్టెన్స్ (విఎస్ఏ) మరియు మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా వంటి అదనపు భద్రత లక్షణాలు కూడా కలిగి ఉంది.
యాంత్రిక పరంగా, ముందు వెర్షన్ లో ఉండేటటువంటి 1.5 లీటర్ ఐ- వి టెక్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది ఈ ఇంజన్, ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ / సివిటి తో జత చేయబడి ఉంటుంది మరియు 1.5- లీటరు ఐ- డిటెక్ డీజిల్ ఇంజిన్ తో కూడా అందుబాటులో ఉంటుంది, ఇది ఆరు- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
మరింత చదవండి: హోండా సిటీ