• English
  • Login / Register

ఈ 7 ఫోటోలలో కొత్త kia sonet యొక్క HTX+ వేరియంట్ గురించి వివరణ

కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 20, 2023 09:34 pm సవరించబడింది

  • 88 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కియా సోనెట్ యొక్క టెక్ (HT) లైన్ కింద HTX+ పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్ మరియు దీని ఎక్స్టీరియర్ లో కొన్ని మార్పులు చేయడం వల్ల, ఇది GT లైన్ మరియు X-లైన్ ట్రిమ్ల కంటే భిన్నంగా ఉంటుంది.

2024 Kia Sonet HTX+

కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను భారతదేశంలో ప్రదర్శించారు. ఈ కొత్త SUV కారు eఎ మూడు బ్రాడ్ ట్రిమ్ లో లభించనున్నట్లు కంపెనీ ధృవీకరించారు: టెక్ (లేదా HT) లైన్, GT లైన్ మరియు X-లైన్. మేము ఇప్పటికే ఈ కారు యొక్క టాప్ వేరియంట్ GTX+ గురించి సమాచారాన్ని పంచుకున్నాము, ఇప్పుడు మేము దాని HTX+ వేరియంట్ యొక్క పూర్తి వివరాలను మీ కోసం తీసుకువచ్చాము, కాబట్టి సోనెట్ ఫేస్లిఫ్ట్ కారు యొక్క పూర్తి లోడెడ్ HTX+ వేరియంట్లో ప్రత్యేకత ఏమిటో చిత్రాల ద్వారా తెలుసుకుందాం:

ఎక్స్టీరియర్

2024 Kia Sonet HTX+

ఫ్రంట్ ప్రొఫైల్ GTX+ వేరియంట్ కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ముందు భాగంలో సిల్వర్ ఇన్సర్ట్స్ లేని రీడిజైన్ చేసిన గ్రిల్ ఉంటుంది. సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో 360 డిగ్రీల యూనిట్ లేనందున ఈ వేరియంట్ లో ఫ్రంట్ కెమెరా కూడా లేదు

2024 Kia Sonet HTX+ front

మీరు నిశితంగా పరిశీలిస్తే, మీకు దాని HTX+ వేరియంట్లో పొడవైన LED DRL స్ట్రిప్స్ కనిపిస్తాయి, ఇది బంపర్ యొక్క దిగువ ఉంటుంది. వర్టికల్ లేఅవుట్లో 3-పీస్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో రీడిజైన్ చేసిన బంపర్ మరియు పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంటుంది.

2024 Kia Sonet HTX+ side
2024 Kia Sonet HTX+ alloy wheel

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కియా సోనెట్ HTX+ వేరియంట్ లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఇది చూడటానికి GTX+ వేరియంట్ కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఈ వేరియంట్లో 360 డిగ్రీల కెమెరా లేనందున, ఇందులో ORVM-మౌంటెడ్ కెమెరా ఉండదు.

2024 Kia Sonet HTX+ rear

2024 కియా సోనెట్ HTX+ వేరియంట్ వాషర్, రేర్ వైపర్లు మరియు కనెక్టెడ్ LED టెయిల్లైట్లతో డీఫాగర్‌తో లభిస్తుంది. వెనుక భాగంలో 'సోనెట్' బ్యాడ్జింగ్ ఉంటుంది, బంపర్ కింద వెడల్పాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది.

ఇంటీరియర్

2024 Kia Sonet HTX+ cabin

ఫేస్ లిఫ్టెడ్ కియా సోనెట్ యొక్క HTX+ వేరియంట్ క్యాబిన్ లోపల బ్రౌన్ కలర్ ఇన్సర్ట్ లతో బ్లాక్ మరియు బ్రౌన్ థీమ్ ను పొందుతుంది. ఈ వేరియంట్లో రీడిజైన్ చేసిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు ఫేస్ లిఫ్ట్ సెల్టోస్ తో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే లభిస్తుంది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, సన్ రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగులు, 4 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ (డీజిల్-iMT కాంబినేషన్ మాత్రమే) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2024 Kia Sonet HTX+ rear seats

2024 కియా సోనెట్ యొక్క HTX+ వేరియంట్ లో వెనుక ప్రయాణీకుల కోసం AC వెంట్లు, కప్‌హోల్డర్‌లతో కూడిన ఆర్మ్‌రెస్ట్, సన్‌షేడ్‌లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు (మిడిల్ ప్యాసింజర్ కోసం కాదు), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు మరియు 3-పాయింట్ సీట్ సీట్‌బెల్ట్‌ల వంటి ఫీచర్లు ఉంటాయి.

ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ HTX+ వేరియంట్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ లతో మాన్యువల్ గేర్ బాక్స్ (iMTతో సహా) తో మాత్రమే లభిస్తుంది.

ఆశించిన విడుదల & ధర

కొత్త కియా సోనెట్ SUV ని జనవరి 2024 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా. ఇది మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

ఇది కూడా చదవండి: వ్యత్యాసాలను తెలుసుకోండి: కొత్త vs పాత కియా సోనెట్

మరింత చదవండి: కియా సోనెట్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Kia సోనేట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience