హోండా సిటీ 2020 ఈవెంట్ రద్దు చేయబడింది
హోండా సిటీ 2020-2023 కోసం dinesh ద్వారా మార్చి 20, 2020 02:29 pm ప్రచురించబడింది
- 45 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండంతో ఈ నిర్ణయం తీసుకున్నారు
- దీని రివీల్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటుందని ఆశిస్తున్నాము. ఇంతకుముందు ఊహించిన విధంగా ఏప్రిల్ లో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నాము.
- ఐదవ-జెన్ సిటీకి 1.5-లీటర్ BS6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు ఉంటాయి.
- 6-స్పీడ్ MT మరియు CVT రెండు ఇంజన్ ఆప్షన్లతో ఆఫర్ లో ఉంటాయని భావిస్తున్నాము.
- ఇది V, VX మరియు ZX అనే మూడు వేరియంట్లలో అందించబడుతుంది.
- ధరలు రూ .11 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు ఉంటాయని భావిస్తున్నాము.
- ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్, VW వెంటో, స్కోడా రాపిడ్ మరియు టయోటా యారిస్‌లతో ఇది తన పోటీని తిరిగి పుంజుకుంటుంది.
ఏప్రిల్ 2020 లో ఐదవ తరం సిటీ ని ప్రారంభించే ముందు(అంచనా), మార్చి 16 న గోవాలో జరిగిన కార్యక్రమంలో హోండా కొత్త సెడాన్ ను ప్రదర్శించాల్సి ఉంది. అయితే, జపాన్ కార్ల తయారీసంస్థ ఈ కార్యక్రమానికి రద్దు చేయలని నిర్ణయించుకుంది. గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే మహమ్మారి కరోనావైరస్ కారణంగా ఈ ముందు జాగ్రత్త నిర్ణయం తీసుకోబడింది. ఈవెంట్ రద్దు చేయబడినప్పటికీ, ఆవిష్కరణ కోసం హోండా ఇంకా కొత్త తేదీని నిర్ధారించలేదు. ఇది రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ తో మాత్రమే ఉండే వ్యవహారం అని మేము ఆశిస్తున్నాము.
సిటీ 2020 గురించి హోండా ఇంకా ఏమీ వెల్లడించనప్పటికీ, బహుళ వర్గాల నుండి మనకు తెలిసిన దాని ఆధారంగా ఏమి ఆశించాలో మాకు సరైన ఆలోచన ఉంది. కాబట్టి, ఇంకేమీ ఆలోచించకుండా ఇంక పదండి చూద్దాం.
హోండా సిటీ 2020 V, VX మరియు ZX అనే మూడు వేరియంట్లలో అందించబడుతుంది. ఇది అవుట్గోయింగ్ మోడల్ కంటే ఒకటి తక్కువ ఎందుకంటే కొత్త సిటీ మాజీ బేస్-స్పెక్ SV వేరియంట్‌ను అందించదు.
అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే, కొత్త సిటీకి 1.5-లీటర్ BS 6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో కూడా అందించబడుతుంది. అయితే, ఇక్కడ పెట్రోల్ ఇంజన్ అవుట్‌గోయింగ్ కారు కంటే 121Ps పవర్ అనగా, 2Ps ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. టార్క్ గణాంకాలు తెలియకపోయినా, అవుట్గోయింగ్ సిటీ 145Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ తో పాటు CVT తో కూడా కొనసాగుతుంది. అవుట్‌గోయింగ్ సిటీకి 5-స్పీడ్ MT లభిస్తే, 2020 సిటీ 6-స్పీడ్ యూనిట్ తో కూడా వచ్చే అవకాశం ఉంది.
సిటీ డీజిల్ వివరాలు ఇంకా తెలియకుండా ఉన్నప్పటికీ, ఇది అవుట్గోయింగ్ మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నాము. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది 100 Ps పవర్ మరియు 200 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది, దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. కొత్త సిటీతో, డీజిల్ ఇంజిన్‌తో పాటు ఆప్షనల్ CVT ని కూడా హోండా అందిస్తుందని భావిస్తున్నాము.
కొత్త సిటీ కూడా పెద్దదిగా ఉంటుంది. ఇది 4569mm X 1748mm X 1489mm (LxWxH) పరిమాణం కలిగి ఉంటుంది, ఇది 129mm ఎక్కువ పొడవు, 53mm ఎక్కువ వెడల్పు, కానీ అవుట్గోయింగ్ మోడల్ కంటే 6mm తక్కువ ఎత్తు ని కలిగి ఉంటుంది. అయితే వీల్‌బేస్ 2600 మి.మీ వద్ద మారకుండా అదే విధంగా ఉంటుంది.
ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, LED హెడ్‌ల్యాంప్స్, సన్‌రూఫ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో పాటు, కొత్త సిటీ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కనెక్ట్ టెక్‌ను కూడా అందిస్తుంది.
2020 సిటీ ధరలు రూ .11 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు ఉంటాయని భావిస్తున్నాము. ఇది రాబోయే ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్, వోక్స్వ్యాగన్ వెంటో, స్కోడా రాపిడ్ మరియు టయోటా యారిస్ వంటివారికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
మరింత చదవండి: హోండా సిటీ డీజిల్