ఫోర్డ్ ఎండీవర్ వేరియంట్లు - ఏది సరైనదో నిర్ణయించుకోండి
published on జనవరి 25, 2016 11:08 am by nabeel for ఫోర్డ్ ఎండీవర్ 2015-2020
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఫోర్డ్ చివరకు భారత మార్కెట్లో కొత్త ఎండీవర్ ప్రవేశపెట్టింది. ఈ వాహనం రూ.24.75 లక్షలు(ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద పోటీ ధరను కలిగి ఉంది. ఫోర్డ్ సంస్థ ఎల్లప్పుడూ అన్ని అంశాలతో విజయ మార్గాన్ని చేరుకుంటూ ఉంటుంది. భారతదేశంలో 2.2 లీటరు మరియు ఒక 3.2 లీటర్ రెండు ఇంజిన్లు అందించబడుతున్నాయి. దీనిలో ముందుగా 2.2 లీటర్ ఇంజిన్ 3200rpm వద్ద 157.8 bhp శక్తిని మరియు 1600-2500rpm వద్ద 385Nm టార్క్ ని అందిస్తుంది. అయితే తరువాతి 3.2 లీటర్ ఇంజిన్ 3000rpm వద్ద 197.2bhp శక్తిని మరియు 1750-2500rpm వద్ద 470Nm టార్క్ ని అందిస్తుంది. ఈ కారు ట్రెండ్ మరియు టైటానియం అను రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ట్రెండ్ రెండు ఇంజిన్లలో అవే లక్షణాలు అందిస్తుంది, కానీ టైటానియం 3.2L, 2.2L మీద కొన్ని అదనపు లక్షణాలు కలిగి ఉంది. ఇక్కడ ప్రతి వేరియంట్ ఏయే లక్షణాలను అందిస్తుందో పూర్తి సమాచారం అందించబడి ఉంది మరియు తద్వారా ఏది మీకు ఉత్తమమైనదో తెలుసుకోండి.
ట్రెండ్
ట్రెండ్ వేరియంట్ అనేక లక్షణాల సమూహంతో వస్తుంది. ఒక 25 లక్షల రూపాయల ధరకి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో అటువంటి అన్ని లక్షణాలను ఈ వాహనం కలిగి ఉంది. ఎవరైతే ప్రీమియం ఎస్యూవీ స్పేస్ లోనికి వెళ్దాం అనుకుంటారో వారికి ఎండీవర్ ట్రెండ్ పరిపూర్ణంగా ఉంటుంది. ఈ వాహనం 2WD మరియు 4WD రెండు ఎంపికలను కలిగి ఉండి సిటీ మరియు ఆఫ్ సిటీ డ్రైవింగ్ రెండిటినీ సులభతరం చేస్తుంది. ఇక్కడ ఈ వేరియంట్లో ప్రధాన ఆకర్షణల జాబితా ఉంది.
- శరీర రంగు డోర్ హ్యాండిల్స్
- బ్లాక్ సైడ్ స్టెప్పర్
- ఫ్రంట్ బకెట్ సీట్స్
- ముందు మరియు వెనుక ఆర్మ్ రెస్ట్
- రిక్లైన్ మరియు స్లైడింగ్ ఫంక్షన్ తో రెండవ వరుస
- 4 పవర్ అవుట్ లెట్లు
- 8-మార్గం శక్తి సర్దుబాటు డ్రైవర్ సీటు
- లెథర్ అపోలిస్ట్రీ
- రిమోట్ కీలెస్ఎంట్రీ
- డ్రైవర్ సైడ్ ఒక టచ్ అప్ / డౌన్ పవర్ విండో
- ద్వంద్వ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ప్రదర్శనతో వెనుక వీక్షణ కెమెరా
- అడ్జస్టబుల్ స్పీడ్ లిమిటర్
- క్రూయిజ్ కంట్రోల్
- అద్దం తో ప్యాసింజర్ సన్ విజర్
- CD / MP3, FM / AM, ఆక్స్-ఇన్, బ్లూటూత్, డ్యూయల్ USB పోర్టులు
- 10 స్పీకర్స్
- యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్
- TFT టచ్ స్క్రీన్
- ABS + EBD
- ద్వంద్వ ముందు ఎయిర్బ్యాగ్స్
- ESP
- హిల్ లాంచ్ అసిస్ట్
2.2 లీటర్ టైటానియం
టైటానియం వేరియంట్ మరింత సౌకర్యవంతంగా, సౌకర్యం మరియు భద్రత యొక్క తీరుతెన్నులను కలిగి ఉంటుంది. ఎవరైతే బెటర్ ప్రీమియం ఎస్యూవీ కోసం మరియు డిఫరెంట్ కారు కోసం చూస్తున్నారో వారికి ఈ 2.2L ఎండీవర్ టైటానియం అంతిమ కొనుగోలు అవుతుంది.
- క్రోం డోర్ హాండిళ్లు మరియు ORVMs
- సిల్వర్ సైడ్ స్టెప్పర్
- LED DRLs మరియు టెయిల్ లైట్లు
- మల్టీకలర్ పరిసర లైటింగ్
- గ్రాఫిక్స్ తో ఫ్రంట్ స్కఫ్ ప్లేట్స్
- డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం ఒక టచ్ అప్ / డౌన్ పవర్ విండో
- అద్దంతో ఇల్యుమినేటెడ్ సన్ విజర్
- ఆటో డిమ్మింగ్ అద్దాలు
- స్వయంచాలక హెడ్ల్యాంప్స్
- ముందు పార్కింగ్ సెన్సార్
- టైర్ ప్రెజర్ మానిటర్ వ్యవస్థ
- వాల్యుమెట్రిక్ దొంగ అలారం
- సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్బ్యాగ్స్
3.2 లీటర్ టైటానియం
ఇది ఒక ట్రూ బ్లూ ఆఫ్ రోడర్. ఎవరైతే క్రోం ఉన్నా పర్వాలేదు అనుకుంటారో అటువంటి వారికి ఈ 3.2 లీటరు, 4WD వాహనం సరైనది. ఈ ట్రిమ్ పూర్తిగా లక్షణాలు మరియు శక్తి తో లోడ్ చేయబడి ఉంది. ఇది ఆఫ్ రోడింగ్ కి ఉత్తమమైన వాహనం. ఎవరైతే ఎక్కువగా ఎస్యువి ని ఇష్టపడతారో వారికి ఈ 3.2L టైటానియం పరిపూర్ణమైనది.
- సైడ్ అద్దంతో పడుల్ ల్యాంప్
- హీటెడ్ సైడ్ అద్దాలు
- సెమీ ఆటో సమాంతర పార్క్ సహాయం
- పవర్ ఫోల్డింగ్ థర్డ్ రో సీటు
- ఎలక్ట్రిక్ విస్తృత సన్రూఫ్
- టెర్రైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ(అన్ని 4WD రకాలు)
- హిల్ డిసెంట్ నియంత్రణ (అన్ని 4WD రకాలు)
- డ్రైవర్ మోకాలి ఎయిర్బ్యాగ్
ఫోర్డ్ ఎండీవర్ మొదటి డ్రైవ్ వీక్షించండి
ఇంకా చదవండి
రారాజు లాంటి ఫార్చ్యూనర్ వాహనాన్ని అదిగమిస్తున్న ఎండీవర్
- Renew Ford Endeavour 2015-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful