• English
  • Login / Register

ఫోర్డ్ ఇండియా వారు ఫోర్డ్ ఆస్పైర్ బుకింగ్స్ ని జులై 27, 2015 నుండి ఆహ్వానిస్తారు

ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం sourabh ద్వారా జూలై 24, 2015 05:17 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ ప్రేమికులకు ఎదురుచూపు ఇక ముగిసింది! కొత్త కాంపాక్ట్ సెడాన్ అయిన ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ రూ.30,000 వేల ముందస్తు చెల్లింపుతో బుకింగ్ ని అందుకుంటారు. స్విఫ్ట్ డిజైర్ కి పోటీదారి అయిన ఈ కారు లో డ్రైవరుకి మరియూ ప్యాసెంజరుకి కూడా ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉన్నాయి మరియూ టాప్ ఎంద్ వేరియంట్ లో అధిక సురక్షణకై ఆరు ఎయిర్ బ్యాగ్స్ ని అమర్చడం జరిగింది. 

ఫీగో ఆస్పైర్ లో ఆధునిక కనెక్టివిటీ సొల్యూషన్స్, మైఫోర్డ్ డాక్ లేదా వినూత్న ఫోర్డ్ కీ కలిగిన ఫోర్డ్ ఆప్లింక్ గల సింక్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కంపెనీ వరు ఈ కాంపాక్ట్ సెడాన్ ని ఆగస్ట్ నెలలో ఆంబియంట్, ట్రెండ్, టైటనియం మరియూ టైటానియం+ అనే నాలుగు ట్రిమ్ములు గా విడుదల చేయనున్నారు.

ఫోర్డ్ ఇండియా యొక్క మార్కెటింగ్, సేల్స్ మరియూ సర్వీసు విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అయిన అనురాగ్ మెహ్రోత్రా ఈ సబ్-4 మీటరు సెడాన్ గురించి మాట్లాడుతూ, " ప్రత్యేకంగా భారతీయ కస్టమర్లకై తయారు చేసిన ఈ కారులో విస్తుపోయే డిజైను, స్మార్ట్ టెక్నాలజీ, ఆధునిక సురక్షణ మరియూ ఆకట్టుకునే మైలేజీ వంటివి ఉన్నాయి", అని అనారు.

ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ ని పెట్రోలు మరియూ డీజిలు లో అందిస్తున్నారు. డీజిలు మోడలు కి 100పీఎస్ ని ఉత్పత్తి చేశే 1.5-లీటరు టీడీసీఐ ఇంజినుని అమర్చారు. పెట్రోల్ వరియంట్స్ కి 88పీఎస్ ని ఇచే 1.2-లీటరు టీ-వీసీటీ ఇంజినుని అందించారు. రెండు ఇంజిన్లకి 5-స్పీడ్ మన్యువల్ ట్రాన్స్మిషను ని అందించారు. డీజిల్ ఫీగో ఆస్పైర్ కి మైలేజీ ని లీటరుకి 25.8కీ.మీ మరియూ పెట్రోల్ మోడలు కి లీటరుకి 18.2 కీ.మీ వెల్లేట్టుగా అందించారు. 

లీటరుకి 17.26 కీ.మీ మైలేజీ ని ఇచ్చి, 112పీఎస్ శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటరు టీవీసీటీ పెటృఓల్ ఇంజినుని కలిగి ఉన్న టృఇం కి 6-స్పీడ్ పవర్షిఫ్ట్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ వరియంట్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford Fi గో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: మార, 2025
  • బివైడి సీగల్
    బివైడి సీగల్
    Rs.10 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: జనవ, 2025
  • లెక్సస్ lbx
    లెక్సస్ lbx
    Rs.45 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: డిసంబర్, 2024
  • ఎంజి 3
    ఎంజి 3
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
  • నిస్సాన్ లీఫ్
    నిస్సాన్ లీఫ్
    Rs.30 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
×
We need your సిటీ to customize your experience