• English
  • Login / Register

మారుతి జిమ్నీ ప్రతి వేరియంట్ ఏమి అందిస్తోందో ఇక్కడ చూడండి

మారుతి జిమ్ని కోసం ansh ద్వారా జనవరి 19, 2023 07:00 pm ప్రచురించబడింది

  • 54 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఏ వేరియంట్‌ను బుక్ చేయాలో ఎంచుకోవడానికి ఈ వివరణాత్మక ఫీచర్లు మీకు సహాయపడతాయి

 

Maruti Jimny

ఆటో ఎక్స్‌పో 2023లో, మారుతి తన ఆఫ్-రోడర్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిమ్నీ దేశంలో ఫైవ్-డోర్ అవతార్‌తో వస్తుంది, ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జిమ్నీని రెండు వేరియంట్‌లలో పొందవచ్చు: జీటా మరియు ఆల్ఫా. అలాగే, ప్రతి వేరియంట్ ఏమి ఆఫర్ చేస్తుందో, టాప్-స్పెక్ వేరియంట్‌లో ప్రత్యేకత ఏమిటో మారుతి సుజుకి మీకు తెలియజేస్తుంది.

 

జీటా

Maruti Jimny grille

Maruti Jimny 6 Airbags

 

 

ఎక్స్టీరియర్ 

 

ఇంటీరియర్

ఇన్ఫోటైన్ మెంట్

కంఫర్ట్/కన్వీనియెన్స్

Safety

సేఫ్టీ

  • 15 అంగుళాల స్టీల్ వీల్స్

  • క్రోమ్ ప్లేటింగ్‌తో కూడిన గన్‌మెటల్ గ్రే గ్రిల్

  • టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్

  • హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ 

  • బ్లాక్ ఇంటీరియర్స్

  • 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్

  • వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే

  • 4 స్పీకర్లు

 
  • మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్

  • ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్‌విఏమ్‌లు

  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

  • అన్ని పవర్ విండోలు 

  • 6-ఎయిర్ బ్యాగులు

  • ఏబిఎస్ తో ఇబిడి

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి)

  • హిల్ హోల్డ్ మరియు డిసెంట్ కంట్రోల్

 

బేస్-స్పెక్ జీటా వేరియంట్ ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో EBD ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లను కలిగి ఉంది, అయితే ఇందులో అల్లాయ్ వీల్స్, ఆటో LED హెడ్ ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం బిట్‌లను కోల్పోతుంది.

సంబంధిత: ఈ 20 చిత్రాలలో మారుతి జిమ్నీ గురించి వివరంగా చూద్దాం

 

ఆల్ఫా

Maruti Jimny Cabin

Maruti Jimny Headlamp Washer

 

 

ఎక్స్‌టీరియర్

 

ఇంటీరియర్ 

ఇన్ఫోటైన్‌మెంట్

కంఫర్ట్/కన్వీనియెన్స్ 

 

సేఫ్టీ

 
  • 15 అంగుళాల అల్లాయ్ వీల్స్

  • ఆటో ఎల్‌ఇడి హెడ్ ల్యాంప్స్

  • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్

  • హెడ్ ల్యాంప్ వాషర్

  • ఫాగ్ ల్యాంప్స్

 
  • లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్

  • 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

  • వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే

  • 4 స్పీకర్లు ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్

  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

  • ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ఓఆర్‌విఎమ్‌లు

  • క్రూయిజ్ కంట్రోల్

  • పుష్ స్టార్ట్/స్టాప్

  • 6-ఎయిర్ బ్యాగులు

  • ఎబిఎస్ తో ఇబిడి

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి)

  • హిల్ హోల్డ్ మరియు డిసెంట్ కంట్రోల్

టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్ తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో LED హెడ్‌ల్యాంప్‌లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, అర్కామిస్-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో జీటా వేరియంట్ కంటే ముందడుగు వేస్తుంది. సేఫ్టీ ఫీచర్లు జీటా వేరియంట్ మాదిరిగానే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 5-డోర్ మారుతి జిమ్నీ మరియు మహీంద్రా థార్ మధ్య 7 కీలక వ్యత్యాసాలు

రెండు వేరియంట్లు ఒకే పవర్‌ట్రెయిన్ మరియు ఆఫ్-రోడింగ్ ఆవశ్యకతలను పంచుకుంటాయి, అవి క్రింది పట్టికలో వివరించబడ్డాయి:

Maruti Jimny Low Range Transfer Case

 

స్పెసిఫికేషన్లు

 

జీటా

 

ఆల్ఫా

 

ఇంజిన్

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్

ట్రాన్స్ మిషన్

5-స్పీడ్ ఎమ్‌టి /4-స్పీడ్ ఏటి

 

పవర్

105PS

 

టార్క్

134.2Nm

డిఫరెన్షియల్

బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్

జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫ్-రోడర్ 105PS మరియు 134.2Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు నాలుగు చక్రాల డ్రైవ్‌ట్రైన్‌ను పొందుతుంది.

Maruti Jimny

మారుతి జిమ్నీ కోసం బుకింగ్స్ ఓపెన్ చేయబడ్డాయి మరియు ఇది త్వరలో రూ.10 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది లాంచ్ అయిన తరువాత, మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖాకు ప్రత్యక్ష పోటీగా ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti జిమ్ని

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience